Model United Nation: ఎస్‌ఆర్ వర్శిటీలో ‘మోడల్ యునైటెడ్ నేషన్’
కార్యక్రమ కన్వీనర్ ఎండీ సలావుద్దీన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని 380 మంది విద్యార్థులు వివిధ దేశాల ప్రతినిధులుగా వ్యవహరిస్తారన్నారు.
కార్యక్రమంలో నాలుగు పరిపాలన సంస్థలు యునైటెడ్ నేషన్ హ్యుమన్ రైట్స్ కౌన్సిల్, యునైటెడ్ నేషన్ హెల్త్ ఆర్గనైజేషన్, యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ, యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ మోడల్‌లు సృష్టించి, వీటిలో వివిధ దేశాల ప్రతినిధులుగా విద్యార్థులు పాల్గొని ఆయా దేశాలు ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రపంచంలోని వివిధ అంశాలపై చర్చించి వాటికి సరైన పరిష్కారాలు సూచిస్తారని తెలిపారు. వివిధ దేశాల సమస్యలపై పరిశోధనలు చేస్తారని వివరించారు. కార్యక్రమంలో సుమతిరెడ్డి ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ రాజశ్రీ, ఎస్‌ఆర్ యూనివర్శిటీ అసోసియేట్ డీన్ వినూత్న పాల్గొన్నారు.
చదవండి: SR University Chancellor: కష్టపడితే అత్యుత్తమ ఫలితాలు