Skip to main content

TS Police Jobs : పోలీసు ఉద్యోగం కొట్టేలా.. ఉచిత శిక్ష‌ణ మీ కోస‌మే..!

సాక్షి, హైదరాబాద్‌: పోలీసు కావడం కొందరి కల.. మరికొందరి ఆశ.. ఇంకొందరి ఆశయం.. సామాజిక, ఆర్థిక కారణాల నేపథ్యంలో ఆసక్తి ఉన్నప్పటికీ అనేక మంది ఎంపిక పరీక్షలకు దూరంగా ఉండిపోతున్నారు.
CV Anand IPS
CV Anand IPS

దీన్ని దృష్టిలో పెట్టుకున్న హైద‌రాబాద్‌ నగర పోలీసు విభాగం ఎంపిక పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు ప్రీ రిక్రూట్‌మెంట్‌ ట్రైనింగ్‌ పేరుతో ఉచిత శిక్షణ ఇస్తోంది. 2016లో పశ్చిమ మండలంలో ప్రారంభమైన ఈ విధానం 2018లో అయిదు సెంటర్లలో 5 వేల మందికి విస్తరించింది. ప్రస్తుత సీపీ సీవీ ఆనంద్‌ ఆలోచన మేరకు ఈసారి నగరంలోని 11 సెంటర్లలో తొలి దశలో 7500 మందికి జరుగుతోంది. జేసీపీ ఎం.రమేష్, అదనపు డీసీపీ పరవస్తు మధుకర్‌స్వామి నేతృత్వంలో ఇవి సాగుతున్నాయి.

TS Police Exams: రాతపరీక్షలో నెగిటివ్‌ మార్కులు ఉన్నాయ్‌.. జాగ్రత్తగా రాయండిలా..

ప్రైవేట్‌ సంస్థలకు దీటుగా ..
సబ్‌– ఇన్‌స్పెక్టర్, కానిస్టేబుల్‌ వంటి పోలీసు పరీక్ష హాజరవ్వాలనే ఆసక్తి, అర్హతలు ఉన్న వారికి ఉచితంగా శిక్షణ ఇవ్వడాన్ని నగర పోలీసు విభాగం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ప్రైవేట్‌ సంస్థలకు దీటుగా అన్ని అంశాల్లోనూ తర్ఫీదు ఇస్తోంది. ఈ నేపథ్యంలో గణనీయమైన పోటీ ఏర్పడటంతో తొలిసారిగా ఎంపిక పరీక్ష నిర్వహించారు. మొత్తం 21 వేల మంది హాజరుకాగా వడపోత తర్వాత తొలి దశలో 7,500 మందిని ఎంపిక చేసి ప్రీ రిక్రూట్‌మెంట్‌ ట్రైనింగ్‌ ఇస్తున్నారు. ఇండోర్‌ ట్రైనింగ్‌గా పిలిచే ఆంగ్ల, కరెంట్‌ అఫైర్స్, తెలంగాణ చరిత్ర సహా మొత్తం 12 అంశాలతో పాటు అవుట్‌ డోర్‌ ట్రైనింగ్‌ దేహ దారుఢ్యం, వ్యాయామం వంటివీ ఈ శిక్షణలో భాగంగా నిష్ణాతుల పర్యవేక్షణలో సాగుతున్నాయి.

TS Police Jobs: ద‌ర‌ఖాస్తు నుంచి తుది రాతపరీక్ష వరకు.. ఏవేవి ఎప్పుడంటే..?

ఉచితంగా భోజనం వసతి.. స్టడీ మెటీరియల్‌
ఈ శిక్షణలో భాగంగా ప్రతి ఒక్కరికీ ఉచితంగా స్టడీ మెటీరియల్‌ సైతం అందించారు. సిటీ పోలీసుల ప్రీ– రిక్రూట్‌మెంట్‌ ట్రైనింగ్‌కు హాజరవుతున్న వారిలో నిరు పేదలూ ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే పశ్చిమ మండలంలోని ఆయా ప్రాంతాలకు చెందిన వారికి ఉచితంగా భోజన సౌకర్యాన్నీ కల్పించారు. మిగిలిన వారికి హరేకృష్ణ ఫౌండేషన్‌ సహకారంతో రూ.5 భోజనం అందిస్తున్నారు.

TS Police Jobs: పోలీసు ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలంటే.. ఈ అర్హతలు తప్పనిసరి

ప్రతి రోజూ ఉదయం దేహ దారుఢ్య పరీక్షలకు..
దేశ దారుఢ్య పరీక్షలకు సన్నద్ధం చేయడంలో భాగంగా ఆయా జోన్లలో ఉన్న గ్రౌండ్స్‌లో ప్రతి రోజూ ఉదయం దేహ దారుఢ్య పరీక్షలకు సంబంధించి 800 మీటర్ల పరుగు, 100 మీటర్ల పరుగు, లాంగ్‌ జంప్, హైజంప్, షార్ట్‌పుట్‌ అంశాల్లో శిక్షణ ఇస్తున్నారు. ఎప్పటికప్పుడు లోటుపాట్లు గుర్తించి సరి చేస్తూ అభ్యర్థులను తీర్చిదిద్దుతున్నారు.

TS Police Jobs Events: ఈవెంట్స్ కొట్టాలంటే.. ఇవి పాటించాల్సిందే..!

దేశంలోని మరే ఇతర పోలీసు విభాగం ఇలాంటి..
గతంలో జరిగిన పోలీసు శిబిరాల్లో శిక్షణ తీసుకుని ఎంపికైన వారి ద్వారానూ ఈ శిక్షణలు జరుగుతున్నాయి. అభ్యర్థుల శక్తిసామర్థ్యాలు వారిలో ఉన్న లోపాలు గుర్తించడానికి ప్రతి ఆదివారం మాక్‌ పరీక్షలు నిర్వహిస్తున్నారు. వీటి ద్వారా  వెనుకబడిన వారిని గుర్తిస్తున్నారు. వీరికి సంబంధించి ప్రత్యేక రికార్డులు నిర్వహిస్తూ ప్రత్యేక శ్రద్ధ పెట్టే ట్రైనర్లు అదనపు శిక్షణ ఇస్తున్నారు. ఇలా దాదాపు ప్రతి ఒక్కరిలోనూ ప్రతిభాపాటవాలు నింపేలా చర్యలు తీసుకుంటున్నారు. దేశంలోని మరే ఇతర పోలీసు విభాగం ఇలాంటి కార్యక్రమాలు చేపట్టట్లేదు. డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి ఆశయం, కొత్వాల్‌ సీవీ ఆనంద్‌ ఆలోచనతోనే యువతకు ఈ అవకాశం వచ్చింది.

తెలంగాణ పోలీసు ఉద్యోగాల స్డ‌డీ మెటీరియ‌ల్‌, బిట్‌బ్యాంక్‌, మోడ‌ల్‌పేప‌ర్స్‌, ప్రీవియ‌స్ పేప‌ర్స్‌, గైడెన్స్‌, ఆన్‌లైన్ టెస్టులు, స‌క్సెస్ స్టోరీలు మొద‌లైన వాటి కోసం క్లిక్ చేయండి 

ప్రతి అభ్యర్థిపైనా..
భద్రాచలం నుంచి వచ్చి ఇక్కడ హాస్టల్‌లో ఉంటూ శిక్షణ తీసుకుంటున్నా. ఎస్సై, కానిస్టేబుల్‌ రెండు పోస్టులకు అప్లై చేశా. ట్రైనింగ్‌ కూడా ఆ కోణంలోనే సాగుతోంది. కాస్లులో ఎంత మంది ఉన్నా ప్రతి ఒక్కరి మీదా శ్రద్ధ తీసుకుంటున్నారు. మధ్యాహ్నం ఉచిత భోజనం కూడా అందిస్తున్నారు. సిటీ పోలీసులు పీఆర్టీ క్యాంప్‌లో ఇప్పటి వరకు చాలా సబ్జెక్టు నేర్చుకున్నా. ఈ సదావకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకుంటున్నారు. 
                                                                                  – రిహానా, పరేడ్‌గ్రౌండ్స్‌ క్యాంప్‌ అభ్యర్థిని

​​​​​​తెలంగాణ ఎస్ఐ,కానిస్టేబుల్ ప‌రీక్ష‌ల బిట్‌బ్యాంక్ కోసం క్లిక్ చేయండి

 అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీల‌తో..
నగర పోలీసు కమిషనర్‌ సీవీ ఆనంద్‌ ఆదేశాలు, సూచనల మేరకు పకడ్బందీగా శిక్షణ ఇస్తున్నాం. ప్రతి సబ్జెక్టును అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీలు బోధిస్తున్నారు. గతంలో నిర్వహించిన పీఆర్టీకి హాజరైన అభ్యర్థుల్లో 20 శాతం మంది ఎస్సై, కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఈసారి కనీసం 30 శాతం మంది విజయం సాధించాలనే లక్ష్యంతో శిక్షణ ఇస్తున్నాం. 
                                                             – పరవస్తు మధుకర్‌ స్వామి, అదనపు డీసీపీ

TS Police Jobs: పోలీసు ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలంటే.. ఈ అర్హతలు తప్పనిసరి

తెలంగాణలో భర్తీ చేయనున్న పోలీసు ఉద్యోగాలు ఇవే..
కానిస్టేబుల్‌ పోస్టుల వివరాలు ఇలా..
➤ కానిస్టేబుల్‌(సివిల్‌): 4965
➤ కానిస్టేబుల్‌(ఏఆర్‌): 4423
➤ కానిస్టేబుల్‌(ఎస్‌ఏఆర్‌సీపీఎల్‌)(పురుషులు): 100
➤ కానిస్టేబుల్‌(టీఎస్‌ఎస్పీ)(పురుషులు): 5010
➤ కానిస్టేబుల్‌ (స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌): 390
➤ ఫైర్‌మన్‌ (డిజాస్టర్‌ రెస్పాన్స్‌ అండ్‌ ఫైర్‌ సర్వీసెస్‌): 610
➤ వార్డర్‌(పురుషులు)(జైళ్లు): 136
➤ వార్డర్‌(మహిళలు)(జైళ్లు): 10
➤ కానిస్టేబుల్‌(ఐటీ అండ్‌ కమ్యూనికేషన్స్‌): 262
➤ కానిస్టేబుల్‌(మెకానిక్స్‌)(పురుషులు): 21
➤ కానిస్టేబుల్‌(డ్రైవర్స్‌)(పురుషులు): 100
మొత్తం కానిస్టేబుల్‌ పోస్టులు: 16,027 

TS Police Jobs: పోలీసు ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలంటే.. ఈ అర్హతలు తప్పనిసరి

ఎస్సై పోస్టుల వివరాలు ఇవే..

TS SI Posts


☛ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌(సివిల్‌): 414
☛ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌(ఏఆర్‌): 66
☛ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌(ఎస్‌ఏఆర్‌ సీపీఎల్‌)(పురుషులు): 5
☛ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌(టీఎస్‌ఎస్పీ)(పురుషులు): 23
☛ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌(స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌)(పురుషులు): 12
☛ స్టేషన్‌ ఫైర్‌ ఆఫీసర్‌(డిజాస్టర్‌ రెస్పాన్స్‌ అండ్‌ ఫైర్‌ సర్వీసెస్‌): 26
☛ డిప్యూటీ జైలర్‌(పురుషులు): 8
☛ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌(ఐటీ అండ్‌ కమ్యూనికేషన్స్‌): 22
☛ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌(పోలీస్‌ ట్రాన్స్‌పోర్ట్‌)(పురుషులు): 3
☛ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌(ఫింగర్‌ ప్రింట్‌ బ్యూరో): 8
మొత్తం ఎస్సై పోస్టులు: 587

TS Government Jobs: మరో 677 ప్ర‌భుత్వ ఉద్యోగాల‌కు నోటిఫికేషన్.. పూర్తి వివరాలు ఇవే..

తెలంగాణ పోలీసు ఉద్యోగాల‌ సిలబస్‌ ఇదే..
☛ పోలీస్‌ కానిస్టేబుల్‌(సివిల్‌) ప్రిలిమినరీ పరీక్షలో ఇంగ్లిష్, అర్థమెటిక్, జనరల్‌సైన్స్‌,భారతదేశ చరిత్ర, భారతదేశ సంస్కృతి,భారత జాతీయోద్యమం, భౌగోళిక సూత్రాలు,భారతదేశ భౌగోళిక శాస్త్రం, పాలిటీ, ఎకానమీ, జాతీయ, అంతర్జాతీయ సమకాలీన అంశాలు, రీజనింగ్‌/మెంటల్‌ ఎబిలిటీ, తెలంగాణ రాష్ట్ర అంశాలపై ప్రశ్నలు అడుగుతారు. ఫైనల్‌ రాత పరీక్షలో ప్రిలిమినరీ పరీక్షలోని సిలబస్‌ అంశాలకు అదనంగా పర్సనాలిటీ టెస్ట్‌కు సంబంధించిన విలువలు, సున్నితత్వం, బలహీన వర్గాలు,సామాజిక అవగాహన, భావోద్వేగ తెలివితేటలపై ప్రశ్నలు అడుగుతారు. ఇంటర్మీడియెట్‌ స్థాయిలో ప్రశ్నలు ఉంటాయి. 
☛ ఎస్సై (సివిల్‌/తత్సమానం) ప్రిలిమినరీ రాత పరీక్షలో అర్థమెటిక్, రీజనింగ్‌ అంశాలతోపాటు జనరల్‌ స్టడీస్‌లో జనరల్‌ సైన్స్‌, జాతీయ, అంతర్జాతీయ సమకాలీన అంశాలు, భారత దేశ చరిత్ర, జాతీయోద్యమం, భౌగోళిక సూత్రాలు, భారతదేశ భౌగోళిక శాస్త్రం, ఇండియన్‌ పాలిటీ, ఎకానమీ, తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఏర్పాటు అంశాలపై ప్రశ్నలు అడుగుతారు. 
☛ ఎస్సై(సివిల్‌/ తత్సమానం) ఫైనల్‌ రాతపరీక్ష పేపర్‌–1లో ఇంగ్లిష్‌కు సంబంధించి యూసేజ్, వొకాబులరీ, గ్రామర్, కాంప్రహెన్షన్, ఇతర భాషా నైపుణ్యాలపై పదోతరగతి స్థాయిలో ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలు అడుగుతారు. డిస్క్రిప్టివ్‌ విధానంలో లేఖలు రాయడం, నివేదికలు, వ్యాసరూప, రీడింగ్‌ కాంప్రహెన్షన్‌పై ప్రశ్నలు ఇస్తారు. పేపర్‌–2లో తెలుగు/ఉర్దూ భాషా పరిజ్ఞానంపై ప్రశ్నలు ఉంటాయి. పేపర్‌–3లో అర్థమెటిక్, రీజనింగ్‌పై ప్రశ్నలు ఇస్తారు. పేపర్‌–4 జనరల్‌ స్టడీస్‌లో జనరల్ సైన్స్‌, జాతీయ, అంతర్జాతీయ సమకాలీన అంశాలు, భారతదేశ చరిత్ర, జాతీయోద్యమం, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, రాజకీయ అంశాలు, భారత దేశ భౌగోళిక శాస్త్రం, ఇండియన్‌ పాలిటీ, ఎకానమీ, వ్యక్తిత్వ పరీక్షకు సంబంధించిన విలువలు, సున్నితత్వం, బలహీన వర్గాలు, సామాజిక అవగాహన, భావోద్వేగ తెలివితేటలు, తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఏర్పాటు అంశాలపై ప్రశ్నలు వస్తాయి.

ఇవి ఫాలో అయితే.. పోలీసు ఉద్యోగం మీదే || Telangana Police Jobs 2022|| SI, Constable Jobs||Events

ఇలా చదివారంటే.. ఇంక‌..

TS Police Exams


☛ అర్థమెటిక్‌ విభాగం నుంచి సరాసరి, గ.సా.భా., క.సా.గు.,సంఖ్యలు, దశాంశ భిన్నాలు, వర్గమూలాలు–ఘనమూలాలు, సూక్ష్మీకరణలు, నిష్పత్తి–అనుపాతం,భాగస్వామ్యం, వయసులు, శాతా లు, లాభ–నష్టాలు–తగ్గింపులు, సరళ వడ్డీ, చక్రవడ్డీ, మిశ్రమాలు,కాలం–పని, పంపులు–ట్యాంకులు, పనులు–వేతనాలు, కాలం–దూరం, రైళ్లు, పడవలు–ప్రవాహాలు, ఆటలు–పందేలు అంశాలనుంచి ప్రశ్నలను సాధన చేయాలి. 
☛ ప్యూర్‌ మ్యాథ్స్‌ విభాగం నుంచి వైశాల్యాలు, ఘనపరిమాణాలు, రేఖాగణితం, సాంఖ్యక శాస్త్రం,సంభావ్యత,త్రికోణమితి, మాత్రికలు మొదలైన∙అంశాలు ముఖ్యమైనవి. వీటితోపాటు పదోతరగతిలోపు ప్యూర్‌ మ్యాథ్స్‌ను కూడా చదవాలి.
☛ వెర్బల్‌ రీజనింగ్‌లో కేలండర్‌లు, గడియారాలు, టైమ్‌ సీక్వెన్స్, నంబర్‌ టెస్ట్, ర్యాంకింగ్‌ టెస్ట్, డైరెక్షన్‌ టెస్ట్, నంబర్‌ సిరీస్, మిస్సింగ్‌ నంబర్స్, మ్యాథమెటికల్‌ ఆపరేషన్స్, ఆల్ఫాబెటికల్‌ టెస్ట్, కోడింగ్‌–డీకోడింగ్, బ్లడ్‌ రిలేషన్స్, పజిల్స్‌ టెస్ట్, సీటింగ్‌ అరేంజ్‌మెంట్స్, అర్థమెటికల్‌ రీజనింగ్, అనాలజీ, భిన్నమైన దాన్ని గుర్తించడం తదితర అంశాలు ముఖ్యమైనవి.
☛ లాజికల్‌ రీజనింగ్‌లో లాజికల్‌ వెన్‌డయాగ్రమ్స్, స్టేట్‌మెంట్స్‌ అండ్‌ ఆర్గుమెంట్స్, స్టేట్‌మెంట్స్‌ అండ్‌ అసంప్షన్స్, అసర్షన్‌ అండ్‌ రీజన్, సిల్లోజియం, డేటా సఫిషియెన్సీ, డేటా ఇంటర్‌ప్రిటేషన్‌ అంశాలపై ఎక్కువ దృష్టి సారించాలి. 
☛ నాన్‌వెర్బల్‌ రీజనింగ్‌లో క్యూబ్స్‌ అండ్‌ డైస్, సిరీస్, అనాలజీ, భిన్నమైన దాన్ని గుర్తించడం, మిర్రర్‌ ఇమేజెస్, వాటర్‌ ఇమేజెస్, కంప్లీషన్‌ ఆఫ్‌ ఫిగర్స్, పేపర్‌ ఫోల్డింగ్, పేపర్‌ కట్టింగ్, కౌంటింగ్‌ ఫిగర్స్‌ మొదలైనవి ముఖ్యమైనవి.

Telangana SI, Constable Jobs: 16,614 పోలీసు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌.. విద్యార్హతలు ఇవే.. ఎంపిక విధానం ఇలా..

Published date : 24 May 2022 01:41PM

Photo Stories