Skip to main content

Sheikh Latif & Madira Srinivasa Reddy: ఫైర్‌ సర్వీస్‌లో డ్రైవర్‌ ఆపరేటర్లుగా ఎంపికై న లారీ డ్రైవర్లు

హుజూర్‌నగర్‌ రూరల్‌ : తెలంగాణ రాష్ట్ర పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు ఏప్రిల్‌ 2న‌ ప్రకటించిన ఫైర్‌ సర్వీస్‌లో డ్రైవర్‌ ఆపరేటర్‌ (ఏఎస్‌ఐ) ఫలితాల్లో హుజూర్‌నగర్‌ మండలానికి చెందిన ఇద్దరు లారీ డ్రైవర్లు ఎంపికయ్యారు.
Fire Service Driver Operator results announcement.   Lorry drivers selected as driver operators in fire service  Telangana State Police Recruitment Board announcement.

హుజూర్‌నగర్‌ మండలం లింగగిరి గ్రామానికి చెందిన షేక్‌ లతీఫ్‌ 5వ జోన్‌లో మొదటి ర్యాంక్‌, మదిర శ్రీనివాస్‌రెడ్డి 5వ జోన్‌లో ఐదో ర్యాంక్‌ సాధించి ఫైర్‌ సర్వీస్‌లో డ్రైవర్‌ ఆపరేటర్‌(ఏఎస్‌ఐ)గా ఎంపికయ్యారు. వీరిద్దరూ చిన్నతనం నుంచి మంచి మిత్రులు.

గత 6 సంవత్సరాలుగా లారీ డ్రైవర్లుగా పనిచేస్తూ సమయం దొరికినప్పుడు చదువుకునేవారు. హైదరాబాద్‌లో కోచింగ్‌ కూడా తీసుకున్నారు. లతీఫ్‌కు ఓపెన్‌లో 10వ తరగతి పూర్తిచేయగా.. శ్రీనివాస్‌ ఇంటర్‌ పూర్తి చేశాడు.

చదవండి:

Anand Mahindra: ఆటో ప్లాంట్‌ నుంచి సక్సెస్‌ఫుల్‌ బిజినెస్‌ మ్యాన్‌గా,ఆనంద్‌ మహీంద్రా కెరీర్‌ సాగిందిలా..

Badminton Champion Manasi Joshi Sucess Story: అంగ వైకల్యం అడ్డు కాలేదు.. ప్రపంచం మెచ్చిన స్పోర్ట్స్‌ స్టార్‌ అయ్యింది..!

Published date : 04 Apr 2024 03:49PM

Photo Stories