IT Park: రాజధానిలో రూ.450 కోట్లతో కొత్త ఐటీ పార్క్

ఈ పార్కు 10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించబడనుంది. ఈ ఏర్పాటుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం, క్యాపిటల్యాండ్ సంస్థ మధ్య ఒప్పందం చేసుకున్నాయి.
సింగపూర్ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం జనవరి 19వ తేదీ క్యాపిటల్యాండ్ ప్రతినిధులతో చర్చలు జరిపి ఒప్పందం చేసుకుంది. ఈ చర్చలు సఫలమయ్యాయని, సీఎం రేవంత్ ఈ సందర్భంలో తెలిపారు. ఆయన ఈ ఐటీ పార్కు హైదరాబాద్ అభివృద్ధిలో ఒక కొత్త మైలురాయిగా నిలుస్తుందని చెప్పారు.
సీఎం రేవంత్ సారథ్యంలో హైదరాబాద్ సుస్థిరంగా వృద్ధి చెందుతోందని, అక్కడ తమ సంస్థ కార్యకలాపాలను విస్తరించటం ఆనందంగా ఉందని క్యాపిటల్యాండ్ ఇండియా ట్రస్ట్ మేనేజ్‌మెంట్ సీఈవో గౌరీ శంకర్ నాగభూషణం పేర్కొన్నారు.
ఇప్పటికే పలు పెట్టుబడులు..
క్యాపిటల్యాండ్ సంస్థ ఇప్పటికే హైదరాబాద్‌లో ఐటీపీహెచ్, అవాన్స్ హైదరాబాద్, సైబర్ పెర్ల్ పార్కులు ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. ఈ సంస్థ త్వరలో 25 మెగావాట్ల ఐటీ లోడ్ డేటా సెంటర్‌ను ప్రారంభించనుంది. అలాగే ఐటీపీహెచ్ రెండో దశ 2028 నాటికి పూర్తి కానుంది.
సింగపూర్ పర్యటనలో సీఎం రేవంత్‌రెడ్డి మెరీనా బే వద్ద పర్యటించి, పర్యాటకాభివృద్ధి చర్యలను పరిశీలించారు.
Global Innovation Hub: నూతన ఆవిష్కరణల కేంద్రంగా ఎదుగుతున్న తెలంగాణ
ముగిసిన సింగపూర్ పర్యటన
సీఎం రేవంత్‌రెడ్డి సారథ్యంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం మూడు రోజుల సింగపూర్ పర్యటన ముగిసింది. సీఎం, మంత్రి శ్రీధర్‌బాబు, అధికారులు అక్కడి నుంచి జనవరి 19వ తేదీ రాత్రి స్విట్జర్లాండ్‌లోని దావోస్‌కు బయలుదేరారు. 20వ తేదీ దావోస్‌కు చేరుకుంటారు.
ఈ పర్యటనలో మరికొన్ని కీలక ఒప్పందాలు జరిగాయి. వాటిలో సింగపూర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఐటీఈ)తో తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పరస్పర అవగాహన ఒప్పందం ఒకటి.
చివరి రోజు వరుస సమావేశాలు
సింగపూర్ పర్యటనలో జనవరి 19వ తేదీ సీఎం బృందం వ్యాపార సంస్థల అధినేతలు, సింగపూర్ బిజినెస్ ఫెడరేషన్ ప్రతినిధులతో చర్చలు జరిపింది. ఇండియన్ ఓషన్ గ్రూప్ ఫౌండర్, సీఈవో ప్రదీప్తో బిశ్వాస్, డీబీఎస్ కంట్రీ హెడ్ లిమ్ హిమ్ చౌన్, డీబీఎస్ గ్రూప్ హెడ్ అమిత్ శర్మ, బ్లాక్ స్టోన్ సింగపూర్ సీనియర్ ఎండీ, చైర్మన్ గౌతమ్ బెనర్జీ, బ్లాక్ స్టోన్ రియల్ ఎస్టేట్ సీనియర్ ఎండీ పెంగ్ వీ టాన్, మెయిన్ హార్డ్ గ్రూప్ సీఈవో ఒమర్ షాజాద్‌తో భేటీ అయింది. హైదరాబాద్‌లో పెట్టుబడుల అవకాశాలు, ప్రభుత్వ విధానాలను వివరించింది.
Green Energy: ‘క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ’కి.. 20 వేల మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ!