రాజ్యాంగబద్ధ సంస్థలు
1.కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ పదవీకాలం?
1) ఐదేళ్లు
2) ఆరేళ్లు
3) ఏడేళ్లు
4) నాలుగేళ్లు
- View Answer
- సమాధానం: 2ి
2. అటార్నీ జనరల్ ఆ పదవిలో ఎంత కాలం పాటు కొనసాగుతారు?
1) నాలుగేళ్లు
2) ఆరేళ్లు
3) ఏడేళ్లు
4) రాష్ర్టపతి విశ్వాసం ఉన్నంత వరకు
- View Answer
- సమాధానం: 4
3. కింద పేర్కొన్న ఏ బాధ్యతను భారత కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ నిర్వర్తించరు?
1) భారత సంఘటిత నిధికి చెందిన వ్యయానికి సంబంధించి తనిఖీ, నివేదిక
2) ఆగంతుక నిధి, పబ్లిక్ అకౌంట్ల తనిఖీ, నివేదిక
3) అన్ని రకాల వాణిజ్యం, ఉత్పత్తి, లాభం, నష్టాలకు సంబంధించిన తనిఖీ, నివేదిక
4) ప్రజాధనానికి సంబంధించిన వసూళ్లు, విడుదల నియంత్రణ; కోశాధికారి వద్ద ప్రభుత్వ ఆదాయాన్ని నిల్వ చేసేలా చూడటం
- View Answer
- సమాధానం: 4
4. ఏ నివేదికలను పార్లమెంట్‌కు సమర్పించేలా రాష్ర్టపతి చర్యలు తీసుకుంటారు?
1) కేంద్ర ఆర్థిక సంఘం
2) కంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్
3) జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4ి
5. కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలకు ఉమ్మడిగా వర్తించే రాజ్యాంగ సంస్థలు?
1) కంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్
2) అటార్నీ జనరల్
3) సోలిసిటర్ జనరల్
4) పైవన్నీ సరైనవే
- View Answer
- సమాధానం: 1
6. అటార్నీ జనరల్‌కు సంబంధించి సరైంది?
1) సుప్రీంకోర్టు న్యాయమూర్తికి ఉండాల్సిన అర్హతలు ఉండాలి
2) పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొనవచ్చు
3) పార్లమెంట్ సభ్యులకు ఉన్న అధికారాలు ఉంటాయి
4) పైవన్నీ సరైనవే
- View Answer
- సమాధానం: 4
7. ఏ రాజ్యాంగ బద్ధమైన పదవిని చేపట్టిన వారు పదవీ విరమణ తర్వాత ప్రభుత్వ నియామకాలకు అర్హులు కారు?
1) కంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్
2) యూపీఎస్సీ చైర్మన్
3) అటార్నీ జనరల్
4) ఎ, బి
- View Answer
- సమాధానం: 4
8. అటార్నీ జనరల్‌గా నియమితుడయ్యే వ్యక్తికి కింద ఇచ్చిన వారిలో ఎవరితో సమానమైన అర్హతలు ఉండాలి?
1) హైకోర్టు న్యాయమూర్తి
2) సుప్రీంకోర్టు న్యాయమూర్తి
3) హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి
4) సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి
- View Answer
- సమాధానం: 2
9. భారతదేశంలో అత్యున్నత న్యాయాధికారి ఎవరు?
1) సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి
2) అటార్నీ జనరల్
3) అడ్వకేట్ జనరల్
4) సోలిసిటర్ జనరల్
- View Answer
- సమాధానం: 2
-
10. భారత రాజకీయ వ్యవస్థలో ఎన్ని రకాలైన సంస్థలు ఉన్నాయి?
i) రాజ్యాంగ సంస్థలు
ii) చట్టపర సంస్థలు
iii) చట్టేతర సంస్థలు
iv) రాజ్యాంగేతర సంస్థలు
1) i, ii
2) iii, iv
3) i, ii, iii
4) i, ii, iii, iv
- View Answer
- సమాధానం: 4
11. ఒక వ్యవస్థకు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించాలంటే రాజ్యాంగాన్ని ఏ రకమైన మెజార్టీతో సవరించాల్సి ఉంటుంది?
1) సాధారణ మెజార్టీ
2) సంపూర్ణ మెజార్టీ
3) ప్రత్యేక మెజార్టీ
4) 2/3వ వంతు మెజార్టీ
- View Answer
- సమాధానం: 3
12. కింది వాటిలో దేనికి/ వేటికి రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించారు?
1) జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్లు
2) జిల్లా ప్రణాళిక కమిటీ
3) మెట్రోపాలిటన్ ప్లానింగ్ కమిటీ
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
13. కింది వాటిలో సరైన జత ఏది?
1) ప్రకరణ 243ఎ - గ్రామసభ
2) ప్రకరణ 243కె - రాష్ట్ర ఎన్నికల సంఘం
3) ప్రకరణ 148 - కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
14. కింద పేర్కొన్న ఏ రాజ్యాంగ సంస్థను రాష్ట్ర ప్రభుత్వం నియమించినప్పటికీ, దాని సభ్యులను తొలగించే అధికారం మాత్రం రాష్ట్రపతికి ఉంటుంది?
1) రాష్ట్ర ఎన్నికల సంఘం
2) రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్
3) 1, 2
4) అలాంటి సంస్థలు ఉండవు
- View Answer
- సమాధానం: 3
15. కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించి కింది వాటిలో సరైన వ్యాఖ్య ఏది?
1) కేంద్ర ఎన్నికల సంఘంలోని సభ్యుల సంఖ్యను రాష్ట్రపతి నిర్ణయిస్తారు, కానీ పార్లమెంట్ నియంత్రిస్తుంది
2) కేంద్ర ఎన్నికల సంఘం అనేది ఒక పాక్షిక న్యాయ సంస్థ
3) 1, 2
4) 1, 2 సరికావు
- View Answer
- సమాధానం: 3
16.కింద పేర్కొన్న ఏ అంశానికి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘానికి సలహా పూర్వక అధికారం ఉంటుంది?
1) శాసనసభ్యుల అనర్హత
2) శాసనసభ్యుల అర్హత
3) నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 1
17. కింది వాటిలో సరైంది ఏది?
1) ప్రజా ప్రాతినిధ్య చట్టం, 1950 - పార్లమెంట్, రాష్ట్రాల శాసనసభల్లో సీట్ల కేటాయింపు
2) ప్రజా ప్రాతినిధ్య చట్టం, 1951 - పార్లమెంట్, రాష్ట్ర శాసనసభ్యుల అనర్హత
3) ఎన్నికల ప్రవర్తన నియమావళి, 1971
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
18. కింది వాటిలో సరైన వాక్యం ఏది?
1) లోక్‌సభకు పోటీ చేసే అభ్యర్థి సంబంధిత రాష్ట్రంలో ఓటరై ఉండాలి
2) రాష్ట్ర శాసనసభకు పోటీ చేసే అభ్యర్థి ఆ రాష్ట్రంలో ఓటరై ఉండాలి
3) లోక్‌సభకు పోటీ చేసే అభ్యర్థి నామినేషన్‌తో పాటు రూ. 15,000 ధరావతు చెల్లించాలి
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 2
19. కేంద్ర ఆర్థిక సంఘానికి సంబంధించి కింది వాటిలో సరైన వ్యాఖ్య ఏది?
1) ఆర్థిక సంఘం సభ్యుల అర్హతలు, ఎంపిక చేసే విధానాన్ని పార్లమెంట్ ఒక చట్టం ద్వారా నిర్ణయిస్తుంది
2) ఆర్థిక సంఘం విధులన్నీ సలహా పూర్వకమైనవే
3) 1, 2
4) 1, 2 సరికావు
- View Answer
- సమాధానం: 3
20. కింది వాటిలో సరికాని జత ఏది?
1) రెండో ఆర్థిక సంఘం అధ్యక్షుడు - కె. సంతానం
2) ఆరో ఆర్థిక సంఘం అధ్యక్షుడు - కె. బ్రహ్మానంద రెడ్డి
3) పన్నెండో ఆర్థిక సంఘం అధ్యక్షుడు - సి. రంగరాజన్
4) పదమూడో ఆర్థిక సంఘం అధ్యక్షుడు - వినోద్‌రాయ్
- View Answer
- సమాధానం: 4
21. కింది వాటిలో రాష్ట్రపతి రాజముద్రతో సంతకం చేసి, నియామకం చేసే రాజ్యాంగపరమైన పదవి ఏది?
1) కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్
2) జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ల చైర్పర్సన్లు
3) రాష్ట్ర గవర్నర్
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
22. కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు కింది వాటిలో దేన్ని ఆపాదించలేదు?
1) ప్రతిభను పరిరక్షించే కాపలాదారు
2) అత్యున్నత సర్వీసులకు ఖాళీలను భర్తీ చేసే సంస్థ
3) దీని విధులన్నీ సలహాపూర్వకమైనవే
4) వివిధ కేటగిరీలకు రిజర్వేషన్లు నిర్ణయిస్తుంది
- View Answer
- సమాధానం: 4
23. కింద పేర్కొన్న ఏ వర్గాల వారికి ప్రత్యేక జాతీయ కమిషన్‌ను ఏర్పాటు చేయలేదు?
1) సఫాయి కర్మచారీలు
2) దేవాంగులు
3) 1, 2
4) పైవేవీ కాదు
- View Answer
- సమాధానం: 2
24. కింది వాటిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఉమ్మడిగా వర్తించే రాజ్యాంగపరమైన పదవి ఏది?
1) కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్
2) అటార్నీ జనరల్
3) సొలిసిటర్ జనరల్
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 1
25. అటార్నీ జనరల్‌కు సంబంధించి కింది వాటిలో సరైంది ఏది?
1) సుప్రీంకోర్టు న్యాయమూర్తి పదవికి సరిపోయే అర్హతలు ఉండాలి
2) పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొనవచ్చు
3) పార్లమెంట్ సభ్యులకు ఉన్న స్వాధికారాలు ఉంటాయి
4) పైవన్నీ
- View Answer
- సమాధానం:4
26. కింద పేర్కొన్న ఏ కమిషన్ ఎలాంటి నివేదిక సమర్పించదు?
1) కేంద్ర ఎన్నికల సంఘం
2) మానవ హక్కుల కమిషన్
3) మహిళా హక్కుల కమిషన్
4) బాలల హక్కుల కమిషన్
- View Answer
- సమాధానం: 1
27. కింద పేర్కొన్న భారత ప్రభుత్వ చట్టాల్లో కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటుకు అవకాశం కల్పించిన చట్టం ఏది?
1) కౌన్సిళ్ల చట్టం, 1880
2) భారత ప్రభుత్వ చట్టం, 1909
3) భారత ప్రభుత్వ చట్టం, 1919
4) భారత ప్రభుత్వ చట్టం, 1935
- View Answer
- సమాధానం: 3
28. పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు సంబంధించి కింది వాటిలో సరైన వ్యాఖ్య ఏది?
1) ఇది ఒక సలహా సంఘం
2) ఉద్యోగులను నియమిస్తుంది
3) క్రమశిక్షణ చర్యలు తీసుకుంటుంది
4) పదోన్నతులు చేస్తుంది
- View Answer
- సమాధానం: 1
29. కింది వాటిలో బహుళ సభ్యత్వం ఉన్న రాజ్యాంగ సంస్థ ఏది?
1) ఎన్నికల సంస్థ
2) ఆర్థిక సంఘం
3) పబ్లిక్ సర్వీస్ కమిషన్
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
30. కింది వాటిలో ఎలక్షన్ కమిషన్ పరిధిలో ఉన్న అంశం ఏది?
i) ప్రధానమంత్రి ఎన్నిక
ii) రాజకీయ పార్టీల గుర్తింపు
iii) రాష్ట్రపతి ఎన్నిక
iv) రాజకీయ పార్టీలకు ఎన్నికల చిహ్నాల కేటాయింపు
1) i, ii, iii, iv
2) ii, iii
3) iii, iv
4) ii, iii, iv
- View Answer
- సమాధానం: 4
31. కింది వాటిలో ఎవరి/దేని సిఫారసులు కేవలం సలహా పూర్వకమైనవి?
1) ఆర్థిక సంఘం
2) పబ్లిక్ సర్వీస్ కమిషన్లు
3) కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్
4) 1, 2
- View Answer
- సమాధానం: 4
32.కింద పేర్కొన్న ఏ రాజ్యాంగ పదవికి సంబంధించిన అర్హతలను.. పార్లమెంట్ ఒక చట్టం ద్వారా నిర్ణయిస్తుంది?
1) కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్
2) కేంద్ర ఆర్థిక సంఘం
3) 1, 2
4) పై రెండూ కాదు
- View Answer
- సమాధానం: 3
33. కింది వాటిలో పార్లమెంట్ కమిటీలతో సహ సంబంధం ఉన్న రాజ్యాంగ పదవి ఏది?
1) కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్
2) అటార్నీ జనరల్
3) 1, 2
4) ఏదీకాదు
- View Answer
- సమాధానం: 1
34. అతి ప్రాచీనమైన చట్టపర సంస్థ ఏది?
1) జాతీయ మానవ హక్కుల కమిషన్
2) మైనార్టీ హక్కుల కమిషన్
3) బాలల హక్కుల కమిషన్
4) మహిళా హక్కుల కమిషన్
- View Answer
- సమాధానం: 2
35. మానవ హక్కుల కమిషన్‌లో హోదా రీత్యా సభ్యులు ఎవరు?
1) జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ల చైర్పర్సన్లు
2) జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్
3) జాతీయ మైనార్టీ హక్కుల కమిషన్ చైర్మన్
4) పైన పేర్కొన్న వారందరూ
- View Answer
- సమాధానం: 4
36. మానవ హక్కుల కమిషన్ చైర్మన్ పదవికి అర్హత ఏమిటి?
1) సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి అయుండాలి
2) హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పని చేసి ఉండాలి
3) సుప్రీంకోర్టు సాధారణ న్యాయమూర్తిగా పనిచేసి ఉండాలి
4) పైవేవీ కాదు
- View Answer
- సమాధానం:1
37. కింద పేర్కొన్న ఏ కమిషన్‌లో తప్పనిసరిగా ఒక మహిళా సభ్యురాలు ఉండాలి?
1) జాతీయ ఎస్సీ కమిషన్
2) జాతీయ ఎస్టీ కమిషన్
3) జాతీయ బాలల హక్కుల కమిషన్
4) పైవన్నీ
- View Answer
- సమాధానం:4
38. జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్‌కు సంబంధించి కింది వాటిలో సరైంది ఏది?
1) దీన్ని 1993లో ఏర్పాటు చేశారు
2) ఈ కమిషన్‌కు చైర్మన్‌గా నియమించాలంటే సుప్రీంకోర్టు లేదా హైకోర్టు న్యాయమూర్తిగా పని చేసి ఉండాలి
3) ప్రస్తుత చైర్మన్ జస్టిస్ వి. ఈశ్వరయ్య
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
39. కింది వాటిలో సరైన జత ఏది?
1) జాతీయ మహిళా కమిషన్ మొదటి చైర్పర్సన్ - జయంతీ పట్నాయక్
2) జాతీయ మానవ హక్కుల కమిషన్ తొలి చైర్మన్ - జస్టిస్ రంగనాథ్ మిశ్రా
3) జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ మొదటి చైర్మన్ - జస్టిస్ ఆర్.ఎన్. ప్రసాద్
4) పైవన్నీ
- View Answer
- సమాధానం:4
40. కింద పేర్కొన్న ఏ జాతీయ కమిషన్‌కు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించే ప్రయత్నం చేశారు?
1) మానవ హక్కుల కమిషన్
2) మహిళా హక్కుల కమిషన్
3) మైనార్టీ హక్కుల కమిషన్
4) పైవేవీ కాదు
- View Answer
- సమాధానం: 3
41. జాతీయ మానవ హక్కుల కమిషన్ గురించి కింది వాటిలో సరైన వాక్యం ఏది?
1) ఇందులో నలుగురు సభ్యులు ఉంటారు
2) సభ్యుల పదవీ కాలం అయిదేళ్లు
3) పదవీ విరమణ వయసు 70 ఏళ్లు
4) పైవన్నీ
- View Answer
- సమాధానం:4
42. కింది వాటిలో ప్రభుత్వ ఉద్యోగుల్లో అక్రమ ప్రవర్తన, అవినీతిని అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం నియమించిన సంస్థలు ఏవి?
i) సెంట్రల్ విజిలెన్స్ కమిషన్
ii) లోక్‌పాల్
iii) సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్
iv) స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్
1) i, iii, iv
2) i, iv
3) iii, iv
4) ii, iii, iv
- View Answer
- సమాధానం: 1
43. కేంద్ర సమాచార కమిషన్‌కు సంబంధించి కింది వాటిలో సరైంది ఏది?
1) ఇది బహుళ సభ్య సంస్థ
2) కేంద్ర సిబ్బంది మంత్రిత్వ శాఖ కింద పని చేస్తుంది
3) ఇది తన నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పిస్తుంది
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
44. కింద పేర్కొన్న ఏ కమిషన్ పదవీ కాలం మూడేళ్లు ఉంటుంది?
1) జాతీయ మహిళా కమిషన్
2) జాతీయ మైనార్టీ కమిషన్
3) జాతీయ సఫాయి కర్మచారీ కమిషన్
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4