Skip to main content

దక్షిణ డిస్కంకు స్మార్ట్ సిటీస్ పురస్కారం

దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)కు స్మార్ట్ సిటీస్ పురస్కారం లభించింది.
ఢిల్లీలో మే 24న జరిగిన ఐదో స్మార్ట్ సిటీస్ సదస్సు కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని డిస్కం సీఎండీ రఘుమారెడ్డి అందుకున్నారు. పర్యావరణ అనుకూల ఇంధన ఉత్పత్తిని ప్రోత్సహించడంలో ఈ సంస్థ దేశంలోనే ఉత్తమ పనితీరు కనబరుస్తున్నందుకు ఈ పురస్కారానికి ఎంపికైంది. ‘అండ్ గ్రీన్ సిటీ అవార్డు’ విభాగంలో దక్షిణ డిస్కంకు ఈ పురస్కారం లభించింది. రూఫ్‌టాప్ సౌరవిద్యుత్ ఏర్పాటును ప్రోత్సహిస్తున్నందుకు గతంలోనూ 4 జాతీయ స్థాయి పురస్కారాలను డిస్కం గెలుచుకుంది.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
స్మార్ట్ సిటీస్ పురస్కారం
ఎప్పుడు : మే 24
ఎవరు : దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)
ఎందుకు : పర్యావరణ అనుకూల ఇంధన ఉత్పత్తిని ప్రోత్సహిస్తున్నందుకు
Published date : 25 May 2019 06:22PM

Photo Stories