Skip to main content

TSPSC Group I: గ్రూప్‌–1 ప్రిలిమ్స్‌ ‘కీ’పై అభ్యంతరాలకు ఆఖరు తేదీ ఇదే..

సాక్షి, హైదరాబాద్‌: గ్రూప్‌–1 ప్రిలిమినరీ పరీక్ష ప్రాథమిక ‘కీ’పై అభ్యంతరాల స్వీకరణ గడువు నవంబర్‌ 4 సాయంత్రంతో ముగియనుంది.
TSPSC Group I
గ్రూప్‌–1 ప్రిలిమ్స్‌ ‘కీ’పై అభ్యంతరాలకు ఆఖరు తేదీ ఇదే..

తెలంగాణ రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ శాఖల్లో 503 గ్రూప్‌–1 ఉద్యోగాల భర్తీకి సంబంధించి అక్టోబర్‌ 16న జరిగిన ప్రిలిమినరీ పరీక్షకు సంబంధించి గత నెల 19న ప్రాథమిక కీని Telangana State Public Service Commission (TSPSC) విడుదల చేసింది. దీనిపై అభ్యంతరాలను అక్టోబర్‌ 31 నుంచి నవంబర్‌ 4 సాయంత్రం 5 గంటల వరకు సంస్థ వెబ్‌సైట్‌ ద్వారా స్వీకరించనుంది. అభ్యంతరాలు వ్యక్తం చేసేవారు అందుకు సంబంధించి ఆధారాలను సమర్పించాలని కమిషన్‌ స్పష్టం చేసింది. అభ్యంతరాలపై పరిశీలన అనంతరం తుది ‘కీ’ని విడుదల చేయనుంది.

 TSPSC Group 1 - 2022 Question Paper with Key (held on 16.10.22)

మెయిన్స్‌ ఎంపికపై తలోరకంగా అంచనాలు...

రాష్ట్రవ్యాప్తంగా 25,150 మందిని మెయిన్‌ పరీక్షలకు టీఎస్‌పీఎస్సీ ఎంపిక చేయనుంది. అయితే ఈ ఎంపిక ప్రక్రియను రాష్ట్రం యూనిట్‌గా తీసుకోకుండా మల్టీజోనల్, రిజర్వేషన్ల వారీగా పోస్టుల సంఖ్యకు అనుగుణంగా 1:50 నిష్పత్తిలో మెయిన్స్‌ పరీక్షలకు అభ్యర్థుల ఎంపిక పూర్తి చేయనున్నారు. దీంతో ఒక్కో మల్టీ జోన్‌లో, ఒక్కో రిజర్వేషన్‌లో కటాఫ్‌ మార్కులు ఉండనున్నాయి. ఈ నేపథ్యంలో టీఎస్‌పీఎస్సీ ప్రస్తుతం ప్రాథమిక ‘కీ’ విడుదల చేసినా అభ్యర్థులకు ఏ మేరకు మార్కులు వస్తున్నాయో ప్రాథమికంగా నిర్ధారించుకోవడానికే ఉపయోగపడనుంది. మెయిన్స్‌కు సంబంధించిన అర్హతలపై అభ్యర్థులు తలోరకంగా అంచనాలు వేసుకుంటుండటంతో ఆ జాబితా విడుదలైతేనే స్పష్టత రానుంది. 

చదవండి: TSPSC Group-1 Cut Off Marks : గ్రూప్‌-1 మెయిన్స్‌లో నిలవాలంటే ఎన్ని మార్కులు సాధించాలంటే..

Published date : 04 Nov 2022 02:43PM

Photo Stories