Skip to main content

Residential school: ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో బోధన

వేటపాలెం: రెసిడెన్సియల్‌ పాఠశాలలో విద్యార్థులకు మౌలిక వసతుల కల్పనతో పాటు ప్రైవేటుకు దీటుగా బోధన చేయాలని ఎస్సీ స్టాండింగ్‌ వెల్ఫేర్‌ కమిటీ మెంబర్‌, వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు ఎమ్మెల్సీ పోతుల సునీత సూచించారు.
హాస్టల్‌లో భోజనాన్ని పరీశీలిస్తున్న సునీత
హాస్టల్‌లో భోజనాన్ని పరీశీలిస్తున్న సునీత

ఆమె గురువారం మండలంలోని దేశాయిపేటలో గల మహాత్మా జ్యోతిరావు పూలే వెనకబడిన తరగతుల సంక్షేమ హాస్టల్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. వసతి గృహంలో విద్యార్థులకు అందుతున్న సదుపాయాల్ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. ప్రభుత్వం ప్రకటించిన మెనూ పాటిస్తున్నారా లేదా అని విద్యార్థుల్ని అడిగి తెలుకున్నారు. విద్య, వైద్యంపై సీఎం వై.ఎస్‌. జగన్‌ మోహన్‌రెడ్డి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని తెలిపారు. నాడు–నేడు కింద రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్ని కార్పొరేటుకు దీటుగా మార్చారని చెప్పారు. విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చారని గుర్తుచేశారు.  

Also read: Tenth class Exam fee: టెన్త్‌ ఫెయిల్‌ అయిన విద్యార్థులకు అలర్ట్‌

Published date : 01 Sep 2023 06:41PM

Photo Stories