Tenth class Exam fee: టెన్త్ ఫెయిల్ అయిన విద్యార్థులకు అలర్ట్
Sakshi Education
ఆరిలోవ: పదో తరగతిలో ఫెయిల్ అయిన విద్యార్థులు 2024లో జరిగే పబ్లిక్ పరీక్షలు రాయడానికి ఈ నెల 15లోగా ఫీజు చెల్లించాలని డీఈవో ఎల్.చంద్రకళ ఓ ప్రకటనలో తెలిపారు.
వారికి సంబంధించిన నామినల్ రోల్స్, డాక్యుమెంట్లను హెచ్‌ఎంలు అదే తేదీలోగా ఆన్‌లైన్‌లో పంపించాలని సూచించారు. విద్యార్థులు https:// www. bse. ap. gov. in/ ను సందర్శించి పరీక్ష ఫీజు చెల్లించాలన్నారు. మూడు కంటే ఎక్కువ సబ్జెక్టులకు రూ.125, మూడు, అంతకంటే తక్కువ సబ్జెక్టులకు రూ.110, మైగ్రేషన్ సర్టిఫికెట్ కావాల్సిన వారు రూ. 80 చెల్లించాలని పేర్కొన్నారు. గడువు దాటితే.. ఈ నెల 16 నుంచి 20 వరకు రూ.50, 21 నుంచి 25వ తేదీ వరకు రూ.200, ఈ నెల 26 నుంచి 30వ తేదీ వరకు రూ.500 ఆలస్య రుసుంతో పరీక్ష ఫీజు చెల్లించవచ్చన్నారు. పాఠశాల నోటీస్ బోర్డుల్లో పూర్తి వివరాలు పొందుపరచాలని హెచ్‌ఎంలను డీఈవో ఆదేశించారు.
Also read: Govt Junior College: గెస్ట్ ఫ్యాకల్టీకి దరఖాస్తుల ఆహ్వానం
ఈ నెల 15లోగా పరీక్ష ఫీజు చెల్లించాలి
Published date : 01 Sep 2023 06:15PM