Skip to main content

Andhra Pradesh : ఏపీలో రేప‌టి నుంచే దసరా సెలవులు.. ఈ సారి మాత్రం..

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఆంధ్రప్రదేశ్‌లోని పాఠశాల విద్యార్థులకు సెప్టెంబర్‌ 26 నుంచి దసరా సెలవులు ప్రారంభం కానున్నాయి.

అక్టోబర్ 6వ తేదీ వరకు ప్రభుత్వం దసరా సెలవులను ప్ర‌భుత్వం ప్రకటించింది. మొత్తం 10 రోజులు పాటు స్కూల్స్‌కు ద‌స‌రా సెల‌వులు రానున్నాయి. క్రిస్టియన్‌, మైనారిటీ పాఠశాలలకు మాత్రం అక్టోబర్‌ 1 నుంచి 6వరకు సెలవులు ఇచ్చారు.

ఏపీ ప‌దోత‌ర‌గ‌తి స్ట‌డీమెటీరియ‌ల్‌, సిల‌బ‌స్‌, మోడ‌ల్ పేప‌ర్స్‌, ప్రీవియ‌స్ పేప‌ర్స్ మొద‌లైన వాటి కోసం క్లిక్ చేయండి

అక్టోబ‌ర్ 7వ తేదీ నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. ఈ విద్యా సంవత్సరంలో పాఠశాలలకు 220 పనిదినాలు, 80 సెలవులుగా ప్రకటించారు. ఏపీ రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి అకడమిక్ క్యాలెండర్(2022-23)లో ముందుగా ద‌స‌రా సెల‌వుల గురించి ఇచ్చిన విష‌యం తెల్సిందే. ఈ మేర‌కే ద‌స‌రా సెల‌వులను ఏపీ విద్యాశాఖ ప్ర‌క‌టించింది.

ఇంటర్మీడియెట్ మోడల్ పేపర్స్

తెలంగాణ‌లో మాత్రం ఎక్కువ‌గానే..

Holidays

తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులకు.. ఈ ఏడాది దసరా పండుగ సెలవులను 15 రోజులపాటు ఇస్తున్న‌ట్టు అధికారికంగా ప్రకటించింది. అలాగే అక్టోబర్‌ 10వ తేదీన విద్యాసంస్థలు తిరిగి తెరుచుకోనున్నాయి.
అక్టోబర్‌ 5వ తేదీన దసరా పండుగగా ప్రభుత్వం నిర్ణయించింది.

టీఎస్‌ ప‌దోత‌ర‌గ‌తి స్ట‌డీమెటీరియ‌ల్‌, సిల‌బ‌స్‌, మోడ‌ల్ పేప‌ర్స్‌, ప్రీవియ‌స్ పేప‌ర్స్ మొద‌లైన వాటి కోసం క్లిక్ చేయండి

ఈ సారి దుర్గాదేవి న‌వ‌రాత్రి ఉత్సవాల‌కు(దసరా) ఈ సారి స్కూల్స్‌, కాలేజీ  భారీగా సెల‌వుల‌ను ఇచ్చారు. తెలంగాణలో అత్యంత వైభవంగా జరుపుకునే పండుగల్లో దసరా ఫస్ట్ ప్లేస్‌లో ఉంటుంది. అందుకే స్కూల్స్, కాలేజీలకు ముందుగానే హాలీడేస్ ను ప్ర‌క‌టించారు. అలాగే ఇప్ప‌టికే చాలా రాష్ట్రాల ప్ర‌భుత్వాలు స్కూల్స్‌కు, కాలేజీల‌కు, ప్ర‌భుత్వ కార్యాల‌యాల‌కు సెల‌వులు ప్ర‌క‌టించాయి.

ఇంటర్మీడియెట్ ప్రివియస్‌ పేపర్స్

ఇంటర్మీడియెట్ స్టడీ మెటీరియల్

Published date : 24 Sep 2022 06:28PM

Photo Stories