Teacher: ఉపాధ్యాయ బదిలీలు నిలిపివేయాలి
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తమ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో బోధించే ఎల్లన్న వచ్చిన తర్వాత విద్యార్థులకు గుణాత్మకమైన విద్య అందుతోందన్నారు. గ్రామ విద్య ప్రాజెక్టు ద్వారా పాఠశాలకు అదనపు సమయం కేటాయించి విద్యార్థులకు బోధిస్తున్నారన్నారు. పాఠశాల నుంచి ప్రతీ సంవత్సరం గురుకుల, నవోదయ సీట్లు లభిస్తున్నాయన్నారు.
ఎన్జీవోల సహకారంతో విద్యార్థుల కోసం ఆట వస్తువులు విరాళాలు సేకరించి డిజిటల్ విద్యను అందిస్తున్నారన్నారు. 5వ తరగతిలో నిరుపేద విద్యార్థులను దత్తత తీసుకుని చదివిస్తున్నారన్నారు. ఇలాంటి మంచి పనులు చేస్తున్న తమ ఉపాధ్యాయుడిని ఎట్టి పరిస్థితుల్లో బదిలీ చేయొద్దని కోరారు. వినతిపత్రం ఇచ్చినవారిలో సర్పంచ్ కదం భోజబాయ్, ఎస్‌ఎంసీ చైర్మన్ బాబారావు, వైస్ చైర్మన్ అనిత, గ్రామస్తులు లక్ష్మణ్, ఆనంద్, గణేశ్, నవీన్, ముత్తవ్వ, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.