Skip to main content

Digital Library: విద్యార్థులకు చక్కటి అవకాశం E–లైబ్రరీ

లబ్బీపేట(విజయవాడతూర్పు): డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వెబ్‌బేస్డ్‌ ఈ–లైబ్రరీని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని యూనివర్సిటీ వైస్‌ చాన్సలర్‌ డాక్టర్‌ కె.బాబ్జి పేర్కొన్నారు.
మాట్లాడుతున్న హెల్త్‌ యూనివర్సిటీ వీసీ డాక్టర్‌ బాబ్జి
మాట్లాడుతున్న హెల్త్‌ యూనివర్సిటీ వీసీ డాక్టర్‌ బాబ్జి

డిజిటల్‌ లైబ్రరీపై అవగాహన కల్పించేందుకు గురువారం సిద్ధార్థ వైద్య కళాశాల, ప్రభుత్వ దంత వైద్య కళాశాల, నర్సింగ్‌ కళాశాలల ప్రొఫెసర్‌, ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ విద్యార్థులు, పీజీ విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో వీసీ డాక్టర్‌ బాబ్జి మాట్లాడుతూ..

Also read: Open Schoolను సద్వినియోగం చేసుకోండి

వెబ్‌బేస్ట్‌ ఈ–లైబ్రరీలో ముఖ్యమైన జర్నల్స్‌, టెక్ట్స్‌ బుక్స్‌, పరిశోధనా పత్రాలు, విభిన్న దేశాల్లోని రీసెంట్‌ అంశాలు అందుబాటులో ఉంటాయన్నారు. దీనిని సద్వినియోగం చేసుకునేందుకు ఫ్యాకల్టీ మెంబర్స్‌, విద్యార్థులు తమ ఈ–మెయిల్‌ ద్వారా మైలాప్ట్‌లో రిజిస్ట్రేషన్‌ పొందాలని సూచించారు. ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్‌ డాక్టర్‌ వి.రాధికారెడ్డి, పబ్లికేషన్స్‌ కో ఆర్డినేటర్‌ డాక్టర్‌ కె.సుధ, సిద్ధార్థ వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ కంచర్ల సుధాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Also read: Free training: ఐటీ, టూరిజం, హాస్పిటాలిటీలో ఉచిత శిక్షణ

Published date : 18 Aug 2023 05:32PM

Photo Stories