No Cool Drinks in Schools: స్కూళ్లలో కూల్‌డ్రింక్స్ వద్దు
అంటే ప్రతి ఇద్దరిలో ఒకరు ఇలాంటివి తాగుతున్నారు. ముఖ్యంగా స్కూళ్ల పరిసరాల్లో వీటి అమ్మకం భారీగా జరుగుతోంది. పిల్లల్ని లక్ష్యంగా చేసుకునే వీటిని అందుబాటులో ఉంచుతున్నారు. కూల్‌డ్రింక్స్‌తో పాటు పీచు మిఠాయిలు, ఐస్‌క్రీములు కూడా స్కూళ్ల పరిసరాల్లో ఉంటున్నాయి. వీటివల్ల అధిక మొత్తంలో కేలరీలు వస్తాయి. దంత క్షయం, ఊబకాయంతో పాటు వివిధ రకాల వ్యాధులకు గురయ్యే అవకాశం పెరుగుతుంది.
చదవండి: Indian School of Business: దేశంలో టాప్ ర్యాంకింగ్‌లో ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ISB)..
పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రిన్సిపల్స్ స్కూళ్ల పరిసరాల్లో వీటి అమ్మకాలు నియంత్రించాలి..’ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) సూచించింది. షుగర్ ఆధారిత అన్ని రకాల డ్రింక్స్‌ను స్కూళ్ల పరిసరాల్లో అనుమతించ కూడదని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న స్కూళ్ల ప్రిన్సిపల్స్‌కు తమ నివేదికలోని అంశాలను వెల్లడించడమే కాకుండా పలు మార్గదర్శకాలు కూడా జారీ చేసింది.
ఎక్కడ పడితే అక్కడ అందుబాటులో..
- చిన్న పిల్లలే లక్ష్యంగా ఈ అమ్మకాలు కొనసాగుతున్నాయి. మరి ముఖ్యంగా ప్రాథమిక పాఠశాలల్లో ఇవి ఉంటున్నాయి. కొందరు స్కూళ్ల ప్రిన్సిపల్స్‌లోనూ వీటి విషయంలో సానుకూలమైన భావన ఉంది.
- స్కూల్ క్యాంటీన్లు, కారిడార్లలో, ఆట ప్రదేశాల్లో వీటిని ఉంచుతున్నారు. స్కూళ్లలో ఏవైనా వేడుకలు నిర్వహిస్తే కంపెనీలు ఈ తరహా డ్రింక్స్ స్పాన్సర్ చేస్తున్నాయి. తద్వారా తమ కంపెనీ కూల్‌డ్రింక్స్‌ను ప్రమోట్ చేసుకుంటూ బిజినెస్ పెంచుకుంటున్నాయి.
- కూల్‌డ్రింక్స్ వెండింగ్ మిషన్లు కూడా స్కూళ్లల్లో ఉంటున్నాయి. మరి ముఖ్యంగా కార్పొరేట్ స్కూళ్లలో ఇవి ఎక్కువగా కనిపిస్తాయి. స్కూళ్లకు ఉచితంగా శాంపిల్స్ కూడా ఇస్తున్నారు. అలాగే 10 శాతం వరకు డిస్కౌంట్లు ఇస్తున్నారు.
- కొన్ని కంపెనీలు పిల్లల్ని ఆకర్షించేందుకు సినీ హీరోల ద్వారా కూడా ప్రచారం చేస్తున్నాయి.
షుగరీ డ్రింక్స్ అంటే?
- కూల్‌డ్రింక్స్, ఫ్రూట్ జ్యూస్, ఫ్రూట్ ఫ్లేవర్డ్ జ్యూస్, మిక్స్‌డ్ ఫ్రూట్ జ్యూస్, షుగర్‌తో తయారు చేసిన ఫ్లేవర్డ్ మిల్క్, లస్సీ, విటమిన్ వాటర్, ఎనర్జీ డ్రింక్ లాంటి వాటిని షుగరీ డ్రింక్స్ అంటారు.
- చిన్న పిల్లలు, యువత శరీరాల్లోకి షుగర్ ఎక్కువగా ఈ డ్రింక్‌ల ద్వారానే వెళ్తోంది.
- ఇండియా వంటి దక్షిణాసియా దేశాల పిల్లల్లో షుగరీ డ్రింక్స్ వాడకం ఎక్కువగా ఉంది.
దేన్లో ఎన్ని స్పూన్ల షుగర్
- 330 ఎంఎల్ లస్సీలో ఏడు స్పూన్ల షుగర్ ఉంటుంది. అంతే పరిమాణంలో ఉన్న బాదం మిల్క్, ఫ్లేవర్డ్ మిల్క్‌ల్లో 7 స్పూన్ల చక్కెర ఉంటుంది. కూల్‌డ్రింక్స్‌లో 8.5 స్పూన్లు, ఫ్రూట్ జ్యూస్‌లో 9.5 స్పూన్లు, ఎనర్జీ డ్రింక్స్‌లో 10 స్పూ న్ల షుగర్ ఉంటుంది. అంటే ఒక్క కూల్ డ్రింక్ లేదా జ్యూస్ ద్వారానే అన్ని స్పూన్ల షుగర్ శరీరంలోకి వెళ్తుందన్నమాట. ∙పదేళ్లు పైబడినవారు మంచి ఆరోగ్యంగా ఉండాలంటే మొత్తంగా రోజుకు ఆరు టీ స్పూన్లు లేదా 25 గ్రాముల షుగర్ మాత్రమే తీసుకోవాలి.
- ఐదేళ్లలోపు వారు రోజుకు 6 నుంచి 8 టీ స్పూన్ల వరకు, 4–5 ఏళ్లలోపు వాళ్లు బాలికలైతే 8 స్పూన్లు, బాలురు 8.5 టీ స్పూన్లు తీసుకోవచ్చు.
మంచినీళ్లే మేలు
- పరిశుభ్రమైన నీటిని తాగడం ఆరోగ్యంగా ఉండటానికి దోహదపడుతుంది. చిన్న పిల్లలు చెమట ద్వారా త్వరగా శరీరంలో నీటిని కోల్పోతారు. నీరు లేకపోతే నీరసించిపోతారు. అందువల్ల సురక్షితమైన నీటిని ఎక్కువగా తాగడం మంచిది. ∙షుగరీ డ్రింక్స్‌ల్లో కేలరీలు ఉంటాయని, ఎనర్జీ వస్తుందని తాగుతుంటారు. కానీకేలరీలను కేవలం ఆహారం ద్వారానే తీసుకోవాలి కానీ ఇలా డ్రింక్స్ ద్వారా కాదు. పుదీన, నిమ్మరసాలు, బట్టర్ మిల్క్ (మజ్జిగ) లాంటివి తీసుకుంటే మంచిది.
- 10 ఏళ్లు దాటిన వారు, పెద్దలు రెండు లీటర్ల మంచినీరు తాగాలి. ఎక్కువ శ్రమ చేసేవారికి 4 లీటర్ల నీరు కావాలి. 24 గంటల పాటు సురక్షిత నీటిని సరఫరా చేయలేని పరిస్థితి స్కూళ్లలో ఉంటే, ఆ మేరకు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని ప్రిన్సిపల్ కోరాలి.
చాలా దేశాల్లో షుగరీ డ్రింక్స్‌పై నిషేధం
ఫ్రాన్స్ 2004లోనే స్కూళ్లలో షుగరీ డ్రింక్స్ వెండింగ్ మిషన్లను నిషేధించింది. నెదర్లాండ్స్‌లో ఒకేసారి ఆపకుండా తొలుత చిన్నచిన్న సైజుల్లో డ్రింక్‌లను అందుబాటులో ఉంచారు. క్రమంగా వాటిని తగ్గించేశారు. రిపబ్లిక్ ఆఫ్ కొరియా కూడా 2007లోనే షుగరీ డ్రింక్స్‌ను నిషేధించింది. స్కూళ్లలో ఏదైనా అమ్మే పక్షంలో అందులో ఉండే పదార్థాలను తెలియజేయాలి. హంగేరీ చిన్న పిల్లలకు శుభ్రమైన నీటిని సరఫరా చేస్తోంది. షుగరీ డ్రింక్స్ వల్ల చిన్న పిల్లలకు ఊబకాయం వస్తుంది. దమ్ము, షుగర్, బీపీ లాంటివి రావొచ్చు. శ్వాస ఆడకపోవడం వంటిది చోటుచేసుకోవచ్చు. కొందరు పిల్లలు గుండె జబ్బులు, పక్షవాతం, కేన్సర్లు లాంటి వాటికీ గురయ్యే అవకాశం ఉంది. దంతాల సమస్యలు కూడా వస్తాయి.ఈటింగ్ డిజార్డర్స్ వస్తాయి. చిన్న వయస్సులో ఊబకాయం వస్తే.. అందులో 30 శాతం మందిలో పెద్ద వయస్సులోనూ కొనసాగుతుంది. ఇలాంటి సమస్యలతో స్కూల్ అటెండెన్స్ తగ్గుతుందని డబ్ల్యూహెచ్‌ఓ తెలిపింది.
– డాక్టర్ ఎం.హరిత, అసోసియేట్ ప్రొఫెసర్, ఓరల్ మెడిసిన్, నిజామాబాద్