TSPSC Group 3 Posts : గ్రూప్-3లో 1500 పోస్టులకు.. గూప్-2లో 783 ఖాళీలకు నోటిఫికేషన్..?
వివిధ ప్రభుత్వ విభాగాల నుంచి ప్రతిపాదనలను స్వీకరించిన టీఎస్‌పీఎస్సీ పరిశీలన ప్రక్రియను పూర్తిచేసింది. ఏ క్షణమైన ఈ రెండు నోటిఫికేషన్లులను విడుదల చేసేందుకు సిద్ధంగా ఉంది.
చదవండి: టీఎస్‌పీఎస్సీ - స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సక్సెస్ స్టోరీస్ | గైడెన్స్ | సిలబస్ | ప్రివియస్ పేపర్స్ | ఎఫ్‌ఏక్యూస్ | ఆన్‌లైన్ క్లాస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ | ఏపీపీఎస్సీ
గ్రూప్-2లో..
తొలుత గ్రూప్-2లో 663 పోస్టులను గుర్తించిన ప్రభుత్వం ఆమేరకు ఆగస్టు 30న జీవో జారీచేసింది. అయితే గ్రూప్-2 స్థాయి కలిగిన మరో 120 ఉద్యోగాలను కూడా తాజాగా ఇందులో చేర్చి మొత్తంగా 783 పోస్టులకు నోటిఫికేషన్ జారీచేయనున్నట్టు తెలుస్తోంది. కొత్తగా వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్‌కు సంబంధించి 43 పోస్టులు, శిశు, సంక్షేమ శాఖ పరిధిలోని డిస్ట్రిక్ట్ ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టులు సుమారు 70 పోస్టులు ఇందులో ఉన్నాయి. ఇప్పటికే టీఎస్‌పీఎస్సీ 9,168 గ్రూప్-4 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ను విడుదల చేసిన విషయం తెల్సిందే.
చదవండి: TSPSC Group 4 Notification: 9,168 గ్రూప్-4 పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..
టీఎస్‌పీఎస్సీ గ్రూప్-2 సిలబస్ ఇదే..
మొత్తం మార్కులు: 600
రాతపరీక్ష (ఆబ్జెక్టివ్ టైప్) :
పేపర్ | సబ్జెక్ట్ | ప్రశ్నలు | సమయం (గంటలు) | మార్కులు |
1 | జనరల్ స్టడీస్, జనరల్ సైన్స్ | 150 | 2 1/2 | 150 |
2 | హిస్టరీ, పాలిటీ అండ్ సొసైటీ
|
150 | 2 1/2 | 150 |
3 | ఎకానమీ అండ్ డెవలప్‌మెంట్
|
150 | 2 1/2 | 150 |
4 | తెలంగాణ ఉద్యమం మరియు రాష్ట్ర ఆవిర్భావం
|
150 | 2 1/2 | 150 |
Groups Preparation Tips: 'కరెంట్ అఫైర్స్'పై పట్టు.. సక్సెస్‌కు తొలి మెట్టు!
ఇంక గ్రూప్-3లో మాత్రం..
అలాగే గ్రూప్-3లో కూడా 1,373 పోస్టులు భర్తీ చేయాలని గుర్తించిన ప్రభుత్వం ఆమేరకు ఆగస్టు 30న జీవో జారీ చేసిన విషయం తెల్సిందే. గ్రూప్-3 స్థాయి మరికొన్ని ఉద్యోగాలను కూడా పరిశీలించి వీటికి అదనంగా చేర్చినట్టు తెలుస్తోంది. సంక్షేమ శాఖ, ఇతర శాఖల్లో అకౌంటెంట్, జూనియర్ అసిస్టెంట్, జూనియర్ అకౌంటెంట్ తదితర పోస్టులు దాదాపు 120 వరకు జత చేయనున్నారు. మొత్తం 1500 పోస్టులు భర్తీ చేసే అవకాశం ఉంది.
Group 4 Preparation Tips: 9,168 గ్రూప్-4 పోస్టులపై.. గురిపెట్టండిలా!
టీఎస్‌పీఎస్సీ గ్రూప్-3 సిలబస్ ఇదే..
స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ : మార్కులు: 450
పేపర్ | సబ్జెక్ట్ | ప్రశ్నలు | సమయం (గంటలు) | మార్కులు |
1 | జనరల్ స్టడీస్, జనరల్ సైన్స్ | 150 | 2 1/2 | 150 |
2 | హిస్టరీ, పాలిటీ అండ్ సొసైటీ
|
150 | 2 1/2 | 150 |
3 | ఎకానమీ అండ్ డెవలప్‌మెంట్
|
150 | 2 1/2 | 150 |
చదవండి: TSPSC & APPSC Groups Best Books: గ్రూప్స్‌కు ప్రిపేరయ్యే అభ్యర్థులు ఈ పుస్తకాలను చదివారంటే..