కేంద్ర - రాష్ట్ర సంబంధాలు
1. భారత రాజ్యాంగం ప్రకారం కింద పేర్కొన్నవాటిలో సరికాని జత ఏది?(సివిల్ సర్వీసెస్ 2004)
ఎ) అడవులు - ఉమ్మడి జాబితా
బి) ప్రజారోగ్యం - రాష్ట్ర జాబితా
సి) పోస్టాఫీస్ సేవింగ్ - కేంద్ర జాబితా
డి) స్టాక్ ఎక్స్ఛేంజ్ - ఉమ్మడి జాబితా
- View Answer
- సమాధానం: డి
2. కిందివాటిలో ఏడో షెడ్యూల్లోని కేంద్ర జాబితాలో ఉన్న అంశం ఏది?(సివిల్ సర్వీసెస్ 2006)
ఎ) మత్స్య పరిశ్రమ
బి) గనులు, చమురు క్షేత్రాల్లో పనిచేసే శ్రామికులు, వారి భద్రతను క్రమబద్ధీకరించడం
సి) ప్రజారోగ్యం
డి) వ్యవసాయం
- View Answer
- సమాధానం: బి
3. కింది వ్యాఖ్యలను పరిశీలించండి. (సివిల్ సర్వీసెస్ 2004)
1) భారత ప్రణాళికలను నిర్ణయించే అత్యున్నత సంస్థ - భారత ప్రణాళికా సంఘం
2) ప్రణాళిక సంఘం కార్యదర్శి జాతీయాభివృద్ధి మండలి కార్యదర్శిగానూ వ్యవహరిస్తారు.
3) రాజ్యాంగంలోని ఏడో షెడ్యూల్లో ఉమ్మడి జాబితాలో ఆర్థిక సామాజిక ప్రణాళికను చేర్చారు.
పైన పేర్కొన్న వ్యాఖ్యల్లో సరైంది ఏది?
ఎ) 1, 2
బి) 2, 3
సి) 2 మాత్రమే
డి) 3 మాత్రమే
- View Answer
- సమాధానం: సి
4. శాంతి భద్రతలు ఏ జాబితాకు చెందినవి? (గ్రూప్-1, 1991)
ఎ) కేంద్ర జాబితా
బి) ఉమ్మడి జాబితా
సి) రాష్ట్ర జాబితా
డి) ఏదీకాదు
- View Answer
- సమాధానం: సి
5. విద్య ఏ జాబితాకు చెందింది? (ఎస్.ఐ. 1981)
ఎ) రాష్ట్ర
బి) కేంద్ర
సి) ఉమ్మడి
డి) ఏదీకాదు
- View Answer
- సమాధానం: సి
6. భారత రాజ్యాంగం సమాఖ్యపూరితమైందని తెలియజేసేది? (సివిల్ సర్వీసెస్ 1994)
ఎ) స్వతంత్ర న్యాయవ్యవస్థ
బి) లిఖిత రాజ్యాంగం
సి) కేంద్ర రాష్ట్రాల మధ్య అధికార విభజన
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
-
7. భారత రాజ్యాంగాన్ని అర్ధ సమాఖ్యగా వర్ణించిందెవరు?
ఎ) ఆస్టిన్
బి) మారిస్‌జోన్స్
సి) కె.సి. వేర్
డి) ఆపిల్ బీ
- View Answer
- సమాధానం: సి
-
8. ‘రాజ్యాంగం అవలంబించిన రాజకీయ వ్యవస్థ కాలం, పరిస్థితులకు అనుగుణంగా ఏకకేంద్ర, సమాఖ్య లక్షణాలను కలిగి ఉంటుంది’ అని ఎవరన్నారు?
ఎ) అంబేద్కర్
బి) నెహ్రూ
సి) పటేల్
డి) ఆపిల్ బీ
- View Answer
- సమాధానం: ఎ
-
9. కేంద్ర - రాష్ర్ట ఆర్థిక సంబంధాలపై సిఫారసులు చేసేది?
ఎ) సర్కారియా కమిషన్
బి) ఆర్థిక మంత్రి
సి) ఆర్థిక సంఘం
డి) ప్రణాళికా సంఘం
- View Answer
- సమాధానం: సి
-
10. కేంద్ర - రాష్ర్ట సంబంధాల్లో సమస్యలకు ప్రధాన కారణం?
ఎ) ఆర్థిక వనరుల కేటాయింపు
బి) నదీ జలాల వివాదం
సి) రాష్ట్రాల అధికారాల్లో కేంద్రం జోక్యం చేసుకోవడం
డి) పైవేవీ కాదు
- View Answer
- సమాధానం: సి
-
11. కింది వాటిలో కేంద్ర - రాష్ర్ట సంబంధాలతో సంబంధం లేనిది?
ఎ) ఇంద్రజిత్ గుప్త కమిటీ
బి) రాజమన్నార్ కమిటీ
సి) సర్కారియా కమిషన్
డి) పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ మెమోరాండం
- View Answer
- సమాధానం: ఎ
-
12.కింది వాటిలో కేంద్ర, రాష్ర్ట సంబంధాలతో సంబంధం లేనిది?
ఎ) ఇంద్రజిత్ గుప్తా కమిటీ
బి) పశ్చిమబెంగాల్ ప్రభుత్వ మెమొరాండం
సి) రాజమన్నార్ కమిటీ
డి) సర్కారియా కమిషన్
- View Answer
- సమాధానం: ఎ
13. రెండో పరిపాలనా సంస్కరణల సంఘం అధ్యక్షుడు ఎవరు?
ఎ) సి. రంగరాజన్
బి) వినోద్ రాయ్
సి) వీరప్పమొయిలీ
డి) వినితారాయ్
- View Answer
- సమాధానం: సి
14. ఎన్నికల అజమాయిషీ, సూచనలు, నియంత్రణ ఎన్నికల సంఘం చేతుల్లో ఉండాలని ఏ రాజ్యాంగ అధికరణ తెలుపుతుంది?
ఎ) 324
బి) 323
సి) 325
డి) 326
- View Answer
- సమాధానం: ఎ
15.కింది వాటిలో ఏ కేసు విషయంలో సుప్రీంకోర్టు తీర్పు కేంద్ర, రాష్ర్ట సంబంధాలను పునర్ నిర్వచించింది?
ఎ) ఇంద్ర సహానీ కేసు
బి) రాయనరావు కేసు
సి) ఎస్.ఆర్. బొమ్మయ్ కేసు
డి) ఐ.ఆర్. కొయల్హో కేసు
- View Answer
- సమాధానం: సి
16. కేంద్ర, రాష్ర్ట సంబంధాలకు సంబంధించి డి.ఆర్.గాడ్గిల్ సూత్రాన్ని ఎందుకు ఉపయోగిస్తారు?
ఎ) పన్నుల రాబడుల విభజన
బి) రాష్ర్ట రుణాల మాఫీ
సి) రాష్ట్రాలు కొత్త అప్పులు చేయకుండా ఉండటానికి
డి) రాష్ట్రాలకు కేంద్ర సహాయాన్ని సమకూర్చడానికి
- View Answer
- సమాధానం: డి
17. సర్కారియా కమిషన్ అధ్యయన నివేదికను ఎప్పుడు సమర్పించింది?
ఎ) 1988
బి) 1989
సి) 1987
డి) 1986
- View Answer
- సమాధానం: సి
18. అఖిల భారత సర్వీసులను ముఖ్యంగా ఐఏఎస్, ఐపీఎస్‌లను రద్దు చేయాలని సిఫారసు చేసిన కమిటీ ఏది?
ఎ) సర్కారియా కమిషన్
బి) రాజమన్నార్ కమిషన్
సి) ఖేర్ కమిషన్
డి) కాకా కలేల్కర్ కమిషన్
- View Answer
- సమాధానం: బి