Tenth Class: కార్పొరేట్‌కు దీటుగా పేదవాడి ప్రతిభ
రాష్ట్రవ్యాప్తంగా 4,84,370 మంది టెన్త్ పరీక్షలు రాశారు. అందులో ప్రైవేటు స్కూళ్ల విద్యార్థులు 2,16,060 మంది. వీరిలో ఉత్తీర్ణులైన వారు 1,96,403 మంది.. అంటే 90.9 శాతం పాస్ అయ్యారు. అదే సంక్షేమ గురుకుల పాఠశాలల ఉత్తీర్ణత 98 శాతం దాకా నమోదవడం, వీటిలో చదివేవారిలో చాలా వరకు పేద విద్యార్థులేకావడం గమనార్హం.
చదవండి: Central Government Jobs: పదితోనే కేంద్ర కొలువు.. పూర్తి వివరాలు ఇలా..
కానీ సాధారణ ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రం పరిస్థితి మెరుగుపడటం లేదు. జిల్లా పరిషత్ స్కూళ్లలో 79.14 శాతం, నేరుగా విద్యాశాఖ కింద ఉన్న ప్రభుత్వ స్కూళ్లలో 72.39 శాతమే ఉత్తీర్ణత నమోదైంది. ఉపాధ్యాయుల కొరతను తీర్చి, మెరుగైన వసతులు కల్పిస్తే.. గురుకులాల తరహాలో ఫలితాలు సాధించగలవని విద్యావేత్తలు స్పష్టం చేస్తున్నారు.
చదవండి: Career Guidance: పదవ తరగతి తర్వాత.. కోర్సులు, ఉద్యోగ అవకాశాలు..