Personal Robots: ప్రపంచ నంబర్ వన్ హోమ్ రోబోట్ ప్రాజెక్ట్.. దీని అవకాశాలు, సవాళ్లు ఇవే..!
ఈ క్రమంలో ఆటోమొబైల్ రంగంలోకి 'ప్రాజెక్ట్ టైటన్' ద్వారా అడుగుపెట్టాలని భావించినప్పటికీ, కొన్ని కారణాల వల్ల దాన్ని రద్దు చేసింది.
అయితే, తాజా సమాచారం ప్రకారం యాపిల్ మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌తో హోమ్ రోబోటిక్స్ రంగంలోకి ప్రవేశించాలని యోచిస్తోంది. ఈ రోబో ఇంటి యజమానిని అనుసరిస్తూ పనులలో సాయపడటంతో పాటు వీడియో కాన్ఫరెన్స్‌లలో డిస్‌ప్లేగా కూడా ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.
ఈ ప్రాజెక్ట్ ఇంకా ఆరంభ దశలోనే ఉన్నప్పటికీ, యాపిల్ హార్డ్‌వేర్ ఇంజినీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ విభాగాలు దీనిపై పనిచేస్తున్నట్లు తెలుస్తోంది.
Cognizant Employees: ఆశగా ఎదురుచూస్తున్న కాగ్నిజెంట్ ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్
యాపిల్ హోమ్ రోబోట్ ప్రాజెక్ట్ అవకాశాలు..
➤ ఇంటి పనులను సులభతరం చేయడం.
➤ వృద్ధులు, వికలాంగులకు సహాయం చేయడం.
➤ వినోదం, సమాచారం అందించడం.
➤ ఇంటి భద్రతను పెంచడం.
ఈ ప్రాజెక్ట్ సవాళ్లు ఇవే..
ధర: ఈ రోబో ధర చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.
గోప్యత: ఈ రోబో ద్వారా వ్యక్తిగత సమాచారం దుర్వినియోగం కావచ్చనే ఆందోళనలు ఉన్నాయి.
టెక్నాలజీ: ఈ రోబో అభివృద్ధి చాలా క్లిష్టమైన టెక్నాలజీని
పోటీ: ఇప్పటికే అమెజాన్, సామ్‌సంగ్ వంటి కంపెనీలు హోమ్ రోబోట్‌లను మార్కెట్‌లోకి తీసుకువచ్చాయి.