Collector Inspection : విద్యార్థుల సంఖ్య పెంచాలి.. ఈ విషయాలపై అవగాహన కల్పించాలి..

సాక్షి ఎడ్యుకేషన్: విద్యార్థులకు ప్రభుత్వ స్కూళ్లలో నాణ్యమైన విద్య అందుతుందని, వారిని సర్కార్ బడుల్లో చేర్చేలా తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని ఇలా విద్యార్థులను, తల్లిదండ్రులను ప్రోత్సాహించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులకు సూచించారు. గురువారం తంగళ్లపల్లి మండలం చీర్లవంచ పరిధి తెనుగువారిపల్లె లోని ప్రైమరీ స్కూల్‌ను సందర్శించారు.
పాఠశాలలోని పరిశుభ్రత, విద్యాభ్యాసం, ఉపాధ్యాయుల బోధన, విద్యార్థులతో చర్చలు జరిపారు. గదులను, పాఠశాలను క్షుణ్ణంగా పరిశీలించి ఉపాధ్యాయులతో, విద్యార్థులతో మాట్లాడారు. వెంటనే, ఉపాధ్యాయులకు పలు సలహాలు, సూచనలు ఇచ్చారు.
స్కూల్ ఆవరణను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. విద్యార్థుల తరగతి గదులు, మధ్యాహ్నం భోజనం తయారీని కూడా పరిశీలించి, విద్యార్థులకు నాణ్యమైన విద్యా, భోజనం అందించాలన్నారు. విద్యార్థుల ఇబ్బందులను, సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
లెక్క పెరగాలి..
పాఠశాలను పరిశీలించి, విద్యార్థులతో ఉపాధ్యాయులతో చర్చలను జరిపిన తరువాత, కలెక్టర్ మాట్లాడుతూ ఇక్కడ విద్యార్థులు లెక్క తక్కువగా ఉంది. వారి సంఖ్యను పెంచే ప్రయత్నాలు చేయాలని టీచర్లకు సూచించారు. ఈ దిశగా కృషి చేయాలన్నారు. అంతకుముందు తంగళ్లపల్లి పీహెచ్‌సీని కూడా సందర్శించారు కలెక్టర్. పీహెచ్‌సీ ఆవరణలో గడ్డి, పిచ్చి మొక్కలను తొలగించాలని ఆదేశించారు. హాస్పిటల్‌లోని ఓపీ, ఇతర రిజిస్టర్లను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ ప్రభుత్వ దవాఖానల్లో కల్పిస్తున్న సౌకర్యాలపై గర్భిణులకు అవగాహన కల్పించాలన్నారు.
ఆయా కార్యక్రమాల్లో కలెక్టర్ వెంట మెడికల్ ఆఫీసర్, చంద్రికారెడ్డి, హెచ్‌ఎం కార్తిలాల్, సిబ్బంది ఉన్నారు. పాల్గొన్నారు. బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం తంగళ్లపల్లి మండలం నేరేళ్ల గ్రామానికి చెందిన దాసరి రమేశ్, లలిత కూతురు బుధవారం టీకా వికటించి చనిపోయిన విషయం తెలిసిందే. బాధిత కుటుంబానికి బుధవారం రాత్రి రూ.లక్ష చెక్కు అందజేయగా.. గురువారం మరో రూ.లక్ష చెక్కును కలెక్టరేట్‌లో అందజేశారు.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
Tags
- collector inspection
- Primary School
- students health and education
- Collector Sandeep Kumar Jha
- school and food inspection
- quality education and food
- primary students
- Govt Schools
- awareness program
- awareness program for parents
- private and govt schools for primary students
- teachers interaction
- primary school inspection
- quality education for students
- Primary School Students
- teachings in primary schools
- Education News
- Sakshi Education News