Skip to main content

1, 271 Jobs: టీఎస్‌ఎస్పీడీసీఎల్‌లో కొలువులు 1,271

దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ(టీఎస్‌ఎస్పీడీసీఎల్‌) 1,271 పోస్టుల భర్తీకి మే 9న నోటిఫికేషన్ ప్రకటించింది.
TSSPDCL Jobs
టీఎస్‌ఎస్పీడీసీఎల్‌లో కొలువులు 1,271

ఇందులో 70 అసిస్టెంట్‌ ఇంజనీర్‌(ఎలక్రి్టకల్‌), 201 సబ్‌ ఇంజనీర్‌(ఎలక్రి్టకల్‌), వెయ్యి జూనియర్‌ లైన్ మెన్ (జేఎల్‌ఎం) పోస్టులు ఉన్నాయి. విద్యార్హతలు, వయోపరిమితి, కేటగిరీలవారీగా ఖాళీల వివరాలతో సమగ్ర నియామక ప్రకటనను మే 11న సంస్థ వెబ్‌సైట్‌ https:// tssouthernpower.cgg.gov.in లేదా www.tssouthernpower .comలో పొందుపరచనున్నట్టు యాజమాన్యం తెలిపింది. త్వరలో ఉత్తర తెలంగాణ విద్యుత్‌ పం పిణీ సంస్థ(టీఎస్‌ఎన్పీడీసీఎల్‌), తెలంగాణ జెన్ కో సంస్థల నుంచి సైతం ఏఈతోపాటు ఇతర కేటగిరీల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు ఇచ్చే అవకాశం ఉంది. రాష్ట్రంలో కొత్తగా నిర్మిస్తున్న విద్యుత్‌ ప్లాంట్ల నిర్వహణకు తెలంగాణ జెన్ కో దాదాపు 200 ఏఈ పోస్టులను భర్తీ చేసే అవకాశముందని అధికారవర్గాలు తెలిపాయి. ఓ మూడు, నాలుగు నెలల తర్వాత నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉందన్నారు. టీఎస్‌ఎన్పీడీసీఎల్‌ దాదాపు 50 ఏఈ పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంది. 

చదవండి: 

TSSPDCL Notification 2022 For 1271 Vacancies - Click Here

​​​​​​​తెలంగాణలో భారీగా విద్యుత్ కొలువులు.. సొంతం చేసుకోండిలా

దక్షిణ డిస్కంకు స్మార్ట్ సిటీస్ పురస్కారం

Sakshi Education Mobile App
Published date : 10 May 2022 03:18PM

Photo Stories