Skip to main content

పిల్లల గేమ్‌ చేంజర్‌గా అటల్‌ టింకరింగ్‌ ల్యాబ్స్‌

సప్తగిరికాలనీ(కరీంనగర్‌): కేంద్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన అటల్‌ టింకరింగ్‌ ల్యాబ్‌లు పాఠశాలలో పిల్లల కోసం గేమ్‌ చేంజర్‌గా నిరూపించబడిందని నేషనల్‌ ఇన్నోవేషన్‌ పాలసీ మేకర్‌, యూనిసెడ్‌ చైర్మన్‌ అవనీష్‌ త్రిపాఠి అన్నారు.
Atal Tinkering Labs as a game changer for kids

జూలై 15న‌ యూనిసెడ్‌ ఆధ్వర్యంలో స్థానిక ధన్గర్‌వాడీ హైస్కూల్లో జరుగుతున్న అటల్‌ టింకరింగ్‌ లాబ్స్‌ శిక్షణ తరగతులకు ఆయన హాజరై మాట్లాడారు.

అటల్‌ టింకరింగ్‌ ల్యాబ్‌లు, అటల్‌ ఇంక్యుబేషన్‌ సెంటర్లు, అటల్‌ కమ్యూనిటీ ఇన్నోవేషన్‌ సెంటర్‌లు, స్టార్టప్‌లు ఇన్నోవేటర్‌లకు మద్దతు ఇవ్వడంతో పాటు పాఠశాలలో పిల్లలలో వినూత్న ఆలోచనలను పెంపొందిస్తున్నాయన్నారు.

చదవండి: Science Labs in Schools : సైన్స్ ల్యాబ్‌ల ఉపయోగాల‌పై అధికారులు ప‌రిశీల‌న చేయాలి..

కేంద్ర హోంశాల సహాయ మంత్రి బండి సంజయ్‌ కుమార్‌ ఓఎన్‌జీసీ లిమిటెడ్‌ సహాయంతో కరీంనగర్‌లో 25 అటల్‌ టింకరింగ్‌ ల్యాబ్‌లను తీసుకురావడంలో సహాయపడ్డారన్నారు.

యూనిసెడ్‌ మానిటర్‌ డైరెక్టర్‌ గిరిజ శంకర్‌, డైట్‌ సూపర్డెంట్‌ భగవాన్‌ రెడ్డి సిరిసిల్ల జిల్లా సెక్టోరియల్‌ ఆఫీసర్‌ శైలజ, కరీంనగర్‌ పార్లమెంట్‌ కోఆర్డినేటర్‌ తొర్తి శ్రీనివాస్‌, ప్రాజెక్ట్‌ ఇంజనీర్‌ వికాస్‌, అభిషేక్‌, తదితరులు పాల్గొన్నారు.

Published date : 16 Jul 2024 03:26PM

Photo Stories