Skip to main content

Collector Sikta Patnaik: విద్యార్థుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి.. ప్రతీ విద్యార్థికి ఈ కార్డు

హన్మకొండ అర్బన్‌: జిల్లాలోని గురుకుల పాఠశాలలు, కళాశాలలు, సంక్షేమ వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థుల సంక్షేమంపై ఆయా పాఠశాలలు, కళాశాలల ప్రిన్సిపాళ్లు, సంక్షేమ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని హనుమకొండ కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ అధికారులను ఆదేశించారు.
Special focus on student welfare

ఫిబ్ర‌వ‌రి 9న‌ కలెక్టరేట్‌లో ఎస్సీ, ట్రైబల్‌, బీసీ, మైనార్టీ సంక్షేమ వసతి గృహాలు, గురుకుల పాఠశాలలు, కళాశాలల నిర్వహణపై అధికారులతో కలెక్టర్‌ సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విద్యాలయాలు, వసతి గృహాల్లో ఎలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్త వహించాలని సూచించారు. పాఠశాలలు, వసతి గృహాల్లో క్రమం తప్పకుండా వైద్య శిబిరాలు నిర్వహించాలని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

చదవండి: NIT Warangal: నిట్‌తో హార్ట్‌ఫుల్‌నెస్‌ ఎడ్యుకేషన్‌ ట్రస్ట్‌ ఎంఓయూ

ప్రతీ విద్యార్థికి హెల్త్‌ కార్డు ఉండేలా చూడాలన్నారు. వేసవి దృష్ట్యా నీటి సమస్యల్లేకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ రాధికాగుప్త, ట్రెయినీ కలెక్టర్‌ శ్రద్ధా శుక్లా, బీసీ వెల్ఫేర్‌ డీడీ రాంరెడ్డి, ఎస్సీ వెల్ఫేర్‌ డీడీ నిర్మల, ట్రైబల్‌ వెల్ఫేర్‌ డీడీ ప్రేమలత, మైనార్టీ వెల్ఫేర్‌ డీడీ మేన శ్రీను, డీఈఓ అబ్దుల్‌ హై, అడిషనల్‌ డీఎంహెచ్‌ఓ మదన్‌ మోహన్‌రావు, టీఎస్‌ఆర్‌డబ్ల్యూఎస్‌ ఆర్సీఓ విద్యారాణి, ఎంజేపీ బీసీ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ డీసీఓ సరిత, ట్రైబల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ ఆర్సీఓ వెంకన్న, మైనార్టీ స్కూల్స్‌ ఉమ్మడి జిల్లా ఆర్‌ఎల్సీఓ శ్రీనివాస్‌, కేజీబీవీ కో–ఆర్డినేటర్‌ సునిత, షీ టీం ఎస్సై విద్యాసాగర్‌, అసిస్టెంట్‌ బీసీ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ శంకరయ్య, విక్రమ్‌ తదితరులు పాల్గొన్నారు.

చదవండి: Model United Nation: ఎస్‌ఆర్‌ వర్శిటీలో ‘మోడల్‌ యునైటెడ్‌ నేషన్‌’

Published date : 10 Feb 2024 12:57PM

Photo Stories