Reservation in Promotion: బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లు కల్పించాలి
తుర్కయంజాల్‌లోని రొక్కం సత్తిరెడ్డి గార్డెన్స్‌లో శుక్రవారం నిర్వహించిన రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బీసీలు అడగడం మానుకుని తిరగబడటం నేర్చుకోవాలని, పోరాటాలు చేస్తే మన వాటా మనకు లభించదా అని ప్రశ్నించారు. 75 ఏళ్లు గడిచినా బీసీల బతుకులు మారలేదని, అధికారం అడ్డుపెట్టుకుని అగ్రకులాల వారు వేలు, లక్షల కోట్లకు పడగలెత్తారని ఆరోపించారు.
Also read: Telangana WDCW Department : ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు.. చివరి తేదీ ఇదే..
బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లకు చట్టపరమైన, రాజ్యాంగ పరమైన, న్యాయపరమైన అవరోధాలు లేవని, గతంలో పాలించిన ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేకే రిజర్వేషన్లు అమలు చేయలేదన్నారు. పార్లమెంట్‌లో బీసీ బిల్లు పెట్టి 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలనికోరారు. వైఎస్సార్‌సీపీ రెండేళ్ల క్రితం పార్లమెంట్‌లో బీసీ బిల్లు ప్రవేశపెట్టిందని, దీనికి దేశంలోని 14 పార్టీలు మద్దతిచ్చాయని గుర్తుచేశారు. బీసీల విద్యా, ఉద్యోగ రిజర్వేషన్లపై ఉన్న క్లిమిలేయర్‌ను తొలగించాలని, ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసి, అభివృద్ధికి ప్రత్యేక పథకాలను రూపొందించాలన్నారు. జాతీయ స్థాయిలో రూ. 2లక్షల కోట్లతో బీసీ సబ్ ప్లాన్ ఏర్పాటు చేసి, జనాభా లెక్కల్లో బీసీ కులాల వారి లెక్కలను సేకరించాలని కోరారు.
Also read: Govt ITIలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
బీసీ సంక్షేమ సంఘం
జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య