80,039 Jobs: వెంటనే నోటిఫికేషన్లు
91,142 పోస్టులను భర్తీ చేస్తామని, ఇందులో 80,039 ఖాళీల భర్తీకి వెంటనే నోటిఫికేషన్లు ఇస్తామని చెప్పారు. మిగతా 11,103 పోస్టుల్లో కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని ప్రకటించారు. స్థానికులకే 95 శాతం ఉద్యోగాలు లభించేలా రాష్ట్రపతి కొత్త ఉత్తర్వులతో ‘లోకల్’ కోటాను అమలు చేస్తున్నామని చెప్పారు. పోలీస్ వంటి యూనిఫాం సర్వీసులు మినహా ఇతర నియామకాల్లో గరిష్ట వయోపరిమితిని పదేళ్లు పెంచుతామన్నారు. ఓసీ కేటగిరీకి 44 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 49 ఏళ్లు, దివ్యాంగులకు 54 ఏళ్లుగా గరిష్ట వయోపరిమితి ఉంటుందని చెప్పారు. ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ల జారీ ప్రక్రియను బుధవారమే మొదలు పెడుతున్నట్టు తెలిపారు. వీటి భర్తీతో రాష్ట్ర ఖజానాపై ఏటా సుమారు రూ.7,000 కోట్లు అదనపు భారం పడుతుందని చెప్పారు. ఏపీ విభజనతో ముడిపడిన షెడ్యూల్ 9, 10 వివాదం కూడా పరిష్కారమైతే ప్రభుత్వ రంగ కార్పొరేషన్లలో మరో 25 వేల ఖాళీలను సృష్టించి, భర్తీ చేస్తామన్నారు.
చదవండి: