DEO Udaybabu: విద్యావ్యవస్థ బలోపేతానికి కృషి చేయాలి
జిల్లా కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాలలో ఆగస్టు 18న కాంప్లెక్స్ రిసోర్స్ పర్సన్లకు జిల్లాస్థాయి శిక్షణ శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయ్‌బాబు మాట్లాడుతూ రిసోర్స్‌పర్సన్లు శిక్షణను వినియోగించుకోవాలని సూచించారు. కాంప్లెక్స్‌ల పరిధిలోని అన్ని పాఠశాలల్లో రీడింగ్ క్యాంపెయిన్ పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. విద్యార్థుల్లో పఠనాభివృద్ధి పెంపొందించేందుకు కృషి చేయాలన్నారు.
చదవండి: Digital Library: విద్యార్థులకు చక్కటి అవకాశం E–లైబ్రరీ
ప్రతీ విద్యార్థికి చదవడం, రాయడం వచ్చేలా చూడాలన్నారు. అలాగే సీఆర్పీలు గ్రంథాలయాల పుస్తకాలు సక్రమంగా వినియోగించుకునేలా దిశానిర్దేశం చేయాలని ఆదేశించారు. అనంతరం రీడింగ్ క్యాంపెయిన్ పోస్టర్లు విడుదల చేశారు. కార్యక్రమంలో అకాడమి క్ మానిటరింగ్ అధికారి శ్రీనివాస్, ఎస్‌వోలు సుభాష్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.