TS TET Results 2022: నేడే టెట్ ఫలితాలు విడుదల.. ఈ సారి రిజల్ట్స్ ఇలాగే..
ఈ ఫలితాలను జూలై 1వ తేదీన(శుక్రవారం) ఉదయం 11:30లకు విడుదల చేయనున్నారు. టెట్ ఫలితాలను జూన్ 27వ తేదీన ఫలితాలను చేయాల్సింది ఉంది. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఫలితాల విడుదల వాయిదా వేశారు. రాష్ట్రవ్యాప్తంగా 2,683 కేంద్రాలలో.. టెట్ పరీక్ష జూన్ 12వ తేదీన(ఆదివారం) నిర్వహించిన విషయం తెల్సిందే. ఈ పరీక్షకు 90 శాతం మంది హాజరయ్యారు. టీఎస్ టెట్-2022 ఫలితాల కోసం సాక్షి ఎడ్యుకేషన్.కామ్ (www.sakshieducation.com)లో చూడొచ్చు.
➤ TS TET 2022 Paper-1 Question Paper & Key (Click Here)
➤ TS TET 2022 Paper-2 Question Paper & Key (Click Here)
5,69,576 మందికి..
టెట్‌కు మొత్తం 6,29,382 మంది దరఖాస్తు చేసుకోగా, 5,69,576 మంది పరీక్షకు హాజరయ్యారు. డీఈడీ అర్హతతో నిర్వహించిన టెట్ పేపర్–1కు మొత్తం 3,51,482 మంది దరఖాస్తు చేసుకోగా, 3,18,506 మంది(90.62 శాతం) హాజరయ్యారు. 32,976 మంది గైర్హాజరయ్యారు. అయితే, ఈ పరీక్షకు బీఎడ్ అభ్యర్థులను కూడా అనుమతించడంతో దరఖాస్తుల సంఖ్య పెరిగింది. పేపర్–2కు 2,77,900 మంది దరఖాస్తు చేసుకోగా, పరీక్షకు 2,51,070 (90.35 శాతం) మంది హాజరయ్యారు. 26,830 మంది గైర్హాజరయ్యారు. టెట్ పూర్తైన తర్వాత టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది.
TS TET 2022 Final Key: తెలంగాణ టెట్ ఫైనల్ 'కీ' విడుదల.. ఫలితాలు డైరెక్ట్ లింక్ ఇదే..
ఈసారి పేపర్–2 రాసే వారు..
వాస్తవానికి డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ చేసిన అభ్యర్థులు టెట్ ఉత్తీర్ణత ద్వారా సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులకు అర్హులవుతారు. పేపర్–2ను బీఈడీ అభ్యర్థులు స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు అర్హత పొందుతారు. ఈసారి పేపర్–2 రాసే వారు కూడా పేపర్–1 రాసి, ఎస్‌జీటీలుగా అర్హత పొందేలా మార్పులు చేశారు.
ఇక ఉద్యోగాల భర్తీకి రంగం సిద్దం..
ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగ భర్తీకి ప్రకటన చేయగా.. టీచర్ పోస్టులున్నాయి. సెకండరీ ఎడ్యుకేషన్‌లో 13,086 పోస్టులు, 6,500 సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులు, స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 2000, ల్యాంగ్వేజ్ పండిట్ పోస్టులు 600 వరకు ఉన్నాయి. వీటి భర్తి నేపథ్యంలో టెట్ నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.