Telangana: 15, 19న గణిత ప్రతిభా పరీక్షలు
Sakshi Education
కామారెడ్డి టౌన్: జాతీయ గణిత దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను ప్రోత్సహించేందుకు గణిత దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గణిత ప్రతిభా పరీక్షలను విజయవంతంగా నిర్వహించాలని డీఈవో ఎస్ రాజు ఉపాధ్యాయులకు సూచించారు.
ఈ మేరకు డిసెంబర్ 12నఉత్తర్వులు జారీ చేశారు. మండల స్థాయిలో డిసెంబర్ 15న, జిల్లా స్థాయిలో 19వ తేదీన డివిజన్ కేంద్రాల్లో పరీక్ష నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
చదవండి: NCERT: మేథ్స్‌లో మనోళ్లు తగ్గుతున్నారు
కార్యక్రమంలో తెలంగాణ గణితఫోరం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తాడ్వాయి శ్రీనివాస్, జిల్లా అధ్యక్షుడు వేణుగోపాల్, ప్రధాన కార్యదర్శి రామారావు, కోశాధికారి నరేందర్, డివిజన్ అధ్యక్షుడు రామకృష్ణ, సిద్ధిరామాగౌడ్, విష్ణువర్ధన్ తదితరులు పాల్గొన్నారు.
Published date : 13 Dec 2023 03:06PM