DEO MD Abdul Hai: విద్యార్థుల్లో ప్రతిభను వెలికితీసేందుకు.. ఈ పోటీలు
నవంబర్ 9న హనుమకొండలోని ప్రభుత్వ ‘ప్రాక్టీసింగ్ పీఎస్, ప్రభుత్వ ప్రాక్టీసింగ్ హైస్కూల్‌లో జిల్లా స్థాయి కళా ఉత్సవ్ పోటీలు నిర్వహించారు. ఇందులో క్వాలిటీ కో–ఆర్డినేటర్ ఎ.శ్రీనివాస్, ప్రోగ్రాం కో–ఆర్డినేటర్ ఎ.మధుసూధన్‌రెడ్డి, ప్రాక్టీసింగ్ హైస్కూల్ హెచ్‌ఎం జగన్, ప్రాథమిక పాఠశాల హెచ్‌ఎం ఉప్పలయ్య, సోషల్ ఫోరం జిల్లా ప్రధాన కార్యదర్శి సతీశ్ ప్రకాశ్ పాల్గొన్నారు.
చదవండి: UGC Fellowships 2023: విద్యార్థులకు యూజీసీ గుడ్ న్యూస్, ఫెలోషిప్ సాయం పెంపు... ఎంతంటే..
విజేతలు వీరే..
జిల్లా స్థాయి కళా ఉత్సవ్‌లో ఓకల్ క్లాసిక్ విభాగంలో ఎస్.సంజయ్, ఎండీ రోహానా, ఓకల్ (ఫోక్)లో ఎన్.రంజిత్‌కుమార్, బి.ప్రసన్న, ఇన్‌స్ట్రుమెంటల్ మ్యూజిక్(పర్కసివ్)లో ఎస్.రక్షిత్, పి.అక్షర, ఇన్‌స్ట్రుమెంటల్ మ్యూజిక్ (మెలోడీ)లో ఎం.అభిషేక్, డి.సిరి, డ్రామా (సోలో)లో ఎం.సిదార్థ, ఐ.మృదులత, వర్చువల్ ఆర్ట్ (2డీ)లో ఎం.స్టీవెన్‌రాజ్, ఎండీ సమ్రీన్, వర్చువల్ ఆర్ట్ (3డీ) విభాగంలో ఎండీ గౌస్ మొయినుద్దీన్, జి.మమత విజేతలుగా నిలిచినట్లు జిల్లా క్వాలిటీ కో–ఆర్డినేటర్ శ్రీనివాస్ తెలిపారు.
శాస్త్రవేత్తలుగా ఎదిగేందుకు దోహదం
బాలలు శాస్త్రవేత్తలుగా ఎదిగేలా సైన్స్ కాంగ్రెస్ ఉపయోగపడుతుందని హనుమకొండ డీఈఓ ఎండీ అబ్దుల్‌హై అన్నారు. నవంబర్ 9న హనుమకొండలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జిల్లా స్థాయి బాలల సైన్స్ కాంగ్రెస్‌లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఇందులో జిల్లా సైన్స్ అధికారి, బాలల సైన్స్ కాంగ్రెస్ హనుమకొండ జిల్లా కో–ఆర్డినేటర్ ఎస్.శ్రీనివాసస్వామి, బాలల సైన్స్ కాంగ్రెస్ జిల్లా అకాడమిక్ కో–ఆర్డినేటర్ దొంతుల శ్రీనివాస్ పాల్గొన్నారు.
రాష్ట్రస్థాయికి మూడు ప్రాజెక్టులు
జిల్లా స్థాయి బాలల సైన్స్ కాంగ్రెస్‌లో పెంబర్తిలోని ఏకశిల ఉన్నత పాఠశాల విద్యార్థులు ఎం.సున్విత, కె.అశ్విత రూపొందించిన ‘ఎడారి మొక్కలు విద్యుదయస్కాంత ధార్మికతను తగ్గించగలవా’ ప్రాజెక్టు, డిస్నీల్యాండ్ ఉన్నత పాఠశాల ఒగ్లాపూర్ ఎం.కీర్తవరుణ్, కార్తీక్ రూపొందించిన ‘మ్యాన్‌హోల్ డిటెక్టింగ్ సిస్టమ్’ ప్రాజెక్టులు రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యాయి. ప్రత్యేకావసరాలు గల విద్యార్థుల విభాగం నుంచి ఎం.కీర్తి కౌశిక్ రూపొందించిన ‘అంధుల కోసం మూడో కన్ను’ ప్రాజెక్టు కూడా రాష్ట్ర స్థాయికి ఎంపికైంది. ఆయా విద్యార్థులకు ప్రశంసపత్రాలు అందించారు.