Intermediate: పరీక్షల ఫీజు గడువు పెంపు.. షెడ్యూల్ ఇలా..
Sakshi Education
ఇంటర్ పరీక్షల ఫీజు చెల్లింపు గడువును పొడిగించారు. కరోనా కారణంగా సెలవులు పొడిగించడంతో ఈమేరకు నిర్ణయం తీసుకున్నట్టు తెలంగాణ ఇంటర్ బోర్డు జనవరి 22న ఓ ప్రకటనలో తెలిపింది.
ఏప్రిల్‌లో జరిగే ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షలకు అపరాధ రుసుము లేకుండా జనవరి 24 వరకు ఫీజు చెల్లించవచ్చని గతంలో పేర్కొంది. తాజాగా ఈ గడువును ఫిబ్రవరి 4వ తేదీ వరకు పొడిగించారు. ప్రథమ సంవత్సరం ఆర్ట్స్, అండ్ సైన్స్ గ్రూపులకు, ద్వితీయ సంవత్సరం ఆర్ట్స్ గ్రూపులకు రూ.490, ద్వితీయ సంవత్సరం సైన్స్ గ్రూపులకు రూ.690 ఫీజును నిర్ణయించారు. ఒకేషనల్ కోర్సులకు ఫస్టియర్‌కు రూ.690, సెకండియర్‌కు రూ.840 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
ఇదీ షెడ్యూల్
ఫీజు చెల్లింపు గడువు (ఫైన్ లేకుండా) |
5–1–2022 నుంచి 4–2–2022 |
రూ. 200 ఫైన్ తో |
10–2–2022 |
రూ. 1,000 ఫైన్ తో |
17–2–2022 |
రూ. 2 వేల ఫైన్ తో |
24–2–2022 |
చదవండి:
Spoken English: బోధించే స్థాయిలో ఆంగ్ల శిక్షణ
Published date : 24 Jan 2022 05:21PM