Tenth Class: ప్రీఫైనల్‌తో ‘పది’పై పట్టు
ఉదయం 8.30 నుంచి 11.45 గంటల వరకు పరీక్ష నిర్వహించాలని తెలంగాణ విద్యాశాఖ అన్ని పాఠశాలలకు ఆదేశాలు జారీ చేసింది. ఈసారి ప్రీఫైనల్స్‌కు ప్రాధాన్యం ఉందని ఉపాధ్యాయులు చెబుతున్నారు. మే 23 నుంచి టెన్త్ వార్షిక పరీక్షలు జరుగుతాయని, ఆ పరీక్షలకు సన్నద్ధం చేయడమే ప్రీఫైనల్స్ లక్ష్యమని టీచర్లు అంటున్నారు. ఈసారి సెపె్టంబర్ వరకు ప్రత్యక్ష తరగతులు నిర్వహించలేదు. ఆన్ లైన్ బోధన అంతంత మాత్రంగానే ఉందనే విమర్శలొచ్చాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ప్రభుత్వ స్కూల్స్ విద్యార్థులు కరోనా కాలం నుంచి వెనుకబడి ఉన్నారని తెలుస్తోంది. ఈసారి వార్షిక పరీక్షల్లో 11 పేపర్లకు బదులుగా ఆరు పేపర్లే ఇస్తున్నారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని పరీక్షలపై సమగ్ర అవగాహన కలి్పంచాలని అధికారులు భావిస్తున్నారు. ఫ్రీఫైనల్స్ రాసే విద్యార్థులకు పరీక్ష విధానం, కాలవ్యవధి తేలికగా తెలిసే వీలుంది. రెండేళ్లు పరీక్షలు లేకపోవడంతో పరీక్షలంటే ఉండే భయం కూడా పోతుందని, అందరూ పరీక్షలు రాయాలని అధికారులు అంటున్నారు.
చదవండి:
మోడల్ పేపర్లు కోసం క్లిక్ చేయండి
ప్రీఫైనల్స్ కీలకమే:
ప్రీఫైనల్స్‌ను తేలికగా తీసుకోవద్దు. ఈ దిశగా ఇప్పటికే విద్యార్థులకు అవగాహన కలి్పస్తున్నాం. ప్రీఫైనల్స్ రాసిన విద్యార్థులు, వార్షిక పరీక్షల్లో మంచి మార్కులు పొందే అవకాశం ఉంటుంది.
పణితి రామనాథం (ప్రభుత్వ టీచర్, కొత్తగూడెం జిల్లా)