Group 2 Exam Postponed: గ్రూప్–2 వాయిదాకు ప్రభుత్వం సానుకూలం
ఉద్యోగ నియామకాల అర్హత పరీక్షలపై కొంత కాలంగా నెలకొన్న గందరగోళ పరిస్థితులను సర్దుబాటు చేసేక్రమంలో కాంగ్రెస్ పార్టీ నేతలతో కలిసి వారుజూలై 18న బేగంపేటలోని ప్లాజా హోటల్‌లో నిరుద్యోగ సంఘాల ప్రతినిధులతో సమావేశమయ్యారు.
పరీక్షల నిర్వహణకు సంబంధించి నిరుద్యోగుల సమస్యలు, వాటి పరిష్కార మార్గాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ గ్రూప్–2 పరీక్షను వాయిదా వేసే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తోందని, వాయిదాకు సానుకూలంగా ఉందని తెలిపారు.
చదవండి: టీఎస్‌పీఎస్సీ - స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సక్సెస్ స్టోరీస్ | గైడెన్స్ | సిలబస్ | ప్రివియస్ పేపర్స్ | ఎఫ్‌ఏక్యూస్ | ఆన్‌లైన్ క్లాస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ | ఏపీపీఎస్సీ
నిరుద్యోగులు వెల్లడించిన అన్ని అంశాలను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్తానన్నారు. ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ మాట్లాడుతూ డీఎస్సీ పరీక్షల షెడ్యూల్ దాదాపు మూడు వారాలు ఉందని, అయితే గ్రూప్–2 పరీక్షలు రెండ్రోజులే ఉండటంతో వాటిని వాయిదా వేసేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉందని వివరించారు.
అక్టోబర్‌లో గ్రూప్–1 ప్రిలిమ్స్, నవంబర్‌లో గ్రూప్–3 పరీక్షలు ఉండటంతో డిసెంబర్‌లో గ్రూప్–2 పరీక్షలు నిర్వహించే అవకాశం ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు కె.మానవతారాయ్, చెనగాని దయాకర్ తదితరులు పాల్గొన్నారు.