Skip to main content

New changes in intermediate Exams: ఇకనుంచి ఇంటర్‌ పరీక్షల్లో కొత్త మార్పులు

Government and private junior college students taking exams   intermediate exams new changes  New exam method in junior colleges
intermediate exams new changes

శ్రీకాకుళం న్యూకాలనీ: ఇంటర్‌ విద్యార్థులకు ప్రభుత్వం కొత్త పంథాలో పరీక్షలు నిర్వహించనుంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు అన్ని యాజమాన్యాల జూనియర్‌ కళాశాలల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఒకే ప్రశ్న పత్రంతో విద్యార్థులు పరీక్షలు రాసేలా నిర్ణయించింది. మంగళవారం నుంచి మొదలుకానున్న త్రైమాసిక(క్వార్టర్లీ) పరీక్షలతో ఈ విధానం అమల్లోకి రానుంది.

10వ తరగతి అర్హతతో ప్రభుత్వ పాఠశాలల్లో లైబ్రరీ క్లర్క్‌ ఉద్యోగాలు.. జీతం 32వేలు: Click Here

50 మార్కులకు ప్రశ్న పత్రం..

రాష్ట్రవ్యాప్తంగా ఒకే ప్రశ్న పత్రంతో పరీక్షలు రాయనున్న నేపథ్యంలో నిర్దేశించిన సిలబస్‌లను పూర్తిచేయడం లెక్చరర్లకు కత్తిమీద సాములా తయారైంది. వరుసగా సెలవులు, తుఫాను సెలవులు, అడ్మిషన్ల ప్రక్రియను ఆగస్ట్‌ నెల వరకు చేపట్టడం వంటి కారణాలతో మెజారిటీ కాలేజీల్లో సిలబస్‌లు పూర్తికాలేదు. దీంతో విద్యార్థులకు కొన్ని ముఖ్యమైన ప్ర శ్నలను తెలియజేసి నేర్పిస్తున్నారు.

10వ తరగతి అర్హతతో Income Tax Department లో అటెండర్‌, క్లర్క్‌ ఉద్యోగాలు నెలకు జీతం 40వేలు: Click Here

ఈ నేపథ్యంలో ప్రశ్న పత్రం ఏవిధంగా ఉంటుందోనని తలలు పట్టుకుంటున్నారు. క్వార్టర్లీ పరీక్షలను ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు ప్రథమ సంవత్స రం విద్యార్థులకు, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు నిర్వహించనున్నారు. జిల్లా ఇంట ర్మీడియెట్‌ విద్య డీవీఈఓ శివ్వాల తవిటినాయుడు నేతృత్వంలో ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టారు. ప్రిన్సిపాళ్లతో పలు దఫాలుగా సమీక్షించారు.

గంట ముందు ప్రశ్న పత్రం..

పరీక్షకు గంట ముందు ప్రశ్న పత్రాన్ని జ్ఞానభూమి లాగిన్‌ ఇంటర్‌బోర్డు వెబ్‌పోర్టల్‌లో అందుబాటులో ఉంచుతారు. కాలేజ్‌ లాగిన్‌లో ప్రశ్న పత్రం ప్రిన్సిపాల్‌కు చేరుతుంది. ఐడీ, పాస్‌వార్డు ద్వారా క్వశ్చన్‌పేపర్‌ డౌన్‌లోడ్‌ చేసుకుని ప్రింటౌట్స్‌ తీసి, కళాశాలల్లో నిర్దిష్టమైన సమయానికి విద్యార్థులకు అందజేసి పరీక్షలను రాయిస్తారు. విద్యార్థులకు వచ్చిన మార్కులను ఐదు రోజుల్లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేస్తారు.

అనంతరం తల్లిదండ్రులతో సమావేశ పరిచి వారి పిల్లల ప్రగతి, చదువు తీరును తెలియజేసేలా కసరత్తులు చేస్తున్నారు.

Published date : 17 Oct 2024 08:20AM

Photo Stories