Skip to main content

దృగ్గోచర వర్ణపటం

Tenth class తెల్లని సూర్యకిరణాలు ఒక గాజు పట్టకంపై పతనం చెందినపుడు అవి కాంతి విశ్లేషణం వలన ఊదా (Violet-V), నీలి (Indigo-I), నీలం (Blue-B), ఆకుపచ్చ (Green-G), పసుపుపచ్చ (Yellow-Y), నారింజ (Orange-O),ఎరుపు (Red-R ) రంగులుగా ఒక వర్ణపటాన్ని ఏర్పరుస్తాయి. ఈ వర్ణపటాన్ని మనం కంటితో చూడగలం కాబట్టి దీనిని ‘దృగ్గోచర వర్ణపటం’ అని అంటారు.
-తరంగ ధైర్ఘ్యాల లేక పౌనఃపున్యాల సముదాయాన్ని ‘వర్ణపటం’ అంటారు. (కాంతిని తరంగరూపంలో తీసుకుంటాం కాబట్టి). మనకు తెలిసిన కాంతి జనకాలన్నీ వర్ణపటాలను ఏర్పరుస్తాయి.
పరమాణువులలోని ఉత్తేజ వేలన్‌‌స ఎలక్ట్రాన్‌లు, తిరిగి వాటి తొలిస్థానాలకు దూకడం వలన దృగ్గోచర వర్ణపటం ఉద్గారమవుతుంది. ఒక పదార్థం నుంచి ఉద్గారమయ్యే కాంతి రంగు ఆ పదార్థంలోని పరమాణువుల లక్షణాలను బట్టి ఉంటుంది. దీపావళి టపాసులను కాల్చినపుడు వెలువడే రంగుల మాదిరిగా. సూర్యుడు, దూరంగా ఉండే నక్షత్రాల నుంచి వచ్చే కాంతి ఉద్గారం నుంచి వాటిలో ఉండే పదార్థాల వివరాలను తెలుసుకోవచ్చు.
-దృగ్గోచర వర్ణపటం తరంగ ధైర్ఘ్యాలు సుమారుగా 0.4 మైక్రోమీటర్ల (um)నుంచి 0.7umవరకు ఉంటాయి. (1 um=10-6m)
అదృశ్య వర్ణపటం
పరారుణ వికిరణాలు (Infrared radiations-IR) ఉష్ణోగ్రతను కొలిచే ‘థర్మోఫైల్’ అనే ఉష్ణమాపకాన్ని దృగ్గోచర వర్ణపటంలో ఉన్న ఎరుపు రంగుకు కుడివైపునకు జరిపినపుడు, ఉష్ణోగ్రతలో పెరుగుదలను చూపిస్తుంది. అందువల్ల ఈ వికిరణాలను ఉష్ణవికిరణాలు లేక పరారుణ కిరణాలు (IR)అని అంటారు. ఈ వికిరణాలు కంటికి కనబడవు. అందువల్లనే వాటిని అదృశ్య వికిరణాలు అని అంటారు.
ఉష్ణాన్ని ఉత్పన్నంచేసే ఎలక్ట్రిక్ హీటర్, మండే మంట, వేడిగా ఉన్న సోల్డరింగ్ ఐరన్ మొదలైనవి పరారుణ వికిరణాలను ఉత్పన్నం చేస్తాయి.
-సాధారణ సోడాగాజు, పరారుణ వికిరణాలను శోషిస్తుంది. అందువల్ల పరారుణ వికిరణాలను ఉత్పన్నం చేయడానికి గాజు పట్టకాలకు బదులు రాక్‌సాల్ట్‌తో తయారైన పట్టకాలను ఉపయోగిస్తారు.
అతినీలలోహిత కిరణాలు(Ultraviolet radiations-UV) పత్యేక ఫోటోగ్రాఫిక్ ప్లేట్లను ఊదా (V)రంగుకు అవతల తరంగధైర్ఘ్యాలు తగ్గే దిశలోఅంటే ఊదా రుంగుకు ఎడమ వైపు ఉంచితే, ఆ ప్లేట్లను వికిరణాలు ప్రభావితం చేస్తాయి. కంటికి కనిపించని ఈ వికిరణాలను అతి నీలలోహిత కిరణాలు(UV)అంటారు.
UV VIBGYOR IR


- లక్ష్మీ ఈమని
Published date : 11 Sep 2013 11:08AM

Photo Stories