TGPSC Groups Exam Format Change: గ్రూప్స్ పరీక్షల ఫార్మాట్ మారనుంది.. మూడు విభాగాలుగా ప్రశ్నలు!

ఇప్పటికే ఈ మార్పులపై విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్లు, విద్యా నిపుణులతో సమావేశం జరిగింది. సిలబస్ రూపకల్పన, ప్రశ్నల తత్వం, రాష్ట్ర చరిత్ర ఆధారిత అంశాలపై చర్చించి, క్వశ్చన్ బ్యాంకు ఏర్పాటుపై నిర్ణయం తీసుకుంది.
గ్రూప్స్ పరీక్షలలో నూతన ఫార్మాట్ - మూడు లెవల్స్ ప్రశ్నలు
- భవిష్యత్ గ్రూప్స్ పరీక్షలు మూడు విభాగాలుగా నిర్వహించనున్నట్లు సమాచారం:
- సాధారణ ప్రశ్నలు: అభ్యర్థి మౌలిక అవగాహనను పరీక్షించేలా ఉంటాయి.
- మధ్యస్థ స్థాయి ప్రశ్నలు: అభ్యర్థి ఆలోచన శక్తిని, విశ్లేషణ సామర్థ్యాన్ని పరీక్షించేలా ఉంటాయి.
- కఠిన ప్రశ్నలు: వేగంగా, సరైన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం ఉందా అనే దానిపై ఫోకస్ చేస్తాయి.
తెలంగాణ చరిత్రపై ప్రత్యేక ప్రశ్నలు
సిలబస్‌లో తెలంగాణ చరిత్రకు పెద్దపీట వేస్తారు. ప్రముఖులు కంటే సమాజం, సంస్కృతి, పోరాట చరిత్ర వంటి అంశాలను ప్రధానంగా అడుగుతారు. ఈ ప్రశ్నలు అభ్యర్థిలో ప్రాంతీయ అవగాహన పెంచేలా ఉంటాయి.
చదవండి: Group 1 నియామకాలు నిలిపివేతపై హైకోర్టు కీలక నిర్ణయం!
ఆన్‌లైన్ పరీక్షలపై చర్చలు
TGPSC గ్రూప్స్ పరీక్షలను ఆన్‌లైన్‌లో నిర్వహించాలా లేదా అన్నదానిపై చర్చలు కొనసాగుతున్నాయి. కొన్ని వర్సిటీల వీసీలు శాస్త్రీయతపై సందేహాలు వ్యక్తం చేశారు. పరీక్షల పారదర్శకతను దృష్టిలో పెట్టుకుని చివరి నిర్ణయం తీసుకోనున్నారు.
![]() ![]() |
![]() ![]() |
ఏఐ పునాది కలిగిన సిలబస్
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారంగా అభ్యర్థుల సాంకేతిక పరిజ్ఞానాన్ని పరీక్షించేందుకు ఐటీ నిపుణులతో సిలబస్ రూపకల్పన జరుగుతోంది. డేటా అనలిసిస్, ప్రోగ్రామింగ్, లాంగ్ లెర్నింగ్ మోడల్స్ వంటి అంశాలపై ఆధారిత ప్రశ్నలు వచ్చే అవకాశముంది.
క్వశ్చన్ బ్యాంక్ కోసం ప్రత్యేక విభాగం
TGPSC భారీ స్థాయిలో ప్రశ్నల బ్యాంకును రూపొందించనుంది. దీనికి విద్యా నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేయనుంది. జాతీయ స్థాయి పరీక్షల అధ్యయనం ఆధారంగా, అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం ప్రశ్నలు తయారు చేయనున్నట్లు సమాచారం.
Tags
- TGPSC Groups 2025
- telangana public service commission
- TGPSC Group Exam New Pattern
- TGPSC Group Exam Syllabus
- TGPSC Question Bank 2025
- Artificial Intelligence in TGPSC Exams
- TSPSC Group Exams AI-Based Questions
- Telangana Group Exam Preparation
- TSPSC Group Exam Changes 2025
- TSPSC Group Exam Difficulty Level
- TSPSC Group Exam Tips
- TSPSC Group Exam 2025 Updates
- tspsc group 1 syllabus
- TSPSC Group 1 Exam Preparation
- TSPSC Group 1 Changes