Skip to main content

Collector VP Gautham: పాఠాలు చెప్పి.. ప్రశ్నలు అడిగి.. శ‌భాష్ కలెక్టర్ గారు..

నేలకొండపల్లి: తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం పైనంపల్లి ప్రభుత్వ పాఠశాలలో కలెక్టర్‌ వీపీ గౌతమ్‌ నవంబర్‌ 18న ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
Collector VP Gautham
విద్యార్థిని సందేహాలు నివృత్తి చేస్తున్న కలెక్టర్‌ గౌతమ్‌

ఈ సందర్భంగా ఉపాధ్యాయులతో మాట్లాడి తొలిమెట్టు కార్యక్రమం అమలుపై ఆరా తీశాక విద్యార్థుల సామర్థ్యాలను పరీక్షించారు. పలువురు విద్యార్థులకు ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టడంతో పాటు కొన్ని పాఠ్యాంశాల్లోని సందేహాలను నివృత్తి చేశారు.

చదవండి: IAS Success Story :ఈ కలెక్టర్ చూడ్డానికి కూల్‌.. కానీ ప‌నిలో మాత్రం హార్డ్‌..

సమాధానాలు సరిగ్గా చెప్పిన వారిని అభినందించడంతో విద్యార్థులు ఉప్పొంగిపోయారు. అనంతరం స్థానిక జెడ్పీ, మండల పరిషత్‌ పాఠశాలల్లో మన ఊరు–మన బడి కింద జరుగుతున్న పనులను పరిశీలించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ మధుసూదన్, డీఈవో యాదయ్య పాల్గొన్నారు.

చదవండి: Inspiring Success Story: అప్పుడు స్వీపర్.. ఇప్పుడు డిప్యూటీ కలెక్టర్‌.. ఎన్నో క‌ష్టాలు ఎదుర్కొని..

Published date : 19 Nov 2022 02:38PM

Photo Stories