Skip to main content

Dr B Sandhya, IPS: ప్రతి విద్యార్థి వార్తాపత్రికలు విధిగా చదవాలి

ఫిలింనగర్‌: విద్యార్థులు లక్ష్యాన్ని నిర్దేశించుకొని దాని సాధన కోసం నిరంతరం కృషి చేయడం ద్వారా బంగారు భవిష్యత్‌ను తీర్చిదిద్దుకోవచ్చునని కేరళ ఫైర్‌ అండ్‌ రెస్క్యూ సర్వీసెస్‌ డీజీ, ఐపీఎస్‌ అధికారిణి డాక్టర్‌ బి.సంధ్య అన్నారు.
Dr B Sandhya, IPS
ప్రతి విద్యార్థి వార్తాపత్రికలు విధిగా చదవాలి

సెప్టెంబ‌ర్ 1న‌ జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెం. 45లోని భారతీయ విద్యాభవన్స్‌ ఆత్మకూరి రామారావు స్కూల్‌లో నిర్వహించిన సైబర్‌ క్లబ్‌ యాక్టివిటీ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. ఉపాధ్యాయులను స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. నో టూ డ్రగ్స్‌పై విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు.

చదవండి: Residential school: ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో బోధన

నైపుణ్యాలపై దృష్టి పెట్టాలని సూచించారు. ప్రతిరోజూ ప్రతి విద్యార్థి తప్పనిసరిగా పది నిమిషాలు వార్తాపత్రికలు చదవడం ద్వారా ఎంతో జ్ఞానాన్ని సంపాదించుకోవచ్చునని, వ్యక్తిత్వ వికాసాన్ని మెరుగుపర్చుకోవచ్చునని వెల్లడించారు. మంచి అలవాట్లపై విద్యార్థులు దృష్టి పెట్టాలన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు అడిగిన పలు సందేహాలను నివృత్తి చేశారు. సైబర్‌ క్రైం నుంచి ఎలా బయటపడవచ్చో వెల్లడించారు. కార్యక్రమంలో స్కూల్‌ ప్రిన్సిపాల్‌ శ్రీలతా నాయర్‌ తదితరులు పాల్గొన్నారు.

చదవండి: Academic Calendar: సిలబస్‌ను కచ్చితంగా పూర్తి చేయాలి

Published date : 02 Sep 2023 04:57PM

Photo Stories