Skip to main content

CM Revanth Reddy: ప్రైవేట్‌ ఇంటర్‌ కాలేజీలకు ముకుతాడు!

సాక్షి, హైదరాబాద్‌ : ఇంటర్‌ ప్రవేశాలను కూడా పారదర్శకంగా నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది.
private inter colleges

ఇందుకు సంబంధించి ప్రణాళిక రూ పొందించాలని సీఎం రేవంత్‌ రెడ్డి విద్యా శాఖ ఉన్నతాధికారులను ఆదేశించినట్టు తెలిసింది. ప్రైవేట్‌ కాలేజీల పెత్తనాన్ని అడ్డుకోవాల్సిన అవసరముందని, ఇది ఏ విధంగా సాధ్యమనే అంశాలను ఆయన అధికారులను అడిగి తెలుసుకున్నట్టు సమాచారం.

చదవండి: ITI Courses After 10th: సత్వర ఉపాధికి కేరాఫ్‌ ఐటీఐ

విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, పలువురు ఉన్నతాధికారులతో సీఎం విద్యాశాఖపై జూన్ 7న‌ సమీక్షించారు. సకాలంలో స్కూళ్లకు పాఠ్యపుస్తకాలు, యూనిఫాం అందించాల్సిన అంశాన్ని ప్రస్తావించారు. ఇంటర్‌ కాలేజీల ఫీజులపై తల్లిదండ్రుల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత ఉందనే విషయాన్ని సీఎం గుర్తించినట్టు తెలిసింది.

దీనిని కట్టడి చేయడానికి మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసే ఆలోచన ఉందన్నట్టు సమాచారం. ఈ సందర్భంగా వీసీల నియామకం, పలు విద్యాశాఖ అంశాలపై చర్చించినట్టు తెలిసింది. 

చదవండి: How to Plan for UPSC Civils After 10th Class... ఈ 10 చిట్కాలను అనుసరించండి!!

Published date : 08 Jun 2024 11:57AM

Photo Stories