భారతదేశంలో ఎన్నికల సంస్కరణలు
1. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని అమలు చేసిన మొదటి రాష్ర్టం?
ఎ) తమిళనాడు
బి) కర్ణాటక
సి) జమ్మూకశ్మీర్
డి) ఆంధ్రప్రదేశ్
- View Answer
- సమాధానం: సి
2. ఫ్లోర్ క్రాసింగ్ అంటే?
ఎ) అధికార పార్టీకి మద్దతు ప్రకటించడం
బి) రాజకీయ లబ్ధికోసం అధికార పార్టీలోకి ఫిరాయింపు
సి) రాజకీయ రంగాన్ని వీడటం
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: బి
3. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం అనర్హతపై అంతిమ అధికారం ఎవరికి ఉంటుంది?
ఎ) సుప్రీంకోర్టు
బి) కేంద్ర ఎన్నికల సంఘం
సి) సభాధ్యక్షులు
డి) రాష్ర్టపతి
- View Answer
- సమాధానం: సి
4. భారత రాజ్యాంగంలోని ఏ అధికరణ పార్లమెంటు సభ్యుల అనర్హతల గురించి తెలుపుతుంది?
ఎ) అధికరణ 101
బి) అధికరణ 102
సి) అధికరణ 108
డి) అధికరణ 110
- View Answer
- సమాధానం: బి
5.ఈవీఎం(ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్)లను ప్రవేశపెట్టిన మొదటి రాష్ర్టం?
ఎ) కేరళ
బి) హర్యానా
సి) అసోం
డి) పంజాబ్
- View Answer
- సమాధానం: ఎ
6.‘నోటా’ బటన్ను తొలుత ఏ లోక్సభ ఎన్నికల్లో ప్రవేశపెట్టారు?
ఎ) 13వ
బి) 14వ
సి) 15వ
డి) 16వ
- View Answer
- సమాధానం: డి
7. పార్టీ ఫిరాయింపుల చట్టం గురించి తెలిపే షెడ్యూల్ ఏది?
ఎ) 8
బి) 9
సి) 10
డి) పైవేవీ కావు
- View Answer
- సమాధానం: సి
8. ఓటరు గుర్తింపు కార్డులను ప్రవేశపెట్టిన మొదటి రాష్ర్టం?
ఎ) మణిపూర్
బి) మేఘాలయ
సి) హర్యానా
డి) హిమాచల్ ప్రదేశ్
- View Answer
- సమాధానం: సి
9. అభ్యర్థుల ఎన్నికల ప్రచార ఖర్చును ప్రభుత్వమే భరించే దేశం?
ఎ) పాకిస్తాన్
బి) యూఎస్ఏ
సి) ఇండియా
డి) బ్రిటన్
- View Answer
- సమాధానం: డి
10.ఓటరు దినోత్సవంగా ఏ రోజును జరుపుకుంటారు?
ఎ) జనవరి 3
బి) జనవరి 25
సి) జనవరి 26
డి) అక్టోబర్ 2
- View Answer
- సమాధానం: బి
11. ఎన్నికల సంస్కరణల సిఫారసుల కోసం వి.పి.సింగ్ ప్రభుత్వం నియమించిన కమిటీ?
ఎ) తార్కుండే కమిటీ
బి) దినేష్ గోస్వామి కమిటీ
సి) ఇంద్రజిత్ గుప్తా కమిటీ
డి) 15వ లా కమిషన్
- View Answer
- సమాధానం: బి
12. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ఆమోదించారు?
ఎ) 52వ రాజ్యాంగ సవరణ
బి) 73వ రాజ్యాంగ సవరణ
సి) 91వ రాజ్యాంగ సవరణ
డి) 61వ రాజ్యాంగ సవరణ
- View Answer
- సమాధానం: ఎ
13. ఎన్నికల సంస్కరణలను ప్రవేశపెట్టడానికికృషిచేసిన ఎన్నికల కమిషనర్?
ఎ) పేరిశాస్త్రి
బి) సుకుమార్ సేన్
సి) టి.ఎన్. శేషన్
డి) నజీంజైది
- View Answer
- సమాధానం: సి
14.పార్టీ ఫిరాయింపులకు సంబంధించి స్పీకర్ ఎంత కాలంలో నిర్ణయం ప్రకటించాలి?
ఎ) 3 నెలలు
బి) 6 నెలలు
సి) ఏడాది
డి) పైవేవీ కావు
- View Answer
- సమాధానం: డి
15. ఎన్నికల సంస్కరణల అంశాన్ని ఏ కమిటీ ప్రస్తావించింది?
1) తార్కుండే కమిటీ
2) గోస్వామి కమిటీ
3) సంతానం కమిటీ
4) సబార్ కమిటీ
ఎ) 1, 2 మాత్రమే
బి) 1, 3 మాత్రమే
సి) 1, 2, 3 మాత్రమే
డి) 3, 4 మాత్రమే
- View Answer
- సమాధానం: ఎ
16. ఎన్నో రాజ్యాంగ సవరణ ద్వారా మంత్రుల సంఖ్యకు పరిమితి విధించారు?
ఎ) 87
బి) 86
సి) 91
డి) 73
- View Answer
- సమాధానం:సి
17. కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్ట్)ను ఎప్పుడు స్థాపించారు?
ఎ) 1960
బి) 1961
సి) 1962
డి) 1964
- View Answer
- సమాధానం: డి