DB Sheetal: విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి
Sakshi Education
నవాబుపేట: విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని జిల్లా న్యాయసేవ అధికార సంస్థ కార్యదర్శి డీబీ శీతల్ సూచించారు.
నవాబుపేట ఆదర్శ పాఠశాలలోని బాలికల హాస్టల్లో వంట మనుషులు లేని విషయాన్ని విద్యార్థినులు సోషల్ మీడియాలో పెట్టడంతో వారు స్పందించారు. జిల్లా న్యాయసేవా అధికార సంస్థ చైర్మన్ కే సుదర్శన్ ఆదేశాల మేరకు జిల్లా, మండల అధికారులను పిలిపించి మాట్లాడారు.
చదవండి: DEO MD Abdul Hai: విద్యార్థుల్లో ప్రతిభను వెలికితీసేందుకు.. ఈ పోటీలు
పాఠశాలలో జరుగుతున్నా విషయాలపై అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు తినడానికి ఇబ్బందులు పడుతుంటే అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. మరో సారి ఇలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా చూడాలని ఆదేశించారు. వెంటనే వంట వారిని నియమించాలన్నారు.
Published date : 11 Nov 2023 12:16PM