Adimulapu Suresh: స్కూళ్లకు, కాలేజీలకు సెలవులు ఇవ్వం..ఎందుకంటే..?
రాష్ట్రంలో స్కూళ్లకు సెలవులు ఇచ్చే ఆలోచన లేదని మంత్రి స్పష్టం చేశారు. కొన్ని యూనివర్శిటీలు పరీక్షలు కూడా నిర్వహిస్తున్నాయన్నారు.కోర్టు కూడా పరీక్షలకు అనుమతి ఇచ్చిందన్నారు. పిల్లలకు కరోనా సోకితే ఆ స్కూల్‌ను మాత్రమే మూసివేసి తర్వాత ప్రారంభిస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి భేటీలో ఉద్యోగులు పీఆర్సీకి అంగీకరించారని.. మళ్లీ ఇప్పుడు ఆందోళన చేయడం సరికాదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు.ఇబ్బందులుంటే ప్రభుత్వంతో మాట్లాడవచ్చన్నారు.
క్లారిటీ ఇదే..
ఆంధ్రప్రదేశ్‌లో సంక్రాంతి సెలవులు పొడిగింపు ఆలోచన లేదని ప్రకటించిన విధంగా యధావిధిగా పాఠశాలలు నడుస్తాయని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ ఒక ప్రకటనలో తెలిపారు.ప్రభుత్వం విద్యార్థుల ఆరోగ్య భద్రత తో పాటు భవిష్యత్తు గురించి కూడా ఆలోచిస్తుందని ఆయన చెప్పారు. ఇప్పటికే ఉపాధ్యాయులకు వ్యాక్సిన్ ప్రక్రియ పూర్తి చేశామని, 15 నుంచి 18 సంవత్సరాల వయసు విద్యార్థులకు కూడా దాదాపు 92 శాతం వ్యాక్సిన్ వేయడం జరిగిందని అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని పాఠశాలలను యధావిధిగా నడపాలని ఆలోచిస్తూనే వారి ఆరోగ్య భద్రత పై కూడా డేగ కన్నుతో నిఘా ఉంచడం జరిగిందన్నారు. కోవిడ్ నిబంధనలను అనుసరిస్తూ పాఠశాలలను నడిపేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ విషయంలో తల్లిదండ్రులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి చెప్పారు. ఇప్పటికైతే పాఠశాలలకు సెలవులు ప్రకటించే ఆలోచన లేదని భవిష్యత్తులో కేసుల తీవ్రతను బట్టి ఏదైనా నిర్ణయం తీసుకునేందుకు ఆలోచిస్తామని ఆయన చెప్పారు.
జనవరి 30 వరకు సెలవులు..
తెలంగాణలో అన్ని విద్యాసంస్థలకు సెలవులు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జనవరి 30 వరకు సెలవుల్ని పొడిగించినట్లు తెలంగాణ చీఫ్‌సెక్రటరీ ప్రకటించారు.కరోనా నేపథ్యంలోనే విద్యా సంస్థలకు సెలవులు పొడిగించినట్లు తెలిపారు. జనవరి తొలి వారంలోనే కేసుల సంఖ్య గణనీయంగా పెరగడంతో సంక్రాంతి సెలవులను మూడు రోజులు ముందుకు జరిపి జనవరి 8వ తేదీ నుంచే ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. సంక్రాంతిని కలిపేసుకుని 16వ తేదీ వరకు సెలవులు ఉండగా.. 17 నుంచి విద్యా సంస్థలు తెరవాల్సి ఉంది.
ఆన్‌లైన్ పాఠాలను..
తెలంగాణలో కరోనా ఆంక్షలను జనవరి 20వ తేదీకి వరకు ప్రభుత్వం పొడిగించిన నేపథ్యంలో.. విద్యా సంస్థలకు సెలవులు కూడా పొడిగించాలని వైద్య,ఆరోగ్య శాఖ ప్రభుత్వానికి సూచించినట్లు తెలుస్తోంది. జనవరి 20వ తేదీ వరకు రాష్ట్రంలో ర్యాలీలు, సభలను జరపరాదని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. దాంతో సెలవులను కూడా 30వ తేదీ వరకు పొడిగించారు. ఎక్కువ రోజులు సెలవులు పొడిగిస్తే మాత్రం సర్కారు స్కూళ్లు, జూనియర్ కాలేజీ విద్యార్థులకు టీవీల ద్వారా ఆన్‌లైన్ పాఠాలను ప్రసారం చేయాల్సి ఉంటుంది. లేకపోతే అటు ప్రత్యక్ష తరగతులు, ఇటు ఆన్‌లైన్ పాఠాలు నిర్వహించలేదన్న విమర్శలు వస్తాయని ప్రభుత్వం యోచిస్తోంది.
Breaking News: తెలంగాణలో విద్యాసంస్థల సెలవులు పొడిగింపు.. ఇక ఏపీలో అయితే.. ?
Breaking News: జనవరి 31 వరకు సెలవులు.. తెలుగు రాష్ట్రాల్లో..?
Omicron & Covid effect: కల్లోలం..జనవరి 31వ తేదీ వరకు పాఠశాలలు సెలవులు
Holidays: జూనియర్ కాలేజీలకు సెలవులు
Telangana: జనవరి 8 నుంచి 16 వరకు విద్యాసంస్థలకు సెలవులు
విద్యాసంస్థలకు మళ్లీ రెండు వారాలు సెలవులు ఇచ్చే అవకాశం..ఎందుకంటే..?
Omicron Effect: రేపటి నుంచి స్కూల్స్, కాలేజీలకు సెలవులు..కారణం ఇదే..