Skip to main content

Free training: ఐటీ, టూరిజం, హాస్పిటాలిటీలో ఉచిత శిక్షణ

పార్వతీపురంటౌన్‌: ఐటీ/టూరిజం అండ్‌ హాస్పిటాలిటీ/రంగాల్లో శిక్షణ కోసం రాష్ట్ర నైఫుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో యూత్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ సీతంపేట కేంద్రంలో ఈ నెల 23వ తేదీ వరకు అభ్యర్థుల ఎంపిక నిర్వహించనున్నట్లు నైపుణ్యాభివృద్ధి సంస్థ జిల్లా అధికారి ఉరిటి సాయికుమార్‌ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు.
ఐటీ, టూరిజం, హాస్పిటాలిటీలో ఉచిత శిక్షణ
ఐటీ, టూరిజం, హాస్పిటాలిటీలో ఉచిత శిక్షణ

ఎంపికై న అభ్యర్థులకు డీడీయూజీకేవై, సీడాప్‌, ఏపీఎస్‌ఎస్‌ డీసీ ఆధ్వర్యంలో నాలుగు నెలల పాటు ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. శిక్షణ సమయంలో అభ్యర్థులకు ఉచిత వసతి, భోజనంతో పాటు మెటీరియల్స్‌ అందజేస్తామని, తరగతులు పూర్తయ్యాక ఉపాధి కల్పిస్తామని స్పష్టం చేశారు.

Also read: Jobs in Hetero Drugs: August 21న క్యాంపస్‌ ఇంటర్వ్యూలు..

మెకానికల్‌, ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌, సివిల్‌, ఆటోమోటివ్‌ అండ్‌ ఏరోస్పేస్‌లో బి.టెక్‌/డిప్లమో విభాగాల్లో 2020, 2021, 2022 సంవత్సరాల్లో ఉత్తీర్ణత సాధించి, 18 నుంచి 23 ఏళ్ల వయసుగల యువకులు శిక్షణకు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తి గల వారు సంబంధిత విద్యార్హత పత్రాలతో యూత్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ సీతంపేట కేంద్రానికి ఈ నెల 23వ తేదీలోగా హాజరు కావాలని కోరారు. పార్వతీపురం మన్యం జిల్లా స్కిల్‌ కాలేజ్‌లో శిక్షణ ఉంటుందని తెలియజేశారు. మరిన్ని వివరాల కోసం ఫోన్‌ 7032060773నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.

Also read: APPSC Exams 2023: పోటీ పరీక్షల నిర్వహణకు పక్కా ఏర్పాట్లు.. August 19 నుంచి యూపీఎస్సీ పరీక్షలు..

Published date : 18 Aug 2023 04:49PM

Photo Stories