Skip to main content

Robo Teacher: పాఠశాలలో ‘ఐరిస్‌ రోబో’ ఆవిష్కరణ

కూకట్‌పల్లి: కేపీహెచ్‌బీకాలనీలోని నెక్ట్‌స్‌ జెన్‌ స్కూల్‌లో జూన్ 10న‌ ఏ1 టీచర్‌ ఐరిస్‌ అనే రోబో టీచర్‌ను ప్రవేశపెట్టారు.

నెక్ట్‌స్‌ జెన్‌ వ్యవస్థాపకుడు రఘు కంకణాల, హరిసాగర్‌ దీనిని ప్రారంభించారు. ఈ రోబో ద్వారా విద్యార్థులు అడిగే పలు ప్రశ్నలకు సమాధానం చెబుతుంది. నర్సరీ నుంచి పదోతరగతి వరకు సబ్జెక్టులను బోధిస్తుంది. ప్రస్తుతం ఇంగ్లిష్‌, హిందీ, ఫ్రెంచ్‌ భాషల్లో మాట్లాడుతుంది.

చదవండి: Personal Robots: ప్రపంచ నంబ‌ర్ వ‌న్ హోమ్ రోబోట్ ప్రాజెక్ట్.. దీని అవకాశాలు, సవాళ్లు ఇవే..!

దీనిని తెలుగుతో సహా 20కి పైగా భాషలకు విస్తరించాలని యోచిస్తున్నారు. ఈ ఐరిస్‌ తరగతి గది చుట్టూ.. తిరుగుతూ విద్యార్థులు అడిగే పలు ప్రశ్నలకు సమాధానం చెప్పడమేగాక ఉపాధ్యాయులకు సహాయకారిగా ఉంటుంది. క్విజ్‌ వంటి కార్యక్రమాలను నిర్వహిస్తుంది. దీన్ని ప్రవేశపెట్టడం వల్ల విద్యార్థుల్లో ఆనందంగా ఉండటంతో పాటు విద్య నేర్చుకోవటానికి ఆసక్తి కనబరుస్తారని నిర్వాహకులు తెలిపారు.

మరిన్ని ఐరిస్‌లను ప్రవేశపెట్టడం వల్ల ఉపాధ్యాయులపై పనిభారాన్ని తగ్గించటమే కాకుండా సంక్లిష్టమైన బోధనా పనులపై దృష్టి పెట్టడానికి వీలు కలుగుతుందన్నారు. ఐరిస్‌తో సెల్ఫీ దిగేందుకు ఉపాధ్యాయులు, విద్యార్థులు పోటీ పడ్డారు.

Published date : 12 Jun 2024 09:42AM

Photo Stories