Telangana 10th Class Results: జూన్ 30లోగా టెన్త్ ఫలితాలు విడుదల..! ఈ సారి మాత్రం..
![Telangana 10th Class Results](/sites/default/files/images/2022/06/22/678346-kerala-board-sslc-exam-results-2018-1655869520.jpg)
జూన్ 11వ తేదీ నాటికి టెన్త్ మూల్యాంకన ప్రక్రియ పూర్త అయ్యే అవకాశం ఉంది. ఈ మేరకు పదో తరగతి ఫలితాలను జూన్ 30లోగా వెల్లడిస్తామని ఎస్సెస్సీ బోర్డ్ అధికారులు స్పష్టం చేశారు. మే 23వ తేదీ నుంచి జూన్ ఒకటి వరకు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు జరిగిన విషయం తెల్సిందే. ఈ పదో తరగతి ఫలితాలను సాక్షి ఎడ్యుకేషన్.కామ్(www.sakshieducation.com)లో చూడొచ్చు.
What After Tenth: ఎన్నో అవకాశాలు... కోర్సు ఎంపికలో ఆసక్తి ప్రధానం
ఈ ఏడాది పరీక్షలు రాసిన వారిలో..
ఈసారి మొత్తం 2,861 పరీక్ష కేంద్రాల్లో నిర్వహించిన పరీక్షలకు 1,140 పాఠశాలల నుంచి 5,09,275 మంది హాజరయ్యారు. ఇందులో బాలురు 2,58,098 మంది, బాలికలు 2,51,177 మంది ఉన్నారు. ఈ ఏడాది పరీక్షలు రాసిన వారిలో 5,08,110 మంది రెగ్యులర్ విద్యార్థులు కాగా, 1,165 మంది ప్రైవేటు విద్యార్థులున్నారు. 2,861 మంది డిపార్ట్‌మెంటల్ ఆఫీసర్లు, 33 వేల మంది ఇన్విజిలేటర్లను విధులను నిర్వహించారు. అలాగే రాష్ట్ర కార్యాలయం నుంచి 4 ప్రత్యేక ఫ్లైయింగ్ స్వాడ్స్ బృందాలు, 144 ఫ్లైయింగ్ స్వాడ్స్ బృందాలను ఏర్పాటు చేసింది.
After 10th Best Courses: ఇంటర్‌లో.. ఏ ‘గ్రూపు’లో చేరితే మంచి భవిష్యత్ ఉంటుంది..?
ఈ సారి సరైన సమయంలోనే..
కరోనాతో గత రెండేళ్లుగా విద్యా సంవత్సరంలో ఒడిదొడుకులు చోటుచేసుకున్నా విషయం తెల్సిందే. టెన్త్ పరీక్షలు నిర్వహించకుండానే విద్యార్థులను పైతరగతులకు ప్రమోట్ చేశారు.రెండేళ్ల తర్వాత టెన్త్ పరీక్షలు జరగడంతో ఈసారి 11 ప్రశ్నపత్రాలకు బదులు 6 మాత్రమే ఇచ్చారు. పరీక్షల సమయాన్ని కూడా పెంచారు. టెన్త్‌లో ప్రశ్నపత్రాలను 70 శాతం సిలబస్ మాత్రమే ఇచ్చారు. దీంతో ఫలితాలు ఆశాజనకంగా ఉంటాయని అధికారులు అంచనా వేస్తున్నారు. కరోనా వ్యాప్తి తగ్గడంతో ఈసారి విద్యాసంవత్సరం సాధారణ సమయాల్లోనే చేపట్టాలని తెలంగాణ విద్యాశాఖ అధికారులు భావిస్తున్నారు.
After 10th : పదో తరగతి అర్హతతో డ్రోన్ పైలట్.. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు..
తెలంగాణలో ఈ సారి జరిగిన పరీక్షల తేదీలు ఇలా..
తేదీ | పరీక్ష |
23–5–22 | మొదటి భాష |
24–5–22 | ద్వితీయ భాష |
25–5–22 | తృతీయ భాష |
26–5–22 | గణితం |
27–5–22 | జనరల్ సైన్స్ |
28–5–22 | సోషల్ స్టడీస్ |
30–5–22 | ఓఎస్సెస్సీ మెయిన్ లాంగ్వేజ్ (సంస్కృతం, అరబిక్) |
31–5–22 | ఓఎస్సెస్సీ మెయిన్ (సంస్కృతం, అరబిక్) |
01–6–22 | ఎస్సెస్సీ ఒకేషనల్ కోర్సు |