Skip to main content

Telangana : లైబ్రేరియన్‌ పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ నోటిఫికేష‌న్‌.. మొత్తం ఎన్ని పోస్టులంటే..

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (టీఎస్‌పీఎస్సీ) నుంచి మ‌రో నోటిఫికేష‌న్ వెలువడింది. తెలంగాణ విద్యాశాఖలో 71 లైబ్రేరియన్‌ పోస్టుల భర్తీకి డిసెంబ‌ర్ 31వ తేదీ (శ‌నివారం) నోటిఫికేషన్‌ను విడుద‌ల చేశారు.

ఈ 71 పోస్టుల‌ల్లో తెలంగాణ ఇంటర్‌ కమిషనరేట్‌లో 40 లైబ్రేరియన్‌ పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. అలాగే తెలంగాణ సాంకేతిక విద్యాశాఖలో 31 లైబ్రేరియన్‌ పోస్టులు భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాల‌కు జనవరి 21వ తేదీ నుంచి ఫిబ్రవరి 10వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించ‌నున్నారు.

చదవండి: టీఎస్‌పీఎస్సీ - స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సక్సెస్ స్టోరీస్ | గైడెన్స్ | సిలబస్ | ప్రివియస్‌ పేపర్స్ | ఎఫ్‌ఏక్యూస్‌ | ఆన్‌లైన్ క్లాస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ | ఏపీపీఎస్సీ

ముఖ్యాంశాలు ఇవే..
☛ తెలంగాణ విద్యాశాఖలో 71 లైబ్రేరియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌
☛ ఈ 71 పోస్టుల్లో తెలంగాణ ఇంట‌ర్‌ కమిషనరేట్‌లో 40 లైబ్రేరియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేష‌న్ ఇచ్చారు. అలాగే సాంకేతిక విద్యాశాఖలో 31 లైబ్రేరియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుద‌ల చేశారు.
☛ ఈ ఉద్యోగాల‌కు జ‌న‌వ‌రి 21వ తేదీ నుంచి ఫిబ్రవరి 10వ తేదీ వరకు దరఖాస్తులను స్వీక‌రించ‌నున్నారు.

71 ఉద్యోగాల పూర్తి వివ‌రాలు ఇవే..

tspsc 71 jobs details in telugu

➤ TSPSC : 544 ఉద్యోగాల భర్తీకి టీఎస్‌పీఎస్సీ మరో నోటిఫికేషన్ విడుద‌ల‌.. పోస్టుల వివ‌రాలు ఇవే..

➤ TSPSC : తెలంగాణ పురపాలకశాఖలో ఉద్యోగాల‌ భర్తీకి నోటిఫికేషన్‌.. పూర్తి వివ‌రాలు ఇవే..

Published date : 31 Dec 2022 09:42PM

Photo Stories