Principal K Vijaykumar: ఉద్యోగాలు సాధించాలనే తపన ఉండాలి
Sakshi Education
కామారెడ్డి అర్బన్ : చదువుకున్న అనంతరం పక్కా ప్రణాళికతో ఉద్యోగాలు సాధించాలనే తపన ప్రతి విద్యార్థిలో ఉండాలని కామారెడ్డి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ కే విజయ్‌కుమార్ అన్నారు.
టీఎస్‌కేసీ, టాస్క్ ఆధ్వర్యంలో కళాశాల విద్యార్థులకు తొలిమెట్టు అభిరుచి నాలుగు రోజులు శిక్షణ కార్యక్రమాన్ని మార్చి 4న ప్రారంభించారు. ఈ ప్రారంభ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ విజయ్‌కుమార్ పాల్గొని విద్యార్థులనుద్ధేశించి మాట్లాడారు.
చదవండి: SBI Job Notification 2024: ఎస్‌బీఐలో 50 క్రెడిట్ అనలిస్ట్ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
మోటివేటర్ బట్టు రఘుతేజ మాట్లాడుతూ నాలుగు రోజుల శిక్షణ విద్యార్థుల ఉన్నతికి దోహదం చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సమన్వయకర్తలు ఫర్హిన్ ఫాతిమా, అజా రొద్దీన్, అధ్యాపకులు ఆర్.శ్రీలత,సుచరణ్, అఫ్రిన్, ఫాతిమా తదితరులు పాల్గొన్నారు.
Published date : 05 Mar 2024 04:37PM