Skip to main content

TS TET 2023 Notification : వారం రోజుల్లో టెట్ నోటిఫికేష‌న్‌.. త్వ‌ర‌లోనే డీఎస్సీపైన కూడా..

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష(TET)కు వారం రోజుల్లో నోటిఫికేష‌న్ ఇవ్వాల‌ని రాష్ట్ర విద్యాశిక్షణా పరిశోధన సంస్థ (ఎస్సీఈఆర్టీ) నిర్ణయించింది. అలాగే ఈ టెట్ ప‌రీక్ష‌ సెప్టెంబర్‌ మూడోవారంలో నిర్వహించాలని నిర్ణ‌యించుకున్నారు.
TS TET Notification 2023 Details in Telugu
TS TET Notification 2023

తెలంగాణ‌లో ఇటీవ‌ల జ‌రిగిన మంత్రివర్గ ఉపసంఘం స‌మావేశంలో ఈ మేర‌కు ఆమోదం తెలిపిన విష‌యం తెల్సిందే. ఈ నేపథ్యంలో ఎస్సీఈఆర్టీ అధికారులు టెట్‌ నిర్వహణపై ప్రతిపాదనలు రూపొందించి, విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణకు అందజేశారు.

☛ తెలంగాణ డీఎస్సీ/టెట్‌ స్డ‌డీ మెటీరియ‌ల్‌, బిట్‌బ్యాంక్‌, మోడ‌ల్‌పేప‌ర్స్‌, ప్రీవియ‌స్ పేప‌ర్స్‌, గైడెన్స్‌, ఆన్‌లైన్ టెస్టులు, స‌క్సెస్ స్టోరీలు మొద‌లైన వాటి కోసం క్లిక్ చేయండి

ఆయా ప్రతిపాదనలను విద్యాశాఖ ఆమోదించగా, టెట్‌ నిర్వహణపై అధికారులు కసరత్తును వేగవంతం చేశారు. సెప్టెంబర్‌ 15 ముందు లేదా తర్వాత ఎప్పుడైనా నిర్వహించాలని భావిస్తున్నారు. అంతర్గతంగా టెట్‌ నిర్వహణకు కావాల్సిన ఏర్పాట్లు చేయడంలో నిమగ్నమయ్యారు.

టెట్‌ వ్యవధి జీవితకాలం.. కానీ..

teacher jobs 2023

తాజా అంచనాల ప్రకారం రాష్టంలో 1.5 లక్షల డీఎడ్‌, 4.5 లక్షల మంది బీఎడ్‌ అభ్యర్థులున్నారు. 2017 టీఆర్టీ నోటిఫికేషన్‌ ద్వారా 8,792 టీచర్‌ పోస్టులను భర్తీచేశారు. గతంలో టెట్‌కు 7 సంవత్సరాల వ్యాలిడిటీ ఉండగా, రెండేండ్ల క్రితం టెట్‌ వ్యవధిని జీవితకాలం పొడిగించారు. పైగా గతంలో సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ (ఎస్జీటీ) పోస్టులకు పోటీపడే అవకాశం డీఎడ్‌ వారికే ఇవ్వగా, ఇటీవలే బీఈడీ వారికి కూడా అవకాశం కల్పించారు.

☛ అభ్యర్థులకు శుభ‌వార్త‌.. ! ఇక‌పై టెట్‌ ఒక్కసారి రాస్తే..

దీంతో గతంలో టెట్‌ క్వాలిఫై అయిన వారితో పాటు బీఈడీ అభ్యర్థులకు ఉపశమనం కలిగింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 2 లక్షల మంది టెట్‌ క్వాలిఫై కానివారున్నారు. వీరే కాకుండా కొత్తగా బీఈడీ, డీఎడ్‌ పూర్తిచేసిన వారు మరో 20వేల వరకుంటారు. తాజా టెట్‌ నిర్వహణతో వీరందరికి మరోమారు పోటీపడే అవకాశం దక్కుతుంది. అలాగే ఈ టెట్ ప‌రీక్ష ఫ‌లితాల త‌ర్వాత డీఎస్సీ నోటిఫికేష‌న్ విడుద‌ల చేసే అవ‌కాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు మొదలవడంతో, తమకూ టీచర్‌ అయ్యే అవకాశం వస్తుందని ల‌క్ష‌ల మంది అభ్య‌ర్థులు ఎదురుచూశారు.

 ఇవి పాటిస్తే.. టీచ‌ర్ జాబ్ మీదే..||DSC Best Preparation Tips

12 వేల టీచర్‌ పోస్టులను..

ts trt notification 2023 news in telugu

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 22 వేల టీచర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయనేది ఓ అంచనా కాగా.. ప్రభుత్వం మాత్రం 12 వేల టీచర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వీటిని భర్తీ చేస్తామని తెలిపింది. చాలా పాఠశాలల్లో సబ్జెక్టు టీచర్ల కొరత వెంటాడుతోంది. పైగా గత ఏడాది నుంచి ఆంగ్ల మాధ్యమంలో బోధన చేపట్టారు. కొన్ని పాఠశాలల్లో ఎస్‌జీటీలను ఉన్నత తరగతులకు పంపుతున్నారు. ఇందులో చాలామంది స్కూల్‌ అసిస్టెంట్లకు అర్హత ఉన్నా, పదోన్నతులు లేకపోవడంతో ఫలితం దక్కడం లేదు. పదోన్నతులు లేకపోవడంతో బదిలీలు జరగడం లేదు.

టెట్‌–పేపర్‌–1 ఇలా..

రెండున్నర గంటల వ్యవధిలో 150 మార్కులకు నిర్వహించే ఈ పరీక్ష పూర్తిగా ఆబ్జెక్టివ్‌ విధానంలో అయిదు విభాగాలుగా ఉంటుంది. అవి..

విభాగం సబ్జెక్ట్‌ ప్రశ్నలు మార్కులు
1 చైల్డ్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ పెడగాజి  30 30
2 లాంగ్వేజ్‌1 30 30
3 లాంగ్వేజ్‌ 2(ఇంగ్లిష్‌) 30 30
4 గణితం 30 30
5 ఎన్విరాన్‌మెంటల్‌ స్టడీస్‌ 30 30
మొత్తం    150 150

☛ TET/DSC 2023: కచ్చితంగా ఉద్యోగం సాధించాలనుకునే వారికి మాత్రమే..

టెట్‌ పేపర్‌–2 ఇలా.. :

ఆయా సబ్జెక్ట్‌లలో స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్ట్‌లకు ప్రామాణికంగా పేర్కొనే టెట్‌ పేపర్‌–2ను కూడా నాలుగు విభాగాలుగా,150మార్కులకు నిర్వహిస్తారు. ఈ పేపర్‌ కూడా పూర్తిగా బహుళైచ్ఛిక ప్రశ్నలతో ఆబ్జెక్టివ్‌ విధానంలో జరుగుతుంది. వివరాలు..

విభాగం సబ్జెక్ట్‌ ప్రశ్నలు మార్కులు
1 చైల్డ్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ పెడగాజి 30 30
2 లాంగ్వేజ్‌1 30 30
3 లాంగ్వేజ్‌ 2 (ఇంగ్లిష్‌) 30 30
4 సంబంధిత సబ్జెక్ట్‌  60 60
మొత్తం   150 150
Published date : 29 Jul 2023 06:36PM

Photo Stories