Inspiring Success Story: అప్పుడు స్వీపర్.. ఇప్పుడు డిప్యూటీ కలెక్టర్.. ఎన్నో కష్టాలు ఎదుర్కొని..
తమ కష్టపుకథలు మరికొందరిలో స్ఫూర్తి నింపాలనేదే వాళ్ల ఉద్దేశం కూడా. రాజస్థాన్‌కి చెందిన ఆశ కందారా గాథ కూడా అలాంటిదే.
ఆశ కందారా.. రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో మునిసిపల్ కార్పొరేషన్‌లో పని చేసిన ఒక స్వీపర్. 2016 నుంచి కాంట్రాక్ట్ సర్వీస్‌లో కొనసాగిన ఆమెకు.. పర్మినెంట్ ఎంప్లాయి లెటర్‌ను చేతిలో పెట్టారు అధికారులు. ఆ సంతోషం మరువక ముందే.. ఏకంగా ఆమె తన లక్క్ష్యం అందుకుంది. రాజస్థాన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఎగ్జామ్‌లో 728 ర్యాంక్‌తో ఉత్తీర్ణత సాధించింది. దీంతో త్వరలో ప్రభుత్వాధికారి హోదాలో ఆమె బాధ్యతల్ని చేపట్టబోతోంది. నిజానికే రెండేళ్ల క్రితమే ఆమె పరీక్షలకు, ఇంటర్వ్యకు హాజరుకాగా.. కరోనా కారణంగా ఆలస్యం అవుతూ చివరికి ఫలితాలు వెలువడ్డాయి.
ఇద్దరు పిల్లలు పుట్టాక..
1997లో ఆశ చదువు ఆపేయించి మరీ పెళ్లి చేశారు ఆమె తల్లిదండ్రులు. ఇద్దరు పిల్లలు పుట్టాక మరో మహిళతో సంబంధం పెట్టుకుని.. ఆమెను వదిలేశాడు భర్త. దీంతో ఆమె పుట్టింటికి చేరింది. భర్తను అదుపులో పెట్టుకోలేకపోయిందంటూ సమాజం మొత్తం ఆశదే తప్పని నిందించింది. కానీ, ఆమె అవేం పట్టించుకోలేదు. ఇంట్లో చిన్నచిన్న పనులు చేస్తూనే.. పేరెంట్స్ సహకారంతో చదువును కొనసాగించింది. 2016లో ఎట్టకేలకు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. కుటుంబానికి భారం కాకూడదనే ఉద్దేశంతో మున్సిపల్ కార్పొరేషన్‌లో టెంపరరీ స్వీపర్ పోస్టులకు ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయ్యింది.
ఓ వైపు ఉద్యోగిగా విధులు నిర్వర్తిస్తూనే..
ఓ వైపు ఉద్యోగిగా విధులు నిర్వర్తిస్తూనే.. మరోవైపు చదువుకుంటూ.. డిగ్రీ పూర్తి చేశారు. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత ఆశ.. ప్రభుత్వ ఉద్యోగాల కోసం చదవడం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో 2018 లో ఆర్ఏఎస్ పరీక్షలు రాశారు.
ఓ రోజు విధుల్లో ఉండగా హఠాత్తుగా పై అధికారులు..
ఆశకు ప్రేరణ తన పై అధికారులే. రోజూ వాళ్ల గదుల్ని, ఆఫీసు పరిసరాల్ని శుభ్రం చేయడం, కిందిస్థాయి ఉద్యోగుల నుంచి వాళ్లు గౌరవం అందుకోవడం ఆమెను ఆకర్షించేవట. ఓరోజు విధుల్లో ఉండగా హఠాత్తుగా పైఅధికారులు ఇన్‌స్పెక్షన్‌కు వచ్చారు. అప్పటిదాకా తనతో సరదాగా గడిపిన తోటి ఉద్యోగులు ఒక్కసారిగా నిలబడి వాళ్లకు సెల్యూట్ చేయడంతో, ఆ గౌరవం తనకూ దక్కాలని ఆమె నిర్ణయించుకుంది. అయితే పరిస్థితులు అందుకు ప్రతికూలంగా ఉన్నాయని తెలిసినా ఆమె ఆశను వదులకోలేదు. పిల్లల పోషణ కోసం ఓవైపు 10 గంటలు స్వీపర్‌గా పని చేస్తూనే.. ఆర్‌ఏఎస్ ఎగ్జామ్‌లకు కష్టపడి ప్రిపేర్ అయ్యింది. చివరికి తన కలను నెరవేర్చుకోవడంతో పాటు డిప్యూటీ కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించింది..ఆశా కందారా. ‘ఈ విజయం నా కుటుంబానికే అంకితం. నా నిర్ణయాన్ని గౌరవించి, నాకు అండగా నిలబడినందుకే ఈ గెలుపు సాధ్యమైంది’ అని సంతోషంగా చెప్తోందామె. ఈమె జీవితం పూర్తిగా మారిపోయింది. కారు, మంచి జీతం, సమాజంలో గౌరవం అన్నీ ఆమె చెంతకు చేరాయి. దీంతో ఆశపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తుంది, పట్టుదల ఉంటే అసాధ్యాన్ని సుసాధ్యం చేయవచ్చని ఆశా మరోసారి నిరూపించారని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Inspirational Story: డీఎస్సీ ఉద్యోగాన్ని సాధించానిలా.. ఈ విషయాన్ని గర్వంగా చెప్పగలను..
Inspirational Story : పేద కుటుంబంలో పుట్టాను..నా కుమారుడికి వైద్యం కోసమే గ్రూప్–1 సాధించానిలా..