అతి పురాతన సామాజిక వ్యవస్థ?
- View Answer
- సమాధానం: కుటుంబం
2. వ్యక్తి మూర్తిమత్వంపై అత్యధిక ప్రభావం చూపేది?
- View Answer
- సమాధానం: అతడి కుటుంబం
3. బ్రహ్మ వివాహం అంటే?
- View Answer
- సమాధానం: వధువు తండ్రి వరుణ్ని వెతికి పెళ్లి చేయడం
4. సామాజిక వ్యవస్థాపనలోని ప్రాథమిక అంశం?
- View Answer
- సమాధానం: కుటుంబ ఏర్పాటు
5. సమాజం అంటే?
- View Answer
- సమాధానం: ఒకే సామూహిక గుర్తింపు కలిగి సంఘటి తమైన అనేక ప్రజల సముదాయంతో కూడిన సమూహం.
6. వరకట్న నిషేధ చట్టాన్ని ఏ సంవత్సరం నుంచి అమలు చేస్తున్నారు?
- View Answer
- సమాధానం: 1961
7. కులం అంటే?
- View Answer
- సమాధానం: వివాహం లేదా వంశానుక్రమంతో అను సంధానమైన ఒక సమూహం
8. అణచివేత సంస్కృతికి ప్రాతినిధ్యం వహించేది?
- View Answer
- సమాధానం:కుల వ్యవస్థ
9. బాల కార్మిక వ్యవస్థ నిషేధ చట్టం ప్రకారం పిల్లలను పనిలో పెట్టుకునేవారికి విధించే శిక్ష?
- View Answer
- సమాధానం: ఒక సంవత్సరం జైలు శిక్ష లేదా 25 వేల రూపాయల జరిమానా
10. సాంఘిక దురాచారాలకు వ్యతిరేకంగా పోరాడిన సంఘసంస్కర్త?
- View Answer
- సమాధానం: రాజా రామ్మోహనరాయ్
11. సమాజాభివృద్ధి అంటే?
- View Answer
- సమాధానం: సమాజంలోని ప్రజల కనీస అవసరాలన్నీ తీరి అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడం.
12. గుణాత్మకమైన సమాజాభివృద్ధి అంటే?
- View Answer
- సమాధానం: ప్రజలందరూ విద్యావంతులై, సామాజిక స్పృహ కలిగి, మంచి అలవాట్లు కలిగి ఉండటం.
13. ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించడం ఎవరి బాధ్యత?
- View Answer
- సమాధానం: ప్రజలందరి బాధ్యత
14. ది ప్రిన్స్ గ్రంథ రచయిత?
- View Answer
- సమాధానం: మాకియవెల్లి
15. ఆదర్శరాజ్యం అంటే?
- View Answer
- సమాధానం: ఉన్నత జీవన ప్రమాణాలు అనుభవిస్తున్న ప్రజలున్న రాజ్యం
16. ప్రభుత్వం అంటే?
- View Answer
- సమాధానం: రాజ్యాభీష్టాన్ని వ్యక్తంచేసి అమలుపరిచే యంత్రాంగం.
17. ప్రభుత్వానికి మూలం?
- View Answer
- సమాధానం: ప్రజల సమ్మతి
18. రాజ్యం ముఖ్య లక్షణాల్లో అతి ప్రధానమైంది?
- View Answer
- సమాధానం: సార్వభౌమాధికారం
19. రాజ్యం తరఫున సార్వభౌమాధికారాన్ని అనుభవించేది ఎవరు?
- View Answer
- సమాధానం: ప్రభుత్వం
20. నేషన్ అనే ఆంగ్లపదం నేటస్, నేషియో అనే లాటిన్ పదాల నుంచి ఆవిర్భవించింది. వాటి అర్థం?
- View Answer
- సమాధానం: పుట్టుక
21. జాతి అంటే?
- View Answer
- సమాధానం: ప్రజల్లోని భావ సమైక్యత, సామాజిక సంబంధాల వల్ల ఏర్పడిన ఉమ్మడి భావంతో ఉన్న మానవ సమూహం.
22. జాతియత అంటే?
- View Answer
- సమాధానం: ఐక్యతా భావంతో కూడిన సాంస్కృతిక ఏకజాతి ప్రజా సమూహం.
23. జాతియత భావనను పెంపొందించేది?
- View Answer
- సమాధానం: భాష
24. జాతుల స్వయం నిర్ణయాధికార సిద్ధాంతాన్ని బలపర్చింది ఎవరు?
- View Answer
- సమాధానం: ఉడ్రో విల్సన్ (1918)
25. జాతీయ భావాల వ్యాప్తికి బలమైన శక్తిగా పనిచేసేది?
- View Answer
- సమాధానం: మతం
26. రాజ్యం అంటే ఆచరణలో ప్రభుత్వం అని అభిప్రాయపడిందెవరు?
- View Answer
- సమాధానం: రాస్కీ
27. సమాచార హక్కు అంటే?
- View Answer
- సమాధానం:ప్రజాసంస్థల వద్దనున్న సమాచారాన్ని పొందే హక్కు
28. సమాచార హక్కు చట్టం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది?
- View Answer
- సమాధానం: అక్టోబర్ 12, 2005
29. సమాచార హక్కు చట్టాన్ని రూపొందించడానికి గల ప్రధాన ఉద్దేశం?
- View Answer
- సమాధానం: ప్రభుత్వ పాలనలో పారదర్శకతను పెంచడానికి
30. సమాచార హక్కు చట్టం-2005 ఏ రాష్ట్రానికి వర్తించదు?
- View Answer
- సమాధానం: జమ్మూ కశ్మీర్
31. ఏదైనా ప్రభుత్వ కార్యాలయంలో మనం కోరిన సమాచారాన్ని ఇచ్చే అధికారిని ఏమంటారు?
- View Answer
- సమాధానం: ప్రజాసమాచార అధికారి (పీఐవో)
32. మనం కోరిన సమాచారాన్ని (పీఐవో) ఎన్ని రోజుల్లో ఇవ్వాలి (చట్ట ప్రకారం)
- View Answer
- సమాధానం: 30 రోజుల్లో
33. సమాచార హక్కు చట్టం-2005 ప్రకారం మనం కోరిన సమాచారం వ్యక్తి జీవన్మరణ సమస్యకు సంబంధించిందైతే పీఐవో ఎన్ని రోజుల్లో సమాచారం ఇవ్వాలి?
- View Answer
- సమాధానం: రెండు రోజుల్లో
34. కేంద్ర ప్రధాన సమాచార కమిషర్‌ను ఎవరు నియమిస్తారు?
- View Answer
- సమాధానం: రాష్ర్టపతి
35.కేంద్ర సమాచార కమిషన్ ప్రధాన కార్యా లయం ఎక్కడ ఉంది?
- View Answer
- సమాధానం: న్యూఢిల్లీ
36. కేంద్ర సమాచార కమిషన్ పదవీ కాలం ఎంత?
- View Answer
- సమాధానం: 5 సంవత్సరాలు
37. సమాచార హక్కు చట్టం-2005 చట్టాన్ని ఉల్లంఘించిన ప్రజా సమాచార అధికారికి విధించే శిక్ష?
- View Answer
- సమాధానం: గడువు తర్వాత రోజుకి రూ.250 చొప్పున రూ.25 వేలకు మించకుండా జరిమానా విధిస్తారు.
38. సమాచార హక్కు ఏ విధమైన హక్కు?
- View Answer
- సమాధానం: చట్టబద్ధమైన హక్కు
39. మానవ హక్కుల భావనను మొదటిసారిగా ఏ దేశ రాజ్యాంగంలో పొందుపర్చారు?
- View Answer
- సమాధానం: అమెరికా
40. అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు?
- View Answer
- సమాధానం: డిసెంబర్ 10
41.ముఖ్యమైన మానవ హక్కులేవి?
- View Answer
- సమాధానం: జీవించే హక్కు, విద్యాహక్కు, ఆస్తిహక్కు, మానవుడి ప్రాథమిక అవసరాలు తీర్చే హక్కులు (ప్రాథమిక హక్కులు)
42. మనదేశంలో జాతీయ మానవ హక్కుల కమిషన్‌ను మొదట ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు?
- View Answer
- సమాధానం: 1993
43. రాష్ర్ట మానవ హక్కుల కమిషన్‌ను ఎవరు ఏర్పాటు చేస్తారు?
- View Answer
- సమాధానం: గవర్నర్
44. ఐక్య రాజ్య సమితి సార్వజనీన మానవ హక్కుల ప్రకటనను చేసిన సంవత్సరం?
- View Answer
- సమాధానం: 1948 (డిసెంబర్ 10)
45. మహిళా సాధికారత అంటే?
- View Answer
- సమాధానం: స్త్రీల పట్ల వివక్షతను తొలగించి అన్ని రంగాల్లో వారి భాగస్వామ్యాన్ని కల్పిస్తూ వారి హోదాను పెంపొందించడం.
46. మానవ హక్కులంటే?
- View Answer
- సమాధానం: మానవుడు స్వేచ్ఛగా జీవించడానికి కావ ల్సిన హక్కులు.
47. బాల కార్మికులంటే?
- View Answer
- సమాధానం: 14 సంవత్సరాల లోపు వయస్సు ఉండి, పనికి వెళ్లే బాలబాలికలు.
48. గణతంత్ర రాజ్యం అంటే?
- View Answer
- సమాధానం: దేశాధ్యక్షుడి(రాష్ర్టపతి)ని ప్రత్యక్షంగా/ పరోక్షంగా ప్రజలు ఎన్నుకున్న దేశం.
49. లోక్ అదాలత్ (ప్రజాన్యాయస్థానం) అంటే?
- View Answer
- సమాధానం: సులభంగా పరిష్కరించదగిన కేసులను పెద్దమనుషుల మధ్యవర్తిత్వంతో చట్ట బద్ధంగా తీర్పునిచ్చే న్యాయస్థానం.
50. జీవితంలో అంతర్భాగమైన మానవ హక్కు?
- View Answer
- సమాధానం:జీవించే హక్కు
51. మానవ వికాసానికి కావాల్సిన ప్రాథమిక హక్కు?
- View Answer
- సమాధానం: విద్యా హక్కు
52. సమాచార హక్కును తిరస్కరించడం అనేది?
- View Answer
- సమాధానం: మానవహక్కుల ఉల్లంఘన
53. మానవ హక్కులను పరిరక్షించాల్సిన బాధ్యత ఎవరిది?
- View Answer
- సమాధానం: ప్రభుత్వం
54. హక్కులు రాజ్యాంగం అంతరాత్మ అని వ్యాఖ్యానించినవారు?
- View Answer
- సమాధానం: జవహర్లాల్ నెహ్రూ
55. ఎవరు ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో ఆస్తిహక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుంచి తొలగించారు?
- View Answer
- సమాధానం: ఇందిరా గాంధీ
56. ఆస్తిహక్కును ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రాథమిక హక్కుల జాబితా నుంచి తొలగించారు?
- View Answer
- సమాధానం: 44వ సవరణ
57. మనదేశంలో ప్రాథమిక హక్కులపై పరి మితులు విధించే అధికారం ఎవరికి ఉంది?
- View Answer
- సమాధానం: పార్లమెంట్
58. రాజ్యం మద్దతులేని హక్కులు?
- View Answer
- సమాధానం: నైతిక హక్కులు
59. ప్రవాస భారతీయ దివస్‌ను ఏ రోజున జరుపుకుంటారు?
- View Answer
- సమాధానం: జనవరి 9
60. లోక్‌పాల్, లోకాయుక్తను ఏర్పాటు చేయాలని సూచించిన కమిటీ?
- View Answer
- సమాధానం: సంతానం కమిటీ (1964)
61. దేశంలో తొలిసారిగా లోకాయుక్త వ్యవస్థను ఏర్పాటు చేసిన రాష్ర్టం?
- View Answer
- సమాధానం: మహారాష్ర్ట (1991)
62. లోకాయుక్త చట్టాన్ని తొలిసారిగా రూపొందించిన రాష్ర్టం?
- View Answer
- సమాధానం: ఒడిశా (1970)
63. లోకాయుక్తగా నియమితులవడానికి ఎవరు అర్హులు?
- View Answer
- సమాధానం: హైకోర్టు న్యాయమూర్తి లేదా హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి
64. లోకాయుక్త పదవీ కాలం?
- View Answer
- సమాధానం: 5 సంవత్సరాలు
65. లోకాయుక్తకు చేసే ఫిర్యాదు దరఖాస్తుతో పాటు ఎంత రుసుం చెల్లించాలి?
- View Answer
- సమాధానం: 150
66. లోక్ అదాలత్‌లను ఏ సంవత్సరంలో ఏర్పా టు చేశారు?
- View Answer
- సమాధానం: 2002
67. లోకాయుక్త ఎన్ని సంవత్సరాల్లోపు జరిగిన సంఘటనలపై మాత్రమే ఫిర్యాదులను స్వీకరిస్తుంది?
- View Answer
- సమాధానం: 6 సంవత్సరాల లోపు
68. లోకాయుక్త తన వార్షిక నివేదికను ఎవరికి సమర్పిస్తుంది?
- View Answer
- సమాధానం: గవర్నర్‌కు
69. జాతీయ మానవ హక్కుల కమిషన్ మొదటి ఛైర్మన్?
- View Answer
- సమాధానం: రంగనాథ్ మిశ్రా
70. రాజ్యాంగంలోని ఏ అధికరణం ప్రకారం సమాచార హక్కును ప్రాథమిక హక్కులో భాగంగా పొందుపర్చారు?
- View Answer
- సమాధానం: 19వ ప్రకరణ
71. భారతదేశంలో భౌగోళిక ప్రదేశం ఆధారంగా అతిపెద్ద నియోజక వర్గం ఏది?
- View Answer
- సమాధానం: లడక్
72. సుపరిపాలన (గుడ్ గవర్నెన్స్) ప్రధాన లక్షణం?
- View Answer
- సమాధానం: పాలనకు చట్టబద్ధత కల్పించడం
73. ఇ- గవర్నెన్స్ అంటే?
- View Answer
- సమాధానం: ఎలక్ట్రానిక్ పాలన
74. ఇ- గవర్నెన్స్ ప్రధాన ధ్యేయం?
- View Answer
- సమాధానం: పాలనలో పారదర్శకతను పెంచడం
75. Friends పాలనను ప్రవేశపెట్టిన రాష్ర్టం -
- View Answer
- సమాధానం: కేరళ