భారత రాజ్యాంగం - చారిత్రక నేపథ్యం
1. 1833 చార్టర్ చట్టం ప్రకారం ప్రవేశపెట్టిన అంశాల్లో కింది వాటిలో సరికానిది?
ఎ)ఈస్టిండియా కంపెనీ వాణిజ్య కార్యకలాపాల రద్దు
బి) కౌన్సిల్‌లోని ఉన్నతాధికారిని గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా మార్చడం
సి) కౌన్సిల్లో న్యాయ చట్టాలను చేసే అధికారం గవర్నర్ జనరల్ ఇచ్చింది
డి) గవర్నర్ జనరల్ కౌన్సిల్‌లోని న్యాయమండలికి మొదటిసారిగా భారతీయుడిని నియమించారు
- View Answer
- సమాధానం: డి
2. కింది వాటిలో సరైంది?
ఎ) బ్రిటన్ తరహాలో భారతదేశంలో రెగ్యులర్ పోలీసు దళాన్ని ఏర్పాటు చేసిన మొదటి గవర్నర్ జనరల్ వారెన్ హేస్టింగ్స్
బి) రెగ్యులేటింగ్ చట్టం-1773 ద్వారా కలకత్తాలో సుప్రీంకోర్టు ఏర్పాటు ప్రతిపాదన
సి) ఎ, బి
డి) ఏదీకాదు
- View Answer
- సమాధానం: సి
3. భారత ప్రభుత్వ చట్టం-1935 ప్రకారం ఎన్ని జాబితాలు ఉండేవి?
ఎ) రెండు
బి) మూడు
సి) అయిదు
డి) ఆరు
- View Answer
- సమాధానం: బి
4. భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్యానికి పునాది వేయడానికి కారకుడు?
ఎ) వాట్సన్
బి) రాబర్డ క్లైవ్
సి) డూప్లెక్స్
డి) వారెన్ హేస్టింగ్స్
- View Answer
- సమాధానం: బి
5. భారతదేశ పాలన బ్రిటిష్ చక్రవర్తి పరిధిలోకి వచ్చినట్లు విక్టోరియా రాణి ప్రకటన చేసిన రోజు?
ఎ) 1858 నవంబర్ 1
బి) 1857 నవంబర్ 1
సి) 1859 డిసెంబర్ 1
డి) 1857 డిసెంబర్ 1
- View Answer
- సమాధానం: ఎ
6.భారత ప్రభుత్వ చట్టం-1919లోని ప్రధాన అంశం/అంశాలు?
ఎ) రాష్ట్రాల కార్యనిర్వాహక ప్రభుత్వంలో ద్వంద్వ పాలనను ప్రవేశపెట్టడం
బి) కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వ అధికారాల నిర్వచనం
సి) కేంద్ర, రాష్ట్రాలకు శాసన నిర్మాణ అధికార సంక్రమణం
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
7. పాలనలో భారతీయులకు భాగస్వామ్యం కల్పించటానికి ఉద్దేశించిన మొదటి బ్రిటిష్ చట్టం?
ఎ) ఇండియన్ కౌన్సిళ్ల చట్టం- 1861
బి) ఇండియన్ కౌన్సిళ్ల చట్టం-1862
సి) ఇండియన్ కౌన్సిళ్ల చట్టం- 1909
డి) భారత ప్రభుత్వ చట్టం- 1919
- View Answer
- సమాధానం: ఎ
8. ‘గట్టి బ్రేకులు ఉండి ఇంజన్ లేని యంత్రం’ గా నెహ్రూ దేన్ని పేర్కొన్నారు?
ఎ) కేబినెట్ మిషన్
బి) మౌంట్‌బాటన్ ప్రణాళిక
సి) వేవెల్ ప్రణాళిక
డి) భారత ప్రభుత్వ చట్టం-1935
- View Answer
- సమాధానం: డి
9. భారత రాజ్యాంగ రచనలో అత్యంత ప్రభావం చూపిన అంశం?
ఎ) అమెరికా రాజ్యాంగం
బి) బ్రిటిష్ రాజ్యాంగం
సి) ఐరిష్ రాజ్యాంగం
డి) భారత ప్రభుత్వ చట్టం
- View Answer
- సమాధానం: డి
10. జతపరచండి.
1) పోర్ట ఫోలియో పద్ధతి ఎ) లార్డ్ మెకాలే
2) సివిల్ సర్వీసులు బి) లార్డ్ కార్న్ వాలిస్
3) మత నియోజక వర్గాలు సి) లార్డ్ కానింగ్
4) భారత న్యాయ సంస్కరణలు డి) లార్డ్ మింటో
ఎ) 1-సి, 2-బి, 3-డి, 4-ఎ
బి) 1-బి, 2-సి, 3-ఎ, 4-డి
సి) 1-డి, 2-ఎ, 3-బి, 4-సి
డి) 1-ఎ, 2-బి, 3-డి, 4-సి
- View Answer
- సమాధానం: ఎ
11. కాలక్రమం ప్రకారం కింది వాటిని గుర్తించండి?
1) ప్రత్యేక నియోజకవర్గాలు
2) శాసన అధికారాల బదలాయింపు
3) ద్విసభా విధానం
4) డొమినియన్ ప్రతిపత్తి
ఎ) 1, 2, 3, 4,
బి) 2, 1, 3, 4
సి) 3, 2, 1, 4
డి) 3, 4, 1, 4
- View Answer
- సమాధానం: ఎ
12. ప్రభుత్వానికి ఉండే అధికారం దేనికి ఉదాహరణ?
ఎ) సంప్రదాయ అధికారం
బి) సమ్మోహనాధికారం
సి) చట్టబద్ధ, హేతుబద్ధ అధికారం
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: సి
-
13. భారత రాజ్యాంగ పీఠికలోని ‘భారత ప్రజలమైన మేము’ అనే పదాలు ఏ విషయాన్ని తెలియజేస్తాయి?
ఎ) ప్రజలు స్వార్థపరులు
బి) ప్రజలే సార్వభౌములు
సి) ప్రజలు చేతకాని వారు
డి) ఏదీకాదు
- View Answer
- సమాధానం: బి
14. సుప్రీంకోర్టు ఏ కేసులో తీర్పు చెబుతూ రాజ్యాంగంలో ‘మౌలిక లక్షణాలు’ అనే అంశాన్ని స్పష్టీకరించింది?
ఎ) గోలక్‌నాథ్ కేసు
బి) మినర్వా మిల్స్ కేసు
సి) ఇందిరా సహానీ కేసు
డి) కేశవానంద భారతి కేసు
- View Answer
- సమాధానం: డి
15. భారత రాజ్యాంగం మొదట కల్పించిన ప్రాథమిక హక్కులు ఎన్ని?
ఎ) అయిదు
బి) ఏడు
సి) ఆరు
డి) తొమ్మిది
- View Answer
- సమాధానం: బి
16. ఏ తరహా ప్రభుత్వ విధానాన్ని భారత రాజ్యాంగం అవలంభించింది?
ఎ) ఏక కేంద్ర ప్రభుత్వం
బి) పార్లమెంటరీ తరహా ప్రభుత్వం
సి) అధ్యక్ష తరహా ప్రభుత్వం
డి) నియంతృత్వ ప్రభుత్వం
- View Answer
- సమాధానం: బి
17. రాజ్యాంగంలో అస్పృశ్యత నిషేధాన్ని తెలిపే ఆర్టికల్?
ఎ) 14
బి) 15
సి) 16
డి) 17
- View Answer
- సమాధానం:డి
18. ప్రభుత్వ ఉద్యోగాల్లో బీసీలకు రిజర్వేషన్ సౌకర్యాన్ని కల్పించిన ఆర్టికల్?
ఎ) 17
బి) 16 (4)
సి) 18
డి) 18 (2)
- View Answer
- సమాధానం: బి
19. భారత రాజ్యాంగం పౌరులకు ఎన్ని రకాల స్వేచ్ఛలను కల్పించింది?
ఎ) అయిదు
బి) ఏడు
సి) ఆరు
డి) ఎనిమిది
- View Answer
- సమాధానం: సి
20. ప్రస్తుతం ఆస్తి హక్కు 300-ఎ ఆర్టికల్ కింద ఏ హక్కుగా మారింది?
ఎ) రాజకీయ హక్కు
బి) ఆర్థిక హక్కు
సి) పౌర హక్కు
డి) నైతిక హక్కు
- View Answer
- సమాధానం: సి
21. 2002లో ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రాథమిక విద్యను 21 (ఎ) ఆర్టికల్ కింద చేర్చారు?
ఎ) 80
బి) 81
సి) 87
డి) 86
- View Answer
- సమాధానం: డి
22. భారత పౌరులకు రాజ్యాంగం ద్వారా లభించిన పౌరసత్వం?
ఎ) ద్వి పౌరసత్వం
బి) ఏక పౌరసత్వం
సి) త్రి పౌరసత్వం
డి) ఏదీకాదు
- View Answer
- సమాధానం: బి
23. భారత రాజ్యాంగంలో ప్రస్తుతం ఉన్న ప్రాథమిక విధులు ఎన్ని?
ఎ) 9
బి) 10
సి) 11
డి) 12
- View Answer
- సమాధానం: సి
24. ఒక వ్యక్తిని 24 గంటలకు మించి కస్టడీలో ఉంచడానికి వీలు లేదని తెలిపే ఆర్టికల్?
ఎ) 20
బి) 21
సి) 22
డి) 23
- View Answer
- సమాధానం: సి
25. ప్రాథమిక విధులపై పరిశీలనకు ఏర్పాటు చేసిన కమిటీ?
ఎ) స్వరణ్‌సింగ్ కమిటీ
బి) సైమన్ కమిటీ
సి) సర్కారియా కమిటీ
డి) వెంకటాచలయ్య కమిటీ
- View Answer
- సమాధానం: ఎ
26. భారత రాజ్యాంగం ప్రకారం దేశంలో ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేస్తున్న ఏకైక రాష్ర్టం?
ఎ) సిక్కిం
బి) తమిళనాడు
సి) గోవా
డి) హర్యానా
- View Answer
- సమాధానం: సి
27. ఏ ప్రధానమంత్రి హయాంలో ప్రాథమిక విధులను భారత రాజ్యాంగంలో చేర్చారు?
ఎ) రాజీవ్‌గాంధీ
బి) ఇందీరాగాంధీ
సి) చంద్రశేఖర్
డి) పి.వి.నరసింహారావు
- View Answer
- సమాధానం: బి
28. ప్రపంచంలో ఆదేశిక సూత్రాలను మొదటిసారిగా ఏ దేశంలో రూపొందించారు?
ఎ) న్యూజిలాండ్
బి) స్పెయిన్
సి) ఐర్లాండ్
డి) రష్యా
- View Answer
- సమాధానం: బి
29. న్యాయవ్యవస్థ నుంచి కార్యనిర్వాహక వర్గాన్ని వేరు చేయాలని సూచించే ఆర్టికల్?
ఎ) 49
బి) 50
సి) 51
డి) 52
- View Answer
- సమాధానం: బి
30. ఆదేశిక సూత్రాల ప్రధాన లక్ష్యం ‘ఆర్థిక ప్రజాస్వామ్యాన్ని సాధించటం’ అని పేర్కొన్నది ఎవరు?
ఎ) ఎం.ఎన్.రాయ్
బి) రాజేంద్రప్రసాద్
సి) బి.ఆర్.అంబేద్కర్
డి) హెచ్.జె. లాస్కీ
- View Answer
- సమాధానం: సి
31. భారత రాజ్యాంగంలోని ప్రాథమిక విధులను ఎన్నో భాగంలో పొందుపర్చారు?
ఎ) 4
బి) 5
సి) 6
డి) 4(ఎ)
- View Answer
- సమాధానం: డి
32. ప్రపంచంలో మొదటిసారిగా సమాచార స్వేచ్ఛను చట్టం చేసిన దేశం?
ఎ) ఫ్రాన్స్
బి) స్వీడన్
సి) అమెరికా
డి) చైనా
- View Answer
- సమాధానం: బి