ప్రవేశిక - తాత్విక పునాదులు (Preamble - Philosophical Foundations)
1. భారత్‌లో రాజ్యాధికారానికి మూలం?
ఎ) రాజ్యాంగం
బి) పార్లమెంట్
సి) ప్రజలు
డి) రాష్ర్టపతి
- View Answer
- సమాధానం: సి
2. భారత రాజ్యాంగ పీఠికలోని పదాలు?
ఎ) సార్వభౌమాధికార, ప్రజాస్వామిక, సామ్యవాద, గణతంత్ర రాజ్యం
బి) సార్వభౌమాధికార, సామ్యవాద, లౌకిక, గణతంత్ర రాజ్యం
సి) సార్వభౌమాధికార, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామిక రాజ్యం
డి) సార్వభౌమాధికార, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామిక, గణతంత్ర రాజ్యం
- View Answer
- సమాధానం: డి
3. భారత రిపబ్లిక్ రాజ్యాంగం?
ఎ) రాజ్యాంగ సభ ద్వారా నిర్మితమై గవర్నర్ జనరల్ ఆమోదం పొందింది.
బి) బ్రిటిష్ పార్లమెంట్ ప్రతిపాదనతో రాజ్యాంగ సభ ద్వారా ఆమోదం పొందింది.
సి) భారత జాతీయ కాంగ్రెస్ ప్రస్తావించింది, రాజ్యాంగ సభ ద్వారా ఆమోదం పొందింది.
డి) రాజ్యాంగ పరిషత్ రచించి, స్వీకరించింది.
- View Answer
- సమాధానం: డి
4. రాజ్యాంగంలోని ఏ భాగం రాజ్యాంగ నిర్మాతల ఆశయాలను, అభిప్రాయాలను ప్రతిబింబిస్తుంది?
ఎ) ప్రవేశిక
బి) ప్రాథమిక హక్కులు
సి) ఆదేశిక సూత్రాలు
డి) అత్యవసర పరిస్థితికి సంబంధించిన ప్రకరణలు
- View Answer
- సమాధానం: ఎ
5. ప్రవేశికలో ప్రస్తావించిన సౌభ్రాతృత్వం అనే ఆదర్శాన్ని పెంపొందించే అంశాలు?
1. ఏక పౌరసత్వం
2. కేంద్రీకృత సమాఖ్య
3. ప్రాథమిక హక్కులు
4. ప్రాథమిక విధులు
ఎ) 1, 2
బి) 1, 3, 4
సి) 2, 3, 4
డి) 1, 2, 3, 4
- View Answer
- సమాధానం: బి
6. ప్రవేశికలో పేర్కొన్న ‘సమానత్వం’ దేనికి హామీ ఇస్తుంది?
ఎ) హోదా
బి) అవకాశాలు
సి) ఉపాధి
డి) ఎ, బి
- View Answer
- సమాధానం: డి
7. ఈ కింది వాటిలో సరైంది?
ఎ) ప్రవేశిక అధికారానికి ఆధారం కాదు, పరిమితి కాదు
బి) ప్రవేశిక సవరణకు అతీతం కాదు
సి) ప్రవేశికను రాజ్యాంగ రచన తర్వాత చేర్చారు, చివరిగా ఆమోదించారు
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
8.ప్రవేశికకు ఈ కింది వాటిలో వేటిని ఆపాదించవచ్చు?
ఎ) రాజ్యాంగానికి అనివార్యమైన భాగం
బి) రాజ్యాంగ ప్రకరణలను ప్రభావితం చేయదు
సి) రాజ్యాంగంలోని అంశాలకు సూచనాత్మకమైంది
డి) పైవేవీ ఆపాదించలేం
- View Answer
- సమాధానం: డి
-
9. ప్రవేశిక భావాన్ని మన రాజ్యాంగకర్తలు ఏ దేశ రాజ్యాంగం నుంచి తీసుకున్నారు?
ఎ) యు.ఎస్.ఎ.
బి) యు.కె.
సి) యు.ఎస్.ఎస్.ఆర్.
డి) జర్మనీ
- View Answer
- సమాధానం: ఎ
10. భారత రాజ్యాంగంలోని రిపబ్లిక్ అనే పదాన్ని ఏ దేశ రాజ్యాంగం నుంచి స్వీకరించారు?
ఎ) ఫ్రెంచి రాజ్యాంగం
బి) జర్మనీ రాజ్యాంగం
సి) యు.ఎస్. రాజ్యాంగం
డి) యు.కె. రాజ్యాంగం
- View Answer
- సమాధానం: ఎ
11. రాజ్యాన్ని మతం నుంచి వేరు చేయడాన్ని ఏమంటారు?
ఎ) నాస్తికవాదం
బి) సామ్యవాదం
సి) లౌకికవాదం
డి) సాంఘిక న్యాయం
- View Answer
- సమాధానం: సి
12.ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ అధికారాలను పరిమితం చేసేది?
ఎ) ప్రజలు
బి) రాజ్యాంగం
సి) పార్లమెంటు
డి) పత్రికలు
- View Answer
- సమాధానం: బి
13. ప్రవేశిక రాజ్యాంగ అంతర్భాగం అని, అదేవిధంగా కాదనీ పరస్పర వివాదాస్పదమైన తీర్పులను సుప్రీంకోర్టు ఏయే కేసుల్లో వ్యక్తీకరించింది?
ఎ) ఎ.కె.గోపాలన్, గోలక్‌నాథ్
బి) కేశవానంద భారతి, గోలక్‌నాథ్
సి) మేనకాగాంధీ, మినర్వా మిల్స్
డి) పైవేవీ కాదు
- View Answer
- సమాధానం: బి
14. ప్రవేశిక నుంచి ఏం రాబట్టవచ్చు?
ఎ) రాజ్యాంగానికి ఆధారం
బి) రాజకీయ వ్యవస్థ లక్ష్యాలు
సి) ప్రభుత్వ స్వరూపం
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
15. సమగ్రత అనే పదజాలాన్ని ప్రవేశికలోకి చేర్చడానికి కారణం?
ఎ) ప్రవేశిక రాజ్యాంగ అంతర్భాగం
బి) వేర్పాటువాద ఉద్యమాలు
సి) సుప్రీంకోర్టు తీర్పులు
డి) ఎ, సి
- View Answer
- సమాధానం: బి
16.ప్రవేశికలో సమకాలీన ప్రాముఖ్యతను, వివాదాన్ని సంతరించుకున్న పదాలు?
ఎ) లౌకికతత్వం, సామ్యవాదం
బి) ఐక్యత, సమగ్రత
సి) గణతంత్రం, సార్వభౌమాధికారం
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: ఎ
17. 42వ రాజ్యాంగ సవరణ ద్వారా భారత రాజ్యాంగ ప్రవేశికలో చేర్చిన పదాలేవి?
ఎ) సామ్యవాద, లౌకిక
బి) ప్రజాస్వామిక
సి) సార్వభౌమ
డి) రిపబ్లిక్
- View Answer
- సమాధానం: ఎ
18. భారత రాజ్యాంగంలో సంక్షేమ రాజ్యం అనే భావనను ఎక్కడ పొందుపరిచారు?
ఎ) ప్రాథమిక హక్కులు
బి) పీఠిక
సి) రాజ్య విధానం - ఆదేశిక సూత్రాలు
డి) నాలుగో షెడ్యూల్
- View Answer
- సమాధానం: సి
19.కింది వాటిలో భారత రాజ్యాంగంలోని సమాఖ్య లక్షణాలు?
i) దృఢ రాజ్యాంగం
ii) ద్విసభా విధానం
iii) సి.ఎ.జి. కార్యాలయం
iv) సమష్టి బాధ్యత
ఎ) i, ii, iii
బి) i, iv
సి) i, ii, iii, iv
డి) i, ii
- View Answer
- సమాధానం: డి
20. ‘రాజ్యాంగానికి ప్రవేశిక ఒక గుర్తింపు పత్రం లాంటిది’ అని పేర్కొన్నవారు?
ఎ) జస్టిస్ హిదయతుల్లా
బి) అంబేద్కర్
సి) మహాత్మాగాంధీ
డి) ఎం.ఎ. నాని పాల్కీవాలా
- View Answer
- సమాధానం: డి
21. ప్రవేశిక-గ్రహించిన అంశాలకు సంబంధించి కిందివాటిలో సరికాని జత?
ఎ) ప్రజాస్వామ్యం - అమెరికా
బి) గణతంత్రం - ఫ్రాన్స్
సి) సామ్యవాదం - రష్యా
డి) లౌకిక - బ్రిటన్
- View Answer
- సమాధానం: డి
22. సుప్రీంకోర్టు ఏ కేసులో ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగం కాదని తీర్పునిచ్చింది?
ఎ) కేశవానంద భారతి కేసు
బి) బెరుబారి వర్సెస్ యూనియన్ కేసు
సి) ఎస్.ఆర్. బొమ్మాయ్ కేసు
డి) మినర్వా మిల్స్ కేసు
- View Answer
- సమాధానం: బి