Skip to main content

KGBV jobs: KGBVలో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌

KGBV jobs
KGBV jobs

పుట్టపర్తి: కస్తూర్భాగాంధీ గురుకుల బాలికల పాఠశాలల్లో ఖాళీగా ఉద్యోగాలను తాత్కాలిక ప్రాతిపాదికన భర్తీ చేసేందుకు ప్రభుత్వం గురువారం నోటిఫికేషన్‌ విడుదల చేసిందని డీఈఓ మీనాక్షి ఒక ప్రకటనలో తెలిపారు.

కంప్యూటర్‌ స్కిల్స్‌, స్పోకన్‌ ఇంగ్లిష్‌, ఇంటర్య్వూ స్కిల్స్‌పై ఉచిత శిక్షణ: Click Here

ఖాళీల వివరాలిలా..

ప్రిన్సిపాల్‌–1, సీఆర్‌టీ–18, పీజీటీ–30, అకౌంటెంట్‌–04, వార్డెన్‌–05, పార్ట్‌ టైం టీచర్లు–12 మొత్తం 70 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. అర్హులైన మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఆసక్తి కలవారు ఈ నెల 10వ తేదీ లోపు తమ దరఖాస్తులు ఆన్‌లైన్‌లో చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు http:// apkgbv. apcfss.in వెబ్‌సైట్‌ను సందర్శించారు.

Published date : 04 Oct 2024 09:07PM

Photo Stories